EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/karnataka4398fdab-f57c-4295-80ae-2c20015cfefa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/karnataka4398fdab-f57c-4295-80ae-2c20015cfefa-415x250-IndiaHerald.jpgనేరాభియోగాలు ఎదుర్కొని ఎన్నికల్లో నిలబడే వారిని కూడా ప్రజలు గెలిపిస్తున్నారు. కాబట్టి ఏ నాయకుడు అయితే ఎన్నికల్లో పోటీలో నిలుచుంటున్నాడో వారు ఎన్నికల ఆఫిడవిట్ లో కేసులకు సంబంధించిన వివరాలు పొందుపరచాలి. దీన్ని ఈసీ ఆదేశించింది. సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. ఈ లెక్కలను ఏడీఆర్ నివేదిక రూపంలో బయట పెడుతుంటారు. అయినా ప్రజలు వారిని ఎన్నుకుంటారు. ఇలా నేరాలకు సంబందించిన ఆరోపణలు ఉన్న వారిని ఎన్నుకుంటారు. కానీ ఏ నేరం చేయని వారు ఎన్నికల్లో ఓటమి పాలవుతుంటారు. ఇది విచిత్రంగా అనిపించినా ఇండియా లో జరుగుతునkarnataka{#}Congress;Congress-NCP;96;Supreme Court;Election Commission;CPI;politics;India;Bharatiya Janata Partyకర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?karnataka{#}Congress;Congress-NCP;96;Supreme Court;Election Commission;CPI;politics;India;Bharatiya Janata PartyWed, 10 May 2023 05:00:00 GMTనేరాభియోగాలు ఎదుర్కొని ఎన్నికల్లో నిలబడే వారిని కూడా ప్రజలు గెలిపిస్తున్నారు. కాబట్టి ఏ నాయకుడు అయితే ఎన్నికల్లో పోటీలో నిలుచుంటున్నాడో వారు ఎన్నికల ఆఫిడవిట్ లో కేసులకు సంబంధించిన వివరాలు పొందుపరచాలి. దీన్ని ఈసీ ఆదేశించింది. సుప్రీం కోర్టు కూడా  సమర్థించింది. ఈ లెక్కలను ఏడీఆర్ నివేదిక రూపంలో బయట పెడుతుంటారు. అయినా ప్రజలు వారిని ఎన్నుకుంటారు. ఇలా నేరాలకు సంబందించిన ఆరోపణలు ఉన్న వారిని ఎన్నుకుంటారు.


కానీ ఏ నేరం చేయని వారు ఎన్నికల్లో ఓటమి పాలవుతుంటారు. ఇది విచిత్రంగా అనిపించినా ఇండియా లో జరుగుతున్నది ఇదే వాస్తవమని తెలుసుకోవాలి. వందల కేసులు ఉన్న వ్యక్తి కూడా ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకుల్లో మొత్తం 22 శాతం మందిపై నేరాభియోగాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో బీజేపీ తరఫున 224 మంది నామినేషన్లు వేస్తే 96 మందిపై కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ 222 మంది కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉంటే వారిలో 122 మంది పై కేసులు ఉన్నాయి.


జేడీఎస్ అభ్యర్థుల్లో 208 మంది కి గాను 70 మంది పై కేసులున్నాయి. అయితే ఇక్కడొక విచిత్రమైన విషయం ఏమిటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కూడా కేసులు ఉండటం. నీతి వంతమైన రాజకీయాలు చేస్తాం. అవినీతి చేయం అని చెప్పే ఆప్‌ పార్టీకి సంబంధించి 208 మంది నామినేషన్ వేస్తే 48 మందిపై కేసు లు ఉన్నాయి. ఎన్సీపీ అభ్యర్థులు 9మందికి ఇద్దరిపై, సీపీఐ అభ్యర్థులు ఒక్కరిపై, 900 మంది స్వతంత్ర అభ్యర్థులపై 109 మందిపై కేసులు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


గతంలో పోలిస్తే బీజేపీ, జేడీఎస్ ఎక్కువ మంది నేర చరిత గల వారికి టికెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఎక్కువ మంది నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి టికెట్లు ఇస్తే ప్రజలు కూడా వారిని అంగీకరించి గెలిపిస్తున్నారంటే ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : పవన్లో రెండో ఆలోచన మొదలైందా ?

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>