MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyana32d880e-01f2-477f-872d-8ce291f7cf9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyana32d880e-01f2-477f-872d-8ce291f7cf9d-415x250-IndiaHerald.jpgప్రస్తుత తరానికి చెందిన నలుగురు అబ్బాయిలు ఒకచోట కలిస్తే చాలు వారు ఒకరినొకరు ‘బ్రో’ అంటూ అభిమానంగా పిలుచుకుంటారు. స్నేహితులైనా జొమాటో డెలివరీ బాయ్ అయినా అందరికీ ఈ పిలుపు అలవాటైపోయింది. ఇప్పుడు ఈపదం ట్రెండింగ్ గా మారిపోవడంతో ఆపదాన్ని పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ల మూవీకి టైటిల్ గా పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు ఈమూవీ దర్శక నిర్మాతలకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమూవీకి కర్త కర్మ గా వ్యవహరిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఈవిషయమై చర్చలు జరుగుతున్నట్లు టాక్. వాస్తవానికి టాప్ హీరోల సినిమాలPAVANKALYAN{#}Pawan Kalyan;trivikram srinivas;Kartha;Zomato;Heroine;Remake;Samuthirakani;kalyan;News;Athadu;Cinemaపవన్ కళ్యాణ్ అభిమానులను ఖంగారు పెడుతున్న టైటిల్ !పవన్ కళ్యాణ్ అభిమానులను ఖంగారు పెడుతున్న టైటిల్ !PAVANKALYAN{#}Pawan Kalyan;trivikram srinivas;Kartha;Zomato;Heroine;Remake;Samuthirakani;kalyan;News;Athadu;CinemaWed, 10 May 2023 11:00:00 GMTప్రస్తుత తరానికి చెందిన నలుగురు అబ్బాయిలు ఒకచోట కలిస్తే చాలు వారు ఒకరినొకరు ‘బ్రో’ అంటూ అభిమానంగా పిలుచుకుంటారు. స్నేహితులైనా జొమాటో డెలివరీ బాయ్ అయినా అందరికీ ఈ పిలుపు అలవాటైపోయింది. ఇప్పుడు ఈపదం ట్రెండింగ్ గా మారిపోవడంతో ఆపదాన్ని పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ల మూవీకి టైటిల్ గా పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు ఈమూవీ దర్శక నిర్మాతలకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.  


ఈమూవీకి కర్త కర్మ గా వ్యవహరిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఈవిషయమై చర్చలు జరుగుతున్నట్లు టాక్. వాస్తవానికి టాప్ హీరోల సినిమాలకు ఇలాంటి ప్రయోగాత్మక టైటిల్స్ పెట్టడం చాల సాహసం. త్రివిక్రమ్ కు ఉన్న అక్షరాల సెంటిమెంట్ తో వెరైటీగా అనిపిస్తున్నప్పటికీ ఇలాంటి టైటిల్ పవన్ కళ్యాణ్ సినిమాకు వద్దు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి.


తమిళంలో హిట్ అయిన ‘వినోదయ సితం’ మూవీకి రీమేక్ గా సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈమూవీకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే సంభాషణలు అందిస్తున్నాడు. ఈసినిమాలో పవన్ దేవుడు గా కనిపించబోతున్నాడు. జీవితంలో ఫెయిల్ అయిన వ్యక్తికి అతడు కోరుకున్న విధంగా మళ్ళీ దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తే అతడి జీవితం ఎలా ఉంటుంది అన్న ఊహ చుట్టూ ఈమూవీ కథ ఉంటుంది. అలాంటి మంచి కథకు ఇలాంటి చెత్త టైటిల్ వద్దని ముందుగా ప్రచారంలోకి వచ్చిన ‘దేవర’ టైటిల్ ను ఫిక్స్ చేయమని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.


ఈ మూవీలో పవన్ కు హీరోయిన్ ఉండదు ఆవిషయమే పవన్ కళ్యాణ్ అభిమానులకు పూర్తిగా నచ్చడంలేదు. ఇప్పుడు ఇలాంటి వెరైటీ టైటిల్ పెట్టి పవన్ సినిమా స్థాయిని తగ్గించవద్దు అంటూ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. జూలైలో విడుదలకాబోతున్న ఈసినిమా ప్రమోషన్ ‘ఆదిపురుష్’ హడావిడి పూర్తి అయిన తరువాత ప్రారంభిస్తారని తెలుస్తోంది. సోషల్ మీడియాను కుదిపేస్తున్న ఈ టైటిల్ విషయంలో త్రివిక్రమ్ ఎలాంటి సలహా ఇస్తాడో అంటూ పవర్ స్టార్ అభిమానులు భయపడుతున్నట్లు టాక్..  





RRR Telugu Movie Review Rating

భారీ నష్టాలను ఎదుర్కొన్న ఆ 5 మీడియం రేంజ్ సినిమాలు ఇవే..!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>