PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nagababu-janasena-pawan-kalyane77ef58d-5ea3-45cf-b7bf-fa70a288f00d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nagababu-janasena-pawan-kalyane77ef58d-5ea3-45cf-b7bf-fa70a288f00d-415x250-IndiaHerald.jpg వ్యవహారం చూస్తుంటే అదే అనుమానం పెరిగిపోతోంది. ఉత్తరాంధ్ర, విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలిలో పార్టీ ఆఫీసు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడిన మాటల్లో మూడు పాయింట్లు కీలకమైనవి. అవేమిటంటే రాబోయేది జనసేన ప్రభుత్వమే. పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అవుతారు. మూడో పాయింట్ ఏమిటంటే జనసేనకు జనాధరణ విపరీతంగా పెరిగిపోతోంది. 2019లో 7 శాతం వచ్చిన ఓట్లు ఇపుడు అధికారికంగా 35 శాతానికి పెరిగిందట.nagababu janasena pawan kalyan{#}Survey;Nagababu;TDP;Telangana Chief Minister;Janasena;Vishakapatnam;News;Partyఉత్తరాంధ్ర : నాగబాబే జనసేనను ముంచేస్తారా ?ఉత్తరాంధ్ర : నాగబాబే జనసేనను ముంచేస్తారా ?nagababu janasena pawan kalyan{#}Survey;Nagababu;TDP;Telangana Chief Minister;Janasena;Vishakapatnam;News;PartyTue, 09 May 2023 03:00:00 GMT


వ్యవహారం చూస్తుంటే అదే అనుమానం పెరిగిపోతోంది. ఉత్తరాంధ్ర, విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలిలో పార్టీ ఆఫీసు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడిన మాటల్లో మూడు పాయింట్లు కీలకమైనవి. అవేమిటంటే రాబోయేది జనసేన ప్రభుత్వమే. పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అవుతారు. మూడో పాయింట్ ఏమిటంటే జనసేనకు జనాధరణ విపరీతంగా పెరిగిపోతోంది. 2019లో 7 శాతం వచ్చిన ఓట్లు ఇపుడు అధికారికంగా 35 శాతానికి పెరిగిందట.




7 శాతం ఓట్లు 35 శాతానికి ఎలా పెరిగిందో ? పెరిగినట్లు నాగబాబు దగ్గర ఉన్న ఆధారం ఏమిటో మాత్రం చెప్పలేదు. ఇంటింటికి తిరిగి పార్టీలు సర్వే చేసినపుడు ఏ పార్టీ వెళితే ఆ పార్టీకే ఓట్లేస్తామని చాలామంది చెబుతారు. అంతమాత్రాన వాళ్ళంతా సదరు పార్టీకే ఓట్లేస్తారని గ్యారెంటీలేదు. జనసేన ఇంటింటి సర్వేచేసినట్లు కూడా సమాచారం లేదు. మరి ఓట్ల శాతం 7 నుండి 35 శాతానికి పెరిగిందని నాగబాబు ఎలా చెప్పారో ? నిజంగానే ఓట్లశాతం 35 దగ్గరుంటే ఎన్నికల నాటికి మరింత పెరగటం ఖాయమేమో.




అంటే ఎన్నికలనాటికి సుమారు 40 శాతం ఓట్లుండే జనసేన పొత్తుకోసం చంద్రబాబునాయుడు వెంట ఎందుకు పడుతోంది ? 35-40 శాతం ఓటు బ్యాంకంటే చిన్న విషయం కాదు చాలా పెద్దదనే చెప్పాలి. నాగబాబు మాటలు వింటే జనసేన ఓటుబ్యాంకు టీడీపీ ఓటుబ్యాంకుకు దాదాపు సమానమన్నమాట.




మరంత ఓటుబ్యాంకున్న జనసేన హ్యాపీగా ఒంటరిగానే పోటీచేసి అధికారం దక్కించుకోవచ్చు కదా ? నాగబాబు ఎక్కడికెళ్ళినా జనసేన ప్రభుత్వమే ఏర్పాటవుతుంది, పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అవుతారని పదేపదే చెబుతున్నారు. అలా చెప్పటం వెనుక 35 శాతం ఓటుబ్యాంకే కారణమని అనిపిస్తోంది. ఇలా చెప్పి చెప్పి పవన్ను మాయచేసి జనసేనను ఒంటరిపోటీకి నాగబాబు రెడీచేస్తున్నారా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. అదే జరిగితే గతంలో పవన్ చెప్పినట్లు జనసేనకు రెండోసారి కూడా వీరమరణం తప్పదనే అనిపిస్తోంది.






RRR Telugu Movie Review Rating

ఉత్తరాంధ్ర : నాగబాబే జనసేనను ముంచేస్తారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>