MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas7efcc8c7-8ace-4612-a7b1-512f3ca2b4d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas7efcc8c7-8ace-4612-a7b1-512f3ca2b4d9-415x250-IndiaHerald.jpg‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ మరొక సాహసానికి సిద్దపడుతున్నాడు. శ్రీరాముడు పాత్ర చేయాలి అంటే దానికి చాల ధైర్యం ఉండాలి దీనికితోడు తెలుగు ప్రజలందరికీ శ్రీరాముడు పేరు వినగానే గుర్తుకు వచ్చే రూపం నందమూరి తారక రాముడి రూపం. ‘ఆదిపురుష్’ మూవీ ప్రభాస్ కెరియర్ లో అత్యంత కీలకంగా మారింది. ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలలో డబ్ చేయడమే కాకుండా 8 వేల ధియేటర్లలో విడుదల చేస్తున్నారు అన్న మాటలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు 35 వేల షోలు ప్రదర్శించే ఆస్కారంprabhas{#}prasad;Mumbai;Delhi;Event;Industry;Chennai;June;Calcutta;Indian;bollywood;Prabhas;media;Telugu;Hyderabad;Cinemaతెలుగు మీడియాను పట్టించుకోని ప్రభాస్ ?తెలుగు మీడియాను పట్టించుకోని ప్రభాస్ ?prabhas{#}prasad;Mumbai;Delhi;Event;Industry;Chennai;June;Calcutta;Indian;bollywood;Prabhas;media;Telugu;Hyderabad;CinemaTue, 09 May 2023 10:00:00 GMT‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ మరొక సాహసానికి సిద్దపడుతున్నాడు. శ్రీరాముడు పాత్ర చేయాలి అంటే దానికి చాల ధైర్యం ఉండాలి దీనికితోడు తెలుగు ప్రజలందరికీ శ్రీరాముడు పేరు వినగానే గుర్తుకు వచ్చే రూపం నందమూరి తారక రాముడి రూపం. ‘ఆదిపురుష్’ మూవీ ప్రభాస్ కెరియర్ లో అత్యంత కీలకంగా మారింది. ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలలో డబ్ చేయడమే కాకుండా 8 వేల ధియేటర్లలో విడుదల చేస్తున్నారు అన్న మాటలు వినిపిస్తున్నాయి.


ఈ సినిమాకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు 35 వేల షోలు ప్రదర్శించే ఆస్కారం ఉంది అంటున్నారు. ఇది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డ్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను నేడు ముంబాయ్ లో అత్యంత ఘనంగా విడుదల చేయబోతున్నారు. హైదరాబాద్ లో కూడ ప్రసాద్ ప్రీవ్యూ ధియేటర్లలో ఈ మూవీ ట్రైలర్ ను ఈరోజు మధ్యానం విడుదల చేస్తారు.


అయితే ప్రభాస్ హైదరాబాద్ లో జరిగే కార్యక్రమానికి హాజరు కాకుండా ముంబాయ్ లో జరిగే కార్యక్రమంలో బిజీగా ఉండబోతుతున్నాడు. అంతేకాదు జూన్ 16న విడుదల కాబోతున్న ఈ మూవీని ప్రమోట్ చేస్తూ అనేక బాలీవుడ్ పత్రికలకు అలాగే అనేక ప్రముఖ మీడియా సంస్థలకు ప్రభాస్ వరసపెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నాడు. అంతేకాదు ‘ఆదిపురుష్’ మూవీకి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్స్ ముంబాయి తో పాటు ఢిల్లీ లక్నో కలకత్తా నగరాలతో పాటు చెన్నై బెంగళూరు త్రివేండ్రంలో జరగబోతున్నాయి.


ఈవెంట్స్ అన్నింటికీ ప్రభాస్ కృతి సనన్ సైఫ్ ఆలీఖాన్ లు రాబోతున్నారు. ‘ఆదిపురుష్’ మూవీ ఈవెంట్ భాగ్యనగరంలో చివరగా ఈ మూవీ రిలీజ్ డేట్ కు ముందు జరగబోతోంది. దీనితో ప్రభాస్ తెలుగు మీడియాను అంతగా పట్టించుకోవడం లేదా అంటూ కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈరోజు విడుదల కాబోతున్న ఈమూవీ ట్రైలర్ కు వచ్చే స్పందనను బట్టి ఈమూవీ సాధించే విజయం ఆధారపడి ఉంటుంది..







RRR Telugu Movie Review Rating

హైదరాబాద్‌లో ఆ ప్లాట్లకు ఫుల్‌ డిమాండ్‌?

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?

రష్యాతో ఇండియా యాపారం.. నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>