Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/asia-cup0535359a-d1c9-4996-b101-843581070511-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/asia-cup0535359a-d1c9-4996-b101-843581070511-415x250-IndiaHerald.jpgఈ ఏడాది జరగబోయే ఆసియా కప్ గురించి గత కొంతకాలం నుంచి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ఇంత చర్చ జరగడానికి కారణం అటు పాకిస్తాన్లో ఆసియా కప్ జరగడమే అని చెప్పాలి. ఎందుకంటే అటు భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య క్రీడా సంబంధాలపై నిషేధం కొనసాగుతుంది. దీంతో ఇక ఇరు జట్లు కేవలం ఆసియా కప్, వరల్డ్ కప్లలో మినహా ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం లేదు. ఈ క్రమంలోనే పాకిస్తాన్లో నిర్వహించే ఆసియా కప్ కోసం తాము వెల్లబోమని.. తటస్థ వేదికపై నిర్వహిస్తేనే టోర్నీలో పాల్గొంటాము అంటూ ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ఇక ప్రపంచAsia cup{#}Cricket;Pakistan;Sri Lanka;BCCI;Indiaపంతం నెగ్గించుకున్న బీసీసీఐ.. ఆసియా కప్ వేదిక మార్పు?పంతం నెగ్గించుకున్న బీసీసీఐ.. ఆసియా కప్ వేదిక మార్పు?Asia cup{#}Cricket;Pakistan;Sri Lanka;BCCI;IndiaTue, 09 May 2023 10:30:00 GMTఈ ఏడాది జరగబోయే ఆసియా కప్ గురించి గత కొంతకాలం నుంచి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ఇంత చర్చ జరగడానికి కారణం అటు పాకిస్తాన్లో ఆసియా కప్ జరగడమే అని చెప్పాలి. ఎందుకంటే అటు భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య క్రీడా సంబంధాలపై నిషేధం కొనసాగుతుంది. దీంతో ఇక ఇరు జట్లు కేవలం ఆసియా కప్,  వరల్డ్ కప్లలో మినహా ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం లేదు. ఈ క్రమంలోనే పాకిస్తాన్లో నిర్వహించే ఆసియా కప్ కోసం తాము వెల్లబోమని.. తటస్థ వేదికపై నిర్వహిస్తేనే టోర్నీలో పాల్గొంటాము అంటూ ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది.


 అయితే ఇక ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతున్న బీసీసీఐ.. చెప్పిందే వేదంగా కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక బిసిసిఐ కోసం ఏకంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ రంగంలోకి దిగింది. అటు బీసీసీఐ ని ఒప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇక పాకిస్తాన్లో నిర్వహించాల్సిన ఆసియా కప్ వేదికను మార్చేందుకు ఎసిసి నిర్ణయం తీసుకుంది అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈసారి ఆసియా కప్ శ్రీలంకలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక యూఏఈ లో కూడా నిర్వహించే ఛాన్స్ ఉంది అంటూ టాక్ వినిపిస్తుంది


 అయితే వేసవిలో అటు యూఏఈ లో తేమశాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక శ్రీలంకలో ఆసియా కప్ నిర్వహించడం లాంఛనం అన్నది తెలుస్తుంది. అయితే ఆసియా కప్ ను వేరే చోట నిర్వహించాలనే ప్రతిపాదనను ముందుగా తిరస్కరించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. కేవలం భారత్ ఆడే మ్యాచ్లను మరోచోట నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ప్రతిపాదించాడు. అయితే దీనిపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ మాత్రం శ్రీలంక వేదికగా నిర్వహించేందుకు తాజా నిర్ణయం తీసుకుందట   అయితే ఇలా టోర్నీని తరలించినందుకు ఒకవేళ పాకిస్తాన్ ఆసియా కప్ లో పాల్గొనకపోతే ఇక ఆ జట్టు స్థానంలో యూఏఈకి అవకాశం ఇవ్వాలని ఎసిసి యోచిస్తున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్‌లో ఆ ప్లాట్లకు ఫుల్‌ డిమాండ్‌?

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?

రష్యాతో ఇండియా యాపారం.. నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>