Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chai861a5c2a-7b5f-462d-954e-8b232eebedd3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chai861a5c2a-7b5f-462d-954e-8b232eebedd3-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో ఉన్న బడా ఫ్యామిలీలలో అటు అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి అని చెప్పాలి. నాగేశ్వరరావు కాలం నుంచి కూడా ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోలు వస్తూనే ఉన్నారు. నాగేశ్వరరావు తర్వాత ఇక ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న నాగార్జున సైతం ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందాడు. అయితే ఇప్పుడు నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నాగచైతన్య, అఖిల్ లు మాత్రం స్టార్డం సంపాదించుకోవడంలో విఫలం అయ్యారు. భారీ బ్యాగ్రౌండ్ ఉన్న ఇంకా మిడ్ రేంజ్ హీరోలు గానే కొనసాగుతూ ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్ Chai{#}akhil akkineni;Akkineni Nageswara Rao;Father;Akkineni Nagarjuna;Chaitanya;Director;Cinemaకొడుకుల కోసం నాగార్జున ఇంత చేశాడా.. షాకింగ్ నిజం చెప్పిన చైతన్య?కొడుకుల కోసం నాగార్జున ఇంత చేశాడా.. షాకింగ్ నిజం చెప్పిన చైతన్య?Chai{#}akhil akkineni;Akkineni Nageswara Rao;Father;Akkineni Nagarjuna;Chaitanya;Director;CinemaMon, 08 May 2023 08:21:31 GMTతెలుగు ఇండస్ట్రీలో ఉన్న బడా ఫ్యామిలీలలో అటు అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి అని చెప్పాలి. నాగేశ్వరరావు కాలం నుంచి కూడా ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోలు వస్తూనే ఉన్నారు. నాగేశ్వరరావు తర్వాత ఇక ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న నాగార్జున సైతం ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందాడు. అయితే ఇప్పుడు నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన  నాగచైతన్య, అఖిల్ లు మాత్రం స్టార్డం సంపాదించుకోవడంలో విఫలం అయ్యారు. భారీ బ్యాగ్రౌండ్ ఉన్న ఇంకా మిడ్ రేంజ్ హీరోలు గానే కొనసాగుతూ ఉన్నారు.


 బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలు సైతం స్టార్ హీరోలుగా మారుతుంటే అక్కినేని హీరోలకు మాత్రం ఇండస్ట్రీలో అస్సలు కలిసి రావడం లేదు. ఒక సినిమా మంచి హిట్ అయింది అనుకుంటే ఆ తర్వాత వరుసగా రెండు మూడు ఫ్లాప్ లను కూడా చవిచూస్తూ ఉన్నాం. అయితే అక్కినేని యంగ్ హీరోలు సరైన స్క్రిప్టులను ఎంచుకోవట్లేదు అనిఅందరూ అనుకుంటున్న మాట. మరోవైపు నాగార్జున అసలు కొడుకుల కెరియర్ను పట్టించుకోవట్లేదు అంటూ కొంతమంది చర్చించుకుంటున్నారు. అయితే ఇటీవల ఇదే విషయంపై కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నాగచైతన్య.


 నాగార్జున కొడుకుల కెరియర్ను పట్టించుకోవడం లేదు అంటూ వస్తున్న విమర్శలపై స్పందించిన చైతు.. నేను, అఖిల్ ఎవరైనా డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందని చెబితే.. నాన్న వెంటనే కారులో వెళ్లి అడ్వాన్స్ ఇచ్చి ప్రాజెక్ట్ సెట్ చేస్తారు. మీకు ఏ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందో చెప్పండి అంటూ నాన్న ఎన్నోసార్లు అడిగారు. నాన్నగా ఆయన ఎంత చేయాలో అంతకంటే ఎక్కువ చేశారు. ఇందులో ఆయన తప్పేం లేదు. కాకపోతే మేమే సొంతంగా ఎదగాలని కొన్ని కొన్ని సార్లు ప్రయత్నించి ఫ్లాప్ అవుతూ ఉంటాం అంటూ చైతన్య చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం తెలిసి కొడుకుల కోసం నాగార్జున ఇంత చేశాడా? ఇన్నాళ్లు బయటకి రాలేదే అని అనుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.



RRR Telugu Movie Review Rating

గుడ్డిగా గూగుల్ మ్యాప్ ఫాలో అయ్యారు.. చివరికి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>