Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplaf25b35c-2bcd-41d8-86e6-1f69ed69d432-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplaf25b35c-2bcd-41d8-86e6-1f69ed69d432-415x250-IndiaHerald.jpgఇటీవల ఐపీఎల్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకరకంగా క్రికెట్ లవర్స్ అందరికీ కూడా ఈ మ్యాచ్ పైసా వసూల్ మ్యాచ్ గా నిలిచిపోయింది. ఇరుజట్లు కూడా భారీ స్కోరు నమోదు చేశాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక సన్రైజర్స్ ఐపీఎల్ హిస్టరీ లో ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. అయితే మరోవైపు అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి అదృష్టం కూడా అదే రీతిలో కలిసి వచ్చింది అని చెప్పాలి. 12 బంతుల్లో 41Ipl{#}sandeep;Rajasthan;Paisa Vasool;Cricket;Hyderabadఐపీఎల్ : నో బాల్.. రాజస్థాన్ కొంపముంచింది?ఐపీఎల్ : నో బాల్.. రాజస్థాన్ కొంపముంచింది?Ipl{#}sandeep;Rajasthan;Paisa Vasool;Cricket;HyderabadMon, 08 May 2023 10:30:00 GMTఇటీవల ఐపీఎల్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకరకంగా క్రికెట్ లవర్స్ అందరికీ కూడా ఈ మ్యాచ్ పైసా వసూల్ మ్యాచ్ గా నిలిచిపోయింది. ఇరుజట్లు కూడా భారీ స్కోరు నమోదు చేశాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక సన్రైజర్స్ ఐపీఎల్ హిస్టరీ లో ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. అయితే మరోవైపు అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి అదృష్టం కూడా అదే రీతిలో కలిసి వచ్చింది అని చెప్పాలి.



 12 బంతుల్లో 41 పరుగులు కావాల్సిన సమయంలో సన్రైజర్స్ ఓటమి ఖాయమని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి సమయంలో ఫిలిప్స్ ఏడు బంతుల్లో 25 పరుగులు చేసి విధ్వంసం సృష్టించి అవుట్ అయ్యాడు. అతను క్రీజు లో ఉన్నంతసేపు మ్యాచ్ సన్ రైజర్స్ వైపు ఉంది. కానీ అతను ఔట్ అవ్వగానే మళ్ళీ రాజస్థాన్ వైపు వెళ్ళింది. ఇక ఆఖరి ఓవర్లో సన్రైజర్స్ విజయానికి 17 పరుగులు అవసరమైన సమయంలో చోటుచేసుకున్న హైడ్రామా అటు ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠను పెంచేసింది అని చెప్పాలి.



 చివరి ఓవర్ ను సందీప్ శర్మ వేశాడు. అయితే తొలి బంతికి రెండు పరుగులు వస్తే రెండవ బంతిని అబ్దుల్ సమద్ సిక్సర్గా మలిచాడు. తర్వాత నాలుగు బంతుల్లో తొమ్మిది పరుగులు కావాల్సి వచ్చింది. ఇక మూడో బంతికి రెండు పరుగులు నాలుగో బంతికి ఐదు బంతికి సింగిల్స్ రావడంతో ఆఖరి బంతికి సన్రైజర్స్ కు 5 పరుగుల అవసరమయ్యాయి. అయితే సందీప్ ఆఖరి బంతి వేశాడు సమద్ లాంగ్ ఆఫ్ దిశగా గాల్లో లేపగా అక్కడే ఉన్న బట్లర్  అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో రాజస్థాన్ సంబరాల్లో మునిగిపోయింది.. కానీ అంతలో అంపైర్  ట్విస్ట్ ఇచ్చాడు. అది నోబాల్ అని ప్రకటించాడు. దీంతో చేసేదేమీ లేక సందీప్ శర్మ మరో బంతి వేయగా సమద్ దానిని సిక్సర్ గా మలిచి జట్టును గెలిపించాడు.



RRR Telugu Movie Review Rating

పండు కోసేందుకు వెళ్లిన బాలిక.. పట్టుకున్న యజమాని.. చివరికి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>