MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-adipurush1bed9598-7766-4b2e-b585-b0ff1cd03d0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-adipurush1bed9598-7766-4b2e-b585-b0ff1cd03d0e-415x250-IndiaHerald.jpg‘ఆదిపురుష్’ మూవీని మొదట్లో పాన్ ఇండియా మొదలుపెట్టి దాని రేంజ్ ని పెంచి ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీగా ప్రమోట్ చేస్తున్నారు. బైబుల్ తరువాత ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలోను రామాయణ కథ పై పుస్తకాలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా రామాయణ కథను ఎరుగని వారుండరు. ఇప్పుడు ఈవిషయాన్ని చాల వ్యూహాత్మకంగా ‘ఆదిపురుష్’ మూవీ యూనిట్ తమ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తూ వరల్డ్ వైడ్ గా కలక్షన్స్ రాబట్టడానికి వ్యూహాలు రచిస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ 9వ తేదీన లాంఛ్ చేయబోతున్నారు. దీనికోసం ఒక భారీ కార్యక్రprabhas adipurush{#}Australia;Tirupati;Saif Ali Khan;Event;kriti sanon;Graphics;Telugu;Prabhas;India;American Samoa;Russia;Darsakudu;News;Director;Cinema;INTERNATIONALఅంతర్జాతీయ స్థాయిలో ఆదిపురుష్ ఈవెంట్ !అంతర్జాతీయ స్థాయిలో ఆదిపురుష్ ఈవెంట్ !prabhas adipurush{#}Australia;Tirupati;Saif Ali Khan;Event;kriti sanon;Graphics;Telugu;Prabhas;India;American Samoa;Russia;Darsakudu;News;Director;Cinema;INTERNATIONALMon, 08 May 2023 10:00:00 GMT‘ఆదిపురుష్’ మూవీని మొదట్లో పాన్ ఇండియా మొదలుపెట్టి దాని రేంజ్ ని పెంచి ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీగా ప్రమోట్ చేస్తున్నారు. బైబుల్ తరువాత ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలోను రామాయణ కథ పై పుస్తకాలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా రామాయణ కథను ఎరుగని వారుండరు. ఇప్పుడు ఈవిషయాన్ని చాల వ్యూహాత్మకంగా ‘ఆదిపురుష్’ మూవీ యూనిట్ తమ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తూ వరల్డ్ వైడ్ గా కలక్షన్స్ రాబట్టడానికి వ్యూహాలు రచిస్తోంది.



ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ 9వ తేదీన లాంఛ్ చేయబోతున్నారు. దీనికోసం ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఒకేసారి అమెరికా కెనడా మిడిల్ ఈస్ట్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ రష్యా ఈజిప్ట్ ఇలా అనేక దేశాలలో ఈ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు.



ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల అయిన తరువాత విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దీనితో ఈమూవీ గ్రాఫిక్స్ వర్క్స్ ను మరింత మెరుగుగా చేయడంకోసం ఈ మూవీ విడుదలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈమూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో విడుదల అవుతున్న ఈమూవీ ట్రైలర్ పై అందరిలోనూ ఆశక్తి విపరీతంగా ఉంది.


ఇప్పుడు ఈ ట్రయిలర్ లాంఛ్ తో ఈసినిమా ప్రచారం తారా స్థాయికి చేరబోతోంది. ఈమూవీ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ ఈవెంట్స్ లో అనేకమంది ప్రముఖ స్వామీజీలు కూడ అతిధులుగా రాబోతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తిరుపతి ఖమ్మంలో కూడ భారీ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటించిన ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించిన విషయం అందరికీ తెలిసిందే. రాముడి గెటప్ పై ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ దర్శకుడు ఓం రౌత్ పట్టించుకోకపోవడం హాట్ న్యూస్ గా మారింది..  






RRR Telugu Movie Review Rating

కేసీఆర్‌.. ఆ ఉద్యోగుల మొర ఆలకించండి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>