MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/virupaksha02b6e3a2-e578-4254-9cc6-a25990d02e80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/virupaksha02b6e3a2-e578-4254-9cc6-a25990d02e80-415x250-IndiaHerald.jpgతెలుగు నాట సంచలన విజయం సాధించిన విరూపాక్ష సినిమా మిగతా భాషల బాక్సాఫీస్ వద్ద చాలా దారుణమైన కలెక్షన్లు సాధిస్తున్నది. తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్న ఈ సినిమా ఇతర భాష ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.ఇక తెలుగులో 17 రోజులుగా భారీ వసూళ్లను సాధిస్తున్న ఈ సినిమా ఉత్తరాదిలో పేలవమైన వసూళ్లను సాధిస్తున్నది. గత మూడు రోజుల్లో హిందీ ఇంకా తమిళ భాషల్లో ఏ మేరకు కలెక్షన్లు సాధించిందో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో విరూపాక్ష చిత్రం భారీ వసూళ్లు సాధిస్తున్న జోష్‌తో హిందీ, తమిళంలో మే 5వ తేదీన భారీగా VIRUPAKSHA{#}Salman Khan;Amarnath K Menon;sunday;Chitram;Hindi;Tamil;Telugu;Cinemaవిరూపాక్ష: మిగతా భాషల్లో రెస్పాన్స్ ఇదే?విరూపాక్ష: మిగతా భాషల్లో రెస్పాన్స్ ఇదే?VIRUPAKSHA{#}Salman Khan;Amarnath K Menon;sunday;Chitram;Hindi;Tamil;Telugu;CinemaMon, 08 May 2023 17:17:17 GMTతెలుగు నాట సంచలన విజయం సాధించిన విరూపాక్ష సినిమా మిగతా భాషల బాక్సాఫీస్ వద్ద చాలా దారుణమైన కలెక్షన్లు సాధిస్తున్నది. తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్న ఈ సినిమా ఇతర భాష ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.ఇక తెలుగులో 17 రోజులుగా భారీ వసూళ్లను సాధిస్తున్న ఈ సినిమా ఉత్తరాదిలో పేలవమైన వసూళ్లను సాధిస్తున్నది. గత మూడు రోజుల్లో హిందీ ఇంకా తమిళ భాషల్లో ఏ మేరకు కలెక్షన్లు సాధించిందో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో విరూపాక్ష చిత్రం భారీ వసూళ్లు సాధిస్తున్న జోష్‌తో హిందీ, తమిళంలో మే 5వ తేదీన భారీగా రిలీజ్ అయ్యింది. వాస్తవానికి ఈ చిత్రం తెలుగుతోపాటు మిగతా భాషల్లో రిలీజ్ చేయాల్సింది. కానీ సల్మాన్ ఖాన్ మూవీ రిలీజ్ కావడం, డబ్బింగ్ ఇంకా ఇతర సాంకేతిక పనులు పూర్తి కావడం వల్ల ఈ సినిమాను రెండు వారాలు ఆలస్యంగా హిందీ, తమిళంలో రిలీజ్ చేశారు.


ఈ సినిమాకి కన్నడ, తెలుగులో భారీగా స్పందన రావడంతో, హిందీ, తమిళ మార్కెట్‌లో పాగా వేసేందుకు మూవీ టీమ్ ప్రయత్నించింది. హిందీ మార్కెట్‌లో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ బాగానే ప్రమోషన్ చేశారు. ముంబై, ఇతర ప్రాంతాల్లో రెండు, మూడు రోజుల పాటు భారీగా ప్రమోషన్ చేశారు. దాంతో ఈ సినిమాకు మంచి స్పందన వస్తుందనే ఆశాభావంతో మూవీ యూనిట్ ఎదురు చూసింది.అయితే హిందీలో పెద్దగా రెస్పాన్స్ రాకపోగా తమిళ్ లో నిన్న ఆదివారం కొంచెం పరవాలేదులే అనిపించింది.ఇక ప్రపంచవ్యాప్తంగా విరూపాక్ష కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఆంధ్ర, నైజాంలో ఈ సినిమా ఏకంగా 60.9 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 6 కోట్ల గ్రాస్, తమిళంలో 13 లక్షలు ఇంకా హిందీలో 17 లక్షల కలెక్షన్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో 13 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. ఓవరాల్‌గా ఈ సినిమా 90 కోట్లకుపైగా గ్రాస్, 45 కోట్లకుపైగా షేర్ కలెక్షన్లు సాధించి మొత్తానికి హిట్ మూవీగా నిలిచింది.



RRR Telugu Movie Review Rating

అనసూయ, విజయ్ దేవరకొండ ల మధ్య గొడవకు కారణం అదేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>