MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-raamc9fbdec2-4cce-4244-89b4-d98186a269c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-raamc9fbdec2-4cce-4244-89b4-d98186a269c2-415x250-IndiaHerald.jpgఅల్లరి నరేష్ తన రూట్ మార్చి ఎంతో కష్టపడి నటించిన ‘ఉగ్రం’ మూవీకి రివ్యూలు బాగా వచ్చినప్పటికీ ఈమూవీకి కలక్షన్స్ అంతంతమాత్రంగానే ఉండటం చాల మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఈసినిమా చూసిన సగటు ప్రేక్షకుడు ‘హిట్ 2’ అదేవిధంగా ‘యశోద’ సినిమాల ఛాయలు ‘ఉగ్రం’ లో కనిపిస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఈసినిమాను క్రైం మిష్టరీ సినిమాలను ఇష్టపడే వారికి నచ్చుతుందని అయితే ఎదో ఆశపడి కథలో కొత్తదనం ఉంటుంది అని ఊహించుకుని వెళ్ళేవారికి ఈమూవీ అంతగా నచ్చదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈమూవీKALYAN RAAM{#}Naresh;allari naresh;kalyan ram;Traffic police;U Turn;March;Audience;ram pothineni;Hero;Darsakudu;Director;News;Cinemaఉగ్రం ఆ హీరో చేసి ఉంటే !ఉగ్రం ఆ హీరో చేసి ఉంటే !KALYAN RAAM{#}Naresh;allari naresh;kalyan ram;Traffic police;U Turn;March;Audience;ram pothineni;Hero;Darsakudu;Director;News;CinemaMon, 08 May 2023 09:00:00 GMTఅల్లరి నరేష్ తన రూట్ మార్చి ఎంతో కష్టపడి నటించిన ‘ఉగ్రం’ మూవీకి రివ్యూలు బాగా వచ్చినప్పటికీ ఈమూవీకి కలక్షన్స్ అంతంతమాత్రంగానే ఉండటం చాల మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఈసినిమా చూసిన సగటు ప్రేక్షకుడు ‘హిట్ 2’ అదేవిధంగా ‘యశోద’ సినిమాల ఛాయలు ‘ఉగ్రం’ లో కనిపిస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.



అయితే ఈసినిమాను క్రైం మిష్టరీ సినిమాలను ఇష్టపడే వారికి నచ్చుతుందని అయితే ఎదో ఆశపడి కథలో కొత్తదనం ఉంటుంది అని ఊహించుకుని వెళ్ళేవారికి ఈమూవీ అంతగా నచ్చదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈమూవీలో అల్లరి నరేష్ బాగా నటించాడు అని చెపుతున్నప్పటికీ ఈ మూవీలో నరేష్ కాకుండా మరొక హీరో నటించి ఉంటే కలక్షన్స్ పరంగా ఈమూవీ పరిస్థితి మరోలా ఉండేది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.



తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీ దర్శకుడు కళ్యాణ్ రామ్ ను కలిసి ఈ మూవీ కథను వినిపించాడని అయితే కళ్యాణ్ రామ్ కు ఈమూవీ కథ నచ్చినప్పటికీ కథలో చెప్పిన మార్పులు చేర్పులు విషయంలో మూవీ దర్శకుడుకు కళ్యాణ్ రామ్ కు ఏర్పడిన భేదాభిప్రాయాలు వల్ల ఈమూవీ తిరిగి యూటర్న్ తీసుకుని అల్లరి నరేష్ వద్దకు చేరింది అన్న వార్తలు కూడ ఉన్నాయి. అయితే నిజంగా ఈమూవీలో కళ్యాణ్ రామ్ ఉగ్ర రూపంతో ఊగిపోయే పోలీస్ ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్ నటించి ఉంటే అతడికి భారీ హిట్ దక్కి ఉండేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.



వాస్తవానికి ఈమూవీ టాక్ బాగా వచ్చినప్పటికీ వివాదాస్పద చిత్రంగా పేరు తెచ్చుకున్న ‘ది కేరళా స్టోరీ’ మూవీకి విపరీతమైన పబ్లిసిటీ రావడంతో సగటు ప్రేక్షకులు చాలామంది ‘ఉగ్రం’ ను పక్కకు పెట్టి ‘ది కేరళా స్టోరీ’ మూవీ ధియేటర్ల వైపు వెళుతూ ఉండటంతో ‘ఉగ్రం’ ధియేటర్లు వెలవెలపోతున్నాయి అన్న అభిప్రాయం కూడ వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా ‘ఉగ్రం’ అల్లరి నరేష్ కోరుకున్న కలక్షన్స్ హిట్ ను ఇవ్వలేక పోయింది అనుకోవాలి..






RRR Telugu Movie Review Rating

గుడ్డిగా గూగుల్ మ్యాప్ ఫాలో అయ్యారు.. చివరికి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>