PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/amaravati-supreme-court-jaganbbf4891b-964b-4c5f-aee2-26c6a895905d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/amaravati-supreme-court-jaganbbf4891b-964b-4c5f-aee2-26c6a895905d-415x250-IndiaHerald.jpgరైతుల పిటీషన్ను ముందు హైకోర్టు తర్వాత సుప్రింకోర్టు ఆ తర్వాత మళ్ళీ హైకోర్టు కొట్టేసినా వీళ్ళు మళ్ళీ మళ్ళీ కోర్టులో పిటీషన్లు వేస్తున్నారంటే అర్ధమేంటి ? తమ పక్కన పేదలకు పట్టాలు ఇవ్వకూడదనే. పేదలు నివసించటానికి అవకాశంలేని అమరావతిని చంద్రబాబునాయుడు ప్రజా రాజధానిగా చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది. ఒక సెక్షన్ ఆఫ్ జనాలకు అమరావతి రాజధానిని చంద్రబాబు గేటెడ్ కమ్యూనిటిగా మార్చాలని ప్రయత్నం చేశారు కాబట్టే మిగిలిన ప్రాంత జనాల్లో బాగా మండిపోయింది. Amaravati supreme court jagan{#}CBN;Amaravati;Hanu Raghavapudi;High court;police;Saturday;TDP;Yevaru;Governmentఅమరావతి : ఇందుకే అమరావతిపై వ్యతిరేకత పెరిగిపోతోందా ?అమరావతి : ఇందుకే అమరావతిపై వ్యతిరేకత పెరిగిపోతోందా ?Amaravati supreme court jagan{#}CBN;Amaravati;Hanu Raghavapudi;High court;police;Saturday;TDP;Yevaru;GovernmentMon, 08 May 2023 09:00:00 GMT



రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అమరావతి జనాలంటే వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. ఎందుకు వ్యతిరేకత ఉందంటే అది వాళ్ళ స్వయంకృతమనే చెప్పాలి. తాజాగా అమరావతి రైతుల ముసుగులో కొందరు మళ్ళీ సుప్రింకోర్టులో కేసు వేశారు. నిజానికి అమరావతి ప్రాంతంలో ఇపుడు భూములున్న రైతులంటు  ఎవరు లేరు. ఉన్నవాళ్ళంతా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ సంస్ధలు, రైతుల నుండి భూములు కొనుక్కుని ప్రభుత్వం నుండి ప్లాట్లు తీసుకున్న ఇతరులు మాత్రమే.





రైతుల ముసుగులో  వీళ్ళే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో పోరాటం చేస్తున్నారు. వీళ్ళ వెనుక ఉన్నదంతా టీడీపీ నేతలే అన్న విషయం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అమరావతి టు అరసవెల్లి పాదయాత్రలో ఆధార్ కార్డులను పోలీసులు తనిఖీ చేసినపుడే అర్ధమైపోయింది పాదయాత్రలో ఉన్నదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లేనని. అలాంటి వాళ్ళే శనివారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్ళీ సుప్రింకోర్టులో కేసు వేశారు. తమ భూముల్లో పేదలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చేందుకు లేదని పిటీషన్లో చెప్పారు.





రైతుల పిటీషన్ను ముందు హైకోర్టు తర్వాత సుప్రింకోర్టు ఆ తర్వాత మళ్ళీ హైకోర్టు కొట్టేసినా వీళ్ళు మళ్ళీ మళ్ళీ కోర్టులో పిటీషన్లు వేస్తున్నారంటే అర్ధమేంటి ? తమ పక్కన పేదలకు పట్టాలు ఇవ్వకూడదనే. పేదలు నివసించటానికి అవకాశంలేని అమరావతిని చంద్రబాబునాయుడు ప్రజా రాజధానిగా చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది. ఒక సెక్షన్ ఆఫ్ జనాలకు అమరావతి రాజధానిని చంద్రబాబు గేటెడ్ కమ్యూనిటిగా మార్చాలని ప్రయత్నం చేశారు కాబట్టే మిగిలిన ప్రాంత జనాల్లో బాగా మండిపోయింది.





ఎక్కడెక్కడి అభివృద్ధిని, ప్రతిష్టాత్మక సంస్ధలను, పెద్ద పెద్ద కంపెనీలన్నింటినీ చంద్రబాబు అమరావతిలోనే పెట్టాలని అనుకున్నారు. ఇందుకోసం మిగిలిన రాష్ట్రాన్ని ఎండగట్టాలని ప్లాన్ చేశారు. అందుకనే జనాలు 2019 ఎన్నికల్లో టీడీపీని ఘోరంగా ఓడించారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోకుండా ఉంటే ఈపాటికి ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశంలో ఉండేవే. అలాంటిది ఆ భూముల విలువ ఒక్కసారిగా పడిపోయింది. ఆ మంట భూములున్న వాళ్ళల్లో పెరిగిపోతోంది కాబట్టే పేదలకు పట్టాలు ఇవ్వకుండా మళ్ళీ మళ్ళీ కేసులు వేస్తున్నది. ఇందుకే అమరావతి అంటే మిగిలిన ప్రాంతాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది.




RRR Telugu Movie Review Rating

గుడ్డిగా గూగుల్ మ్యాప్ ఫాలో అయ్యారు.. చివరికి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>