EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/russiad5421c73-326e-4442-a386-b00a15814904-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/russiad5421c73-326e-4442-a386-b00a15814904-415x250-IndiaHerald.jpgరష్యా, ఉక్రెయిన్ యుద్దం తర్వాత ప్రపంచ దేశాలు అమెరికాకు భయపడి రష్యా నుంచి ఆయిల్ ను కొనలేవు. ఆ సమయంలో భారత్ మాత్రమే ఆయిల్ ను కొని రష్యాకు ఆర్థికంగా సాయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. అయితే ప్రస్తుతం చైనా కూడా రష్యా నుంచి ఆయిల్ కొనడం ప్రారంభించింది. దీంతో రష్యా చైనాకు భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఇదే సమయంలో భారత్ కు తగ్గించేస్తోంది. రష్యా నుంచి చైనా ఎక్కువ మొత్తంలో క్రూడాయిల్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. యుద్దం ప్రారంభమైన సమయంలో కూడా కనికరం చూపని చైనా ఇప్పుడు ఏకంగా పెద్ద మొత్తంలో తక్కువRUSSIA{#}India;Russia;Iran;Ukraine;Saudi Arabia;Narendra Modi;oil;contractరష్యా: భారత్‌కు షాక్‌.. చైనాకు చీప్‌?రష్యా: భారత్‌కు షాక్‌.. చైనాకు చీప్‌?RUSSIA{#}India;Russia;Iran;Ukraine;Saudi Arabia;Narendra Modi;oil;contractSat, 06 May 2023 08:00:00 GMTరష్యా, ఉక్రెయిన్ యుద్దం తర్వాత ప్రపంచ దేశాలు అమెరికాకు భయపడి రష్యా నుంచి ఆయిల్ ను కొనలేవు. ఆ సమయంలో భారత్ మాత్రమే ఆయిల్ ను కొని రష్యాకు ఆర్థికంగా సాయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. అయితే ప్రస్తుతం చైనా కూడా రష్యా నుంచి ఆయిల్ కొనడం ప్రారంభించింది. దీంతో రష్యా చైనాకు భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఇదే సమయంలో భారత్ కు తగ్గించేస్తోంది. రష్యా నుంచి చైనా ఎక్కువ మొత్తంలో క్రూడాయిల్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. యుద్దం ప్రారంభమైన సమయంలో కూడా కనికరం చూపని చైనా ఇప్పుడు ఏకంగా పెద్ద మొత్తంలో తక్కువ ధరకు ఆయిల్ కొనుగోలు చేసి లాభం పొందుతోంది.


చైనాకు తక్కువ ధరకు ఇచ్చి భారత్ కు రష్యా ధరలు పెంచడంపై మేధావులు మండి పడుతున్నారు.  గతంలో 15 డాలర్లు, 20 డాలర్లు ఉన్న క్రూడాయిల్ బ్యారెల్ ధరను ప్రస్తుతం 25 డాలర్లు, 30 డాలర్లకు పైగా పెంచేసింది. ఎవరూ కూడా కొనని సమయంలో ధైర్యం చేసి భారత్ కొంటే ఇప్పుడు చైనా కొనుగోలు చేస్తుందని ధర పెంచడం సబబు కాదని దౌత్యవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


గతంలో సౌదీ అరేబియా నుంచి అత్యధికంగా ఆయిల్ ను కొనే చైనా, ప్రస్తుతం రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్ ను కొనుగోలు చేస్తుంది. ఇలా చేయడం వల్ల రష్యా, చైనా మధ్య బంధం మరింత బలపడుతోంది. భారత్ గతంలో ఇరాన్ నుంచి అత్యధికంగా క్రూడాయిల్ కొనుగోలు చేసేది. రష్యా, ఉక్రెయిన్  యుద్దం  అనంతరం రష్యా నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించారు. అది అత్యంత కఠినమైన నిర్ణయం. ప్రపంచ దేశాలు వద్దని వారిస్తున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడానికే మొగ్గు చూపింది. అలాంటి ఇండియాకు ధర పెంచడం, చైనాకు ధర తగ్గించి ఇవ్వడం సరైనది కాదని విమర్శలు వస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

ఆ హైవే తగ్గింపులో రూ.2000 కోట్ల స్కామ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>