MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-pi-deveneni-avinash-shocking-commentes943824a0-2228-4ddf-9794-5c570c2aa31c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-pi-deveneni-avinash-shocking-commentes943824a0-2228-4ddf-9794-5c570c2aa31c-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఆయనకు రాజకీయాలలోకి రావాలన్న ఆసక్తి లేకపోయినా ఈ మధ్యకాలంలో ఆయన పేరు ఎక్కువగా ప్రస్తావనకు వస్తోంది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఏం చేసినా సరే అది పొలిటికల్గా కామెంట్లు వినిపిస్తూ ఆయనకు తలనొప్పిగా మారుతున్నాయి. అంతేకాదు అటు నారా ఇటు నందమూరి ఫ్యామిలీలు ఏ ఒక్కరు కూడా ఎన్టీఆర్ను రాజకీయాలలోకి ఆహ్వానించకపోవడం.. గతంలో ఒకసారి వచ్చిన ఎన్టీఆర్ కి మర్యాద ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ ఆయనను రాజకీయాలకు దూరం చేస్తున్నాయని చెప్పాలి. మరొకవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నNTR;DEVINENI AVINASH{#}harikrishnana;Kodali Nani;devineni avinash;Lakshmi Devi;TDP;YCP;Father;sree;Wife;Friday;NTRఎన్టీఆర్ పై దేవినేని అవినాష్ షాకింగ్ కామెంట్స్..!ఎన్టీఆర్ పై దేవినేని అవినాష్ షాకింగ్ కామెంట్స్..!NTR;DEVINENI AVINASH{#}harikrishnana;Kodali Nani;devineni avinash;Lakshmi Devi;TDP;YCP;Father;sree;Wife;Friday;NTRSat, 06 May 2023 14:00:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఆయనకు రాజకీయాలలోకి రావాలన్న ఆసక్తి లేకపోయినా ఈ మధ్యకాలంలో ఆయన పేరు ఎక్కువగా ప్రస్తావనకు వస్తోంది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఏం చేసినా సరే అది పొలిటికల్గా కామెంట్లు వినిపిస్తూ ఆయనకు తలనొప్పిగా మారుతున్నాయి. అంతేకాదు అటు నారా ఇటు నందమూరి ఫ్యామిలీలు ఏ ఒక్కరు కూడా ఎన్టీఆర్ను రాజకీయాలలోకి ఆహ్వానించకపోవడం.. గతంలో ఒకసారి వచ్చిన ఎన్టీఆర్ కి మర్యాద ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ ఆయనను రాజకీయాలకు దూరం చేస్తున్నాయని చెప్పాలి.

మరొకవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా పదేపదే ఎన్టీఆర్ పేరును ప్రస్తావనకు తీసుకొస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా మరో వైసీపీ యువనేత దేవినేని అవినాష్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్లు వైరల్ గా మారడమే కాదు అవి ఇప్పుడు ట్రోలింగ్కి గురి అవుతున్నాయి. వాస్తవానికి దేవినేని అవినాష్ ఎన్టీఆర్ పై అభిమానంతోనే కామెంట్లు చేశాడు... కానీ కొంతమంది నందమూరి అభిమానులు , టిడిపి అభిమానులు ఆయనను దారుణంగా ట్రోల్స్ చేస్తూ మనస్థాపానికి గురి చేస్తున్నారు. ఇక శుక్రవారం రోజున యంగ్ టైగర్ ఎన్టీఆర్,  లక్ష్మీ ప్రణతి తమ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

ఈ నేపథ్యంలోనే దంపతులిద్దరికీ పెద్ద ఎత్తున అభిమానులు , సినీ సెలబ్రిటీలు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయగా దేవినేని అవినాష్ కూడా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. మా కుటుంబానికి ప్రత్యక్ష దైవం అయిన శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడు తండ్రి సమానులైన హరికృష్ణ గారి కుమారుడు ఎన్టీఆర్ ఆయన భార్య లక్ష్మీ ప్రణతి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీరు ఎప్పుడు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను అంటూ అవినాష్ శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే దీనిని టిడిపి మద్దతుదారులు టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్ అభిమానుల నుంచి సింపతి పొందడం కోసం అవినాష్ ఇలా ట్వీట్ చేశాడు అంటూ ఆయనపై ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా దేవినేని అవినాష్ ఇప్పుడు దారుణంగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

"ఓజి" మూవీలో మూడు వేరియేషన్స్ లో పవన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>