MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasc2b17fe9-7a0a-4866-80f9-11de812ccb2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasc2b17fe9-7a0a-4866-80f9-11de812ccb2a-415x250-IndiaHerald.jpg‘నిశబ్ధం’ మూవీ తరువాత అనుష్క మరో సినిమాలో నటించడానికి దాదాపు నాలుగు సంవత్సరాల కాలం పట్టింది. ఆమె లేటెస్ట్ గా నటిస్తున్న ‘మిస్ శెట్టి మిష్టర్ పోలి శెట్టి’ సినిమాకు సంబంధించిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. అయితే ఆమూవీ ఎప్పుడు విడుదల అవుతుంది అన్న విషయమై క్లారిటీ రాకపోవడానికి ఒక విధంగా అనుష్క కారణం అన్నవార్తలు వినిపిస్తున్నాయి.ఈసినిమాకు సంబంధించి సిజి వర్క్ సాయంతో అనుష్క బాడీ షేపింగ్ అన్న విషయం ప్రధాన సమస్యగా మారింది అంటున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న చాల సినిమాలలో హీరోలు అందరికీ బాడీ షేపింగ్prabhas{#}anoushka;August;Cinemaఅనుష్క సినిమాకు ఆదిపురుష్ తో సమస్యలు !అనుష్క సినిమాకు ఆదిపురుష్ తో సమస్యలు !prabhas{#}anoushka;August;CinemaSat, 06 May 2023 08:10:03 GMT‘నిశబ్ధం’ మూవీ తరువాత అనుష్క మరో సినిమాలో నటించడానికి దాదాపు నాలుగు సంవత్సరాల కాలం పట్టింది. ఆమె లేటెస్ట్ గా నటిస్తున్న ‘మిస్ శెట్టి మిష్టర్ పోలి శెట్టి’ సినిమాకు సంబంధించిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. అయితే ఆమూవీ ఎప్పుడు విడుదల అవుతుంది అన్న విషయమై క్లారిటీ రాకపోవడానికి ఒక విధంగా అనుష్క కారణం అన్నవార్తలు వినిపిస్తున్నాయి.



ఈసినిమాకు సంబంధించి సిజి వర్క్ సాయంతో అనుష్క బాడీ షేపింగ్ అన్న విషయం ప్రధాన సమస్యగా మారింది అంటున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న చాల సినిమాలలో హీరోలు అందరికీ బాడీ షేపింగ్ సర్వసాధారణ విషయంగా మారిపోయింది. ఈ బాడీ షెపింగ్ కోసం నిర్మాతలు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. లావుగా ఉన్న వారిని సన్నగా చూపెట్టడం సన్నగా ఉన్న వారిని లావుగా చూపెట్టడంతో పాటు హీరోల కళ్ళ కింద క్యారీ బ్యాగ్ లు కనిపించకుండా చేయడం హీరోలు విగ్ పెట్టుకున్నప్పటికీ అది రియల్ హెయిర్ అనిపించే విధంగా చేయడం. ఇలా చాల పనులు సిజి వర్క్ ద్వారా చేస్తూ ఉంటారు.


‘బాహుబలి’ తరువాత అనుష్క బాగా లావుగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమె ఫేస్ చబ్బీ గా మారిపోవడంతో ఆమె గ్లామర్ అంతా తగ్గిపోయింది. దీనితో ఆమెకు అవకాశాలు కూడ బాగా తగ్గిపోయాయి. దీనితో ఆమె లేటెస్ట్ మూవీ ‘మిస్ శెట్టి మిష్టర్ శెట్టి’ మూవీకి సంబంధించిన సిజి వర్క్ పూర్తి కావడానికి చాల సమయం పడుతోందని అందువల్ల ఈమూవీ అనుకున్న విధంగా  ఈనెల 26న విడుదల చేయడం కష్టం అంటున్నారు.



దీనితో ఈసినిమాను రెండు వారాల తరువాత విడుదల చేద్దామంటే ‘ఆదిపురుష్’ తో పోటీ పడాలి కాబట్టి అది జరగని పని అంటున్నారు. ఆతరువాత వచ్చే జూలై సినిమాలకు మంచి సీజన్ కాదు. ఆగష్టు నెలకు వెళదాము అనుకుంటే అక్కడ కూడ చాల సినిమాల పోటీ ఉండటంతో ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ లో ఉంది అని టాక్..  






RRR Telugu Movie Review Rating

ఆ హైవే తగ్గింపులో రూ.2000 కోట్ల స్కామ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>