EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan2a0fdcc7-ed56-4970-8145-57e6431e96de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan2a0fdcc7-ed56-4970-8145-57e6431e96de-415x250-IndiaHerald.jpgచిన్న పాటి సంఘటనలే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసి మీడియా ఛానళ్లు వేసిందే వేసి మళ్లీ మళ్లీ చూపిస్తాయి. దీంతో ప్రతి విషయం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజల వరకు తెలుస్తాయి. వైసీపీ ఎమ్మెల్యేలు శంకర్ నారాయణ, కన్నబాబులు ప్రభుత్వానికి సంబంధించిన స్టిక్కర్లను అతికించడానికి గ్రామాలకు వెళ్లారు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ప్రభుత్వంతో పాటు వైసీపీ నాయకులకే మింగుడు పడటం లేదు. ఎందుకంటే స్టిక్కర్లు అంటించడానికి వెళ్లిన ఎమ్మెల్యేలను సొంత పార్టీ నాయకులే అడ్డుకున్నారు. దీని వల్ల ఆ పార్టీ నాయకులJAGAN{#}Party;Kurasala Kannababu;YCP;TDP;media;shankarజగన్‌కు సొంత మనుషులే షాక్‌ ఇస్తున్నారా?జగన్‌కు సొంత మనుషులే షాక్‌ ఇస్తున్నారా?JAGAN{#}Party;Kurasala Kannababu;YCP;TDP;media;shankarFri, 05 May 2023 07:00:00 GMTచిన్న పాటి సంఘటనలే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసి మీడియా ఛానళ్లు వేసిందే వేసి మళ్లీ మళ్లీ చూపిస్తాయి. దీంతో ప్రతి విషయం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజల వరకు తెలుస్తాయి. వైసీపీ ఎమ్మెల్యేలు శంకర్ నారాయణ, కన్నబాబులు ప్రభుత్వానికి సంబంధించిన స్టిక్కర్లను అతికించడానికి గ్రామాలకు వెళ్లారు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ప్రభుత్వంతో పాటు వైసీపీ నాయకులకే మింగుడు పడటం లేదు.


ఎందుకంటే స్టిక్కర్లు అంటించడానికి వెళ్లిన ఎమ్మెల్యేలను సొంత పార్టీ నాయకులే అడ్డుకున్నారు. దీని వల్ల ఆ పార్టీ నాయకులకు, సామాన్య కార్యకర్తలకు పడటం లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే  శంకర్ నారాయణపై కార్యకర్తలే చేయి చేసుకునే స్థాయి వరకు వెళ్లిందంటే ఎంతలా వారిపై ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కన్నబాబు ను కూడా ఇలాగే కార్యకర్తలు అడ్డుకున్నారు.


అయితే నిన్నటి వరకు స్టిక్కర్ల వివాదం ప్రజలు, టీడీపీ ఇతర పార్టీల నేతలు విమర్శలు చేశారు. కానీ సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేలను అడ్డుకున్నారంటే ఎంతటి ఇబ్బందులు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ జగనన్న మా భవిష్యత్ టికెట్లు వేయడాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడం వల్ల వచ్చే ఎన్నికల్లో ఫ్యాను పార్టీకి ఎదురుగాలి తప్పదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


శంకర్ నారాయణ అనే ఎమ్మెల్యేపై దాడి చేయడం, కన్నబాబు దగ్గర గొడవ చేయడం లాంటి విషయాలు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతోనే అయిపోతుందని భావిస్తే వైసీపీ పొరపాటు పడినట్లే. ఇలా ఏయే ప్రాంతాల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందో గమనించి ఆయా ప్రాంతాల్లో కొత్త నాయకులను ప్రోత్సహించడం లేక ఎమ్మెల్యేల తీరును మార్చుకోవాలని చెప్పడం చేస్తేనే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఏమైనా లాభం చేకూరుతుంది. పార్టీ కార్యకర్తల్ని పట్టించుకోని ఎమ్మెల్యేలకు తగిన గుణపాఠమే చెప్పారని రాజకీయ మేధావులు చర్చించుకుంటున్నారు. ప్రతి ఎమ్మెల్యేను ఇలా ప్రశ్నించినపుడే ఆయా నియోజకవర్గాల్లో పనులు అవుతాయని చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

ఈరోజు ఆ సమయానికి "కస్టడీ" మూవీ ట్రైలర్ విడుదల..!

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>