PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/viveka-dastagiri-jagan-avinash22407ae9-ece1-47f1-ac08-663e1df8b888-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/viveka-dastagiri-jagan-avinash22407ae9-ece1-47f1-ac08-663e1df8b888-415x250-IndiaHerald.jpgఇంతకన్నా విచిత్రం ఏమిటంటే వివేకాను తానే గొడ్డలితో నరికి హత్యచేసినట్లు దస్తగిరి ఎప్పుడో అంగీకరించాడు. వివేకా తల, మెడ, చేతులను ఎలా నరికింది ? ఎన్ని వేట్లు వేసిందనే విషయాలను సినిమాలో చూపించినట్లు డీటైల్డ్ గా చెప్పాడు. గొడ్డలిని ఎక్కడ కొన్నది, దానికి ఎక్కడ పదును పెట్టించిన విషయాన్ని కూడా వివరించాడు. వివేకాను గొడ్డలితో నరికి చంపానని అంగీకరించిన దస్తగిరి ఆ గొడ్డలి ఎక్కడుందని మాత్రం సీబీఐ అడగలేదు. అప్రూవర్ పేరుతో వదిలేసింది. పైగా బెయిల్ తీసుకుని ,సెక్యూరిటి పెట్టుకుని హ్యాపీగా తిరిగేస్తున్నాడు. viveka dastagiri jagan avinash{#}devineni avinash;kadapa;CBI;Murder.;Newsఅమరావతి : వివేకా హత్యకు ఉపయోగించిన గొడ్డలి ఎక్కడ ?అమరావతి : వివేకా హత్యకు ఉపయోగించిన గొడ్డలి ఎక్కడ ?viveka dastagiri jagan avinash{#}devineni avinash;kadapa;CBI;Murder.;NewsFri, 05 May 2023 05:00:00 GMT


వివేకానందరెడ్డి హత్యకేసును దర్యాప్తుచేస్తున్న సీబీఐ వైఖరిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. హత్యకు కారణాలు ఏమిటి ? హత్యలో సూత్రదారులు, పాత్రదారులు ఎవరనేది అన్నీ కోణాల్లోను దర్యాప్తు చేస్తే తెలుస్తుంది. కానీ పలానా వాళ్ళే హత్యకు సూత్రదారులని ముందే నిర్ణయానికి వచ్చేసి దర్యాప్తు చేస్తున్నట్లుంది. తాము ముందుగానే అనుకున్నట్లుగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఫిక్స్ చేయటం కోసమే దర్యాప్తు చేస్తున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా హైకోర్టుకు సీబీఐ ఇచ్చిన రిపోర్టు కారణంగానే అనుమానాలు పెరిగిపోతున్నాయి.





విషయం ఏమిటంటే హత్య కేసులో అవినా రెడ్డిని అరెస్టుచేయాలన్నది సీబీఐ పట్టుదల. ఇదే విషయాన్ని కోర్టులో స్పష్టంచేసింది. అవినాష్ ను తాము ఎందుకు అరెస్టుచేయాలని అనుకుంటున్నది కూడా చెప్పింది. సీబీఐ చెప్పిన కారణాల్లో ఒకటి ఏమిటంటే  హత్యకు ఉపయోగించిన గొడ్డలి ఎక్కడున్నది తెలుసుకునేందుకట. ఇక్కడే సీబీఐ వైఖరి చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఎందుకంటే హత్య జరిగి సుమారు నాలుగున్నరేళ్ళవుతున్నా సీబీఐ ఇంతవరకు హత్యకు ఉపయోగించిన గొడ్డలిని కనుక్కోలేకపోవటం.





ఇంతకన్నా విచిత్రం ఏమిటంటే వివేకాను తానే గొడ్డలితో నరికి హత్యచేసినట్లు దస్తగిరి ఎప్పుడో అంగీకరించాడు. వివేకా తల, మెడ, చేతులను ఎలా నరికింది ? ఎన్ని వేట్లు వేసిందనే విషయాలను సినిమాలో చూపించినట్లు డీటైల్డ్ గా చెప్పాడు. గొడ్డలిని ఎక్కడ కొన్నది, దానికి ఎక్కడ పదును పెట్టించిన విషయాన్ని కూడా వివరించాడు. వివేకాను గొడ్డలితో నరికి చంపానని అంగీకరించిన దస్తగిరి ఆ గొడ్డలి ఎక్కడుందని మాత్రం సీబీఐ అడగలేదు. అప్రూవర్ పేరుతో వదిలేసింది.  పైగా బెయిల్ తీసుకుని ,సెక్యూరిటి పెట్టుకుని హ్యాపీగా తిరిగేస్తున్నాడు.





గొడ్డలి కొని హత్యచేసిన దస్తగిరిని గొడ్డలి గురించి అడక్కుండా ఎంపీని కస్టడీలో తీసుకుని అడగాలని సీబీఐ అనుకుంటోంది. గొడ్డలి ఏమైందో దస్తగిరి కదా సీబీఐకి చెప్పాల్సింది. ఎందుకు చెప్పలేదు ? పోనీ సీబీఐ అయినా అడగాలి కదా ? ఎందుకడగలేదు ? గొడ్డలి గురించి దస్తగిరి సీబీఐకి చెప్పినట్లుగానీ, దస్తగిరిని సీబీఐ అడిగినట్లు కానీ ఎక్కడా వార్తలు రాలేదు. ఇపుడు కూడా గొడ్డలిగురించి దస్తగిరిని అడగకుండా ఎంపీని అడగాలని సీబీఐ కోర్టుకు చెప్పటమే విచిత్రంగా ఉంది.




RRR Telugu Movie Review Rating

అమరావతి : వివేకా హత్యకు ఉపయోగించిన గొడ్డలి ఎక్కడ ?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>