MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heat-movief4c39420-e28b-473c-8c3e-4d7eb88a12d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heat-movief4c39420-e28b-473c-8c3e-4d7eb88a12d4-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీకి కొత్తదనం ఉన్న కథల అవసరం ఎంతో ఉందనే సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్లు టాలెంటెడ్ నటులతో ఈ మధ్య కాలంలో మంచి సినిమాలను తెరకెక్కిస్తూ విజయాలను అందుకుంటున్నారు. చిన్న సినిమాలు సైతం పాజిటివ్ టాక్ తో పెద్ద సినిమాలకు ధీటుగా విజయాలను అందుకుంటున్న సందర్భాలు కోకొల్లలు. తాజాగా ఆ జాబితాలో మరో సినిమా చేరింది. ఈ వారం విడుదలైన ఆ చిన్న సినిమా పేరు హీట్ కావడం గమనార్హం. Heat Movie{#}abhijith;sharath;Sharrath Marar;Stephen Hawking;Cheque;Horror;kushi;Kushi;marriage;Darsakudu;Director;Cinemaహీట్ మూవీ రివ్యూ!హీట్ మూవీ రివ్యూ!Heat Movie{#}abhijith;sharath;Sharrath Marar;Stephen Hawking;Cheque;Horror;kushi;Kushi;marriage;Darsakudu;Director;CinemaFri, 05 May 2023 16:52:47 GMTసినిమా ఇండస్ట్రీకి కొత్తదనం ఉన్న కథల అవసరం ఎంతో ఉందనే సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్లు టాలెంటెడ్ నటులతో ఈ మధ్య కాలంలో మంచి సినిమాలను తెరకెక్కిస్తూ విజయాలను అందుకుంటున్నారు. చిన్న సినిమాలు సైతం పాజిటివ్ టాక్ తో పెద్ద సినిమాలకు ధీటుగా విజయాలను అందుకుంటున్న సందర్భాలు కోకొల్లలు. తాజాగా ఆ జాబితాలో మరో సినిమా చేరింది. ఈ వారం విడుదలైన ఆ చిన్న సినిమా పేరు హీట్ కావడం గమనార్హం.
 
ఎం.ఎన్.అర్జున్, శరత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో వర్ధన్ గుర్రాల, స్నేహా ఖుషి ప్రధాన పాత్రల్లో నటించారు. బాల్యం నుంచి ఒకరంటే మరొకరు స్నేహంగా మెలిగిన అభిజిత్ (వర్ధన్), సిరిల్ (మోహన్ సాయి) ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఆ కంపెనీని విజయవంతంగా నడిపిస్తుంటారు. అయితే ఆ కంపెనీకి స్టీఫెన్ అనే వ్యక్తి సమస్యలను సృష్టిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. అదే సమయంలో సిరిల్ కు ఆరాధ్య(అంబికా వాణి)తో పెళ్లి కుదురుతుంది.
 
అయితే సిరిల్, అరాధ్య ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం ఆరాధ్య సోదరుడైన రుద్రకు నచ్చదు. ఆ తర్వాత సిరిల్ మరణిస్తాడు. ఈ విషయం తెలిసిన అభిజిత్ ఏం చేశాడు? సిరిల్ ను చంపిన వ్యక్తి ఎవరు? సిరిల్ మరణం వల్ల ఎదురైన సమస్యలకు అభిజిత్ ఎలా చెక్ చెప్పాడు? ఈ స్టోరీలో మైఖేల్ రోల్ ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
 
ఒక రాత్రిలో జరిగే ఈ మూవీ కథలో ఆద్యంతం ఆకట్టుకునే ట్విస్టులు ఉన్నాయి. కథ, కథనంలో చిన్నచిన్న లోపాలు ఉన్నా గ్రిప్పింగ్ గా దర్శకుడు ఈ సినిమాను తెరపై చూపించాడు. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఆ జానర్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంది. స్నేహా ఖుషి రోల్ చిన్నదైనా ఆకట్టుకుంది. ఈ వారం థియేటర్లలో ఆకట్టుకునే మూవీ చూడాలని భావించే వాళ్లు హీట్ సినిమాను బెస్ట్ ఛాయిస్ గా పరిగణించవచ్చు.
 
రేటింగ్ 2.75/5.0



RRR Telugu Movie Review Rating

హీట్ మూవీ రివ్యూ!

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>