PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-birthday-wishes-to-chandrababu-naidu0d6eeeec-230e-4143-9de1-998921466505-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-birthday-wishes-to-chandrababu-naidu0d6eeeec-230e-4143-9de1-998921466505-415x250-IndiaHerald.jpgసుప్రింకోర్టు తాజా తీర్పుతో సిట్ స్పీడు పెంచబోతోంది. అమరావతి నిర్మాణం పేరుతో జరిగిన భూసమీకరణలో వేలాది ఎకరాలను చంద్రబాబు అండ్ కో చవకగా సొంతం చేసుకున్నట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళలో కొందరు, ఎంఎల్ఏలు, పారిశ్రామికవేత్తలు ఎవరెవరి పేర్లతో ఎంతెంత భూములు కొన్నది, బినామీల పేర్లతో కొనుగోలు చేసిన భూముల జాబితా మొత్తం బయటపడింది. తమ్ముళ్ళు చివరకు అసైన్డ్ ల్యాండ్స్ ను కూడా వదల్లేదు.chandrababu tdp jagan {#}Anti-Corruption Bureau;Alapati Rajendra Prasad;CBN;Yevaru;Amaravati;Government;Reddyఅమరావతి : చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోందా ? వాట్ నెక్స్ట్ ?అమరావతి : చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోందా ? వాట్ నెక్స్ట్ ?chandrababu tdp jagan {#}Anti-Corruption Bureau;Alapati Rajendra Prasad;CBN;Yevaru;Amaravati;Government;ReddyFri, 05 May 2023 03:00:00 GMT


తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో మొదటిసారి చంద్రబాబునాయుడు విచారణకు హాజరుకాక తప్పని పరిస్ధితులు ఎదురవ్వబోతోంది. అమరావతి భూ కుంభకోణంతో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలపై విచారణకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను నియమించింది. అమరావతి భూ సమీకరణతో పాటు ఫైబర్ గ్రిడ్ తదితర ప్రాజెక్టుల్లో అవినీతిపై సిట్  విచారణ మొదలుపెట్టింది. అయితే తమ్ముళ్ళు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు.





ఆ స్టేనే ఇపుడు సుప్రింకోర్టు కొట్టేసింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై తర్వాత ప్రభుత్వం ఎందుకు విచారణ జరగకూడదని పిటీషనర్లను సూటిగా ప్రశ్నించింది. అవినీతి, అక్రమాలకు ఆధారాలున్నాయని సిట్ గుర్తించిన విషయాన్ని సుప్రింకోర్టు గుర్తుచేసింది. అవినీతి, అక్రమాలు చేయటానికి గత ప్రభుత్వానికి ఏమన్నా ఇమ్యూనిటి ఉందా అని నిలదీసింది. విచారణ జరుపుకోవచ్చని సిట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.





సుప్రింకోర్టు తాజా తీర్పుతో సిట్ స్పీడు పెంచబోతోంది. అమరావతి నిర్మాణం పేరుతో జరిగిన భూసమీకరణలో వేలాది ఎకరాలను చంద్రబాబు అండ్ కో చవకగా సొంతం చేసుకున్నట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళలో కొందరు, ఎంఎల్ఏలు, పారిశ్రామికవేత్తలు ఎవరెవరి పేర్లతో ఎంతెంత భూములు కొన్నది, బినామీల పేర్లతో కొనుగోలు చేసిన భూముల జాబితా మొత్తం బయటపడింది. తమ్ముళ్ళు చివరకు అసైన్డ్ ల్యాండ్స్ ను కూడా వదల్లేదు.





ఇప్పటికే రికార్డులు రెడీ అయ్యాయి కాబట్టి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవటమే ఆలస్యం. కాబట్టి చంద్రబాబు తదితరులకు నోటీసులు ఇవ్వటానికి సిట్ రెడీ అవుతోందని సమాచారం. గతంలో ఓటుకునోటు కేసులో తెలంగాణా ఏసీబీ నోటీసులిచ్చినా దానిపై చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. అవినీతి ఆరోపణలపై ఎవరు విచారించాలని అనుకున్నా వెంటనే చంద్రబాబు స్టే తెచ్చేసుకునే వారు. కానీ ఇపుడు అలా కుదరదు. ఎందుకంటే విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే సుప్రింకోర్టు కాబట్టి కచ్చితంగా సిట్ విచారణకు చంద్రబాబు హాజరై తీరాల్సిందే. మరి విచారణకు హాజరైన తర్వాత ఏమి జరుగుతుందో చూడాల్సిందే.





RRR Telugu Movie Review Rating

అమరావతి : వివేకా హత్యకు ఉపయోగించిన గొడ్డలి ఎక్కడ ?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>