EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ratan-tatab77f6e3c-752b-40ed-b182-3af4ae93d7c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ratan-tatab77f6e3c-752b-40ed-b182-3af4ae93d7c7-415x250-IndiaHerald.jpgవాళ్ల కోసం, వాళ్ల కుటుంబం కోసం అందరూ కష్టపడతారు. కష్టపడటం అంటే ఒక్కొక్కరు ఉద్యోగాలు చేస్తారు, మరొకరు వ్యాపారాలు చేస్తారు. కొంతమంది తరతరాలుగా వస్తున్న తమ పద్ధతుల్ని, వాళ్ళ ముందు తరాల వాళ్ళు సమాజానికి చేసిన సేవలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తారు. తాము సంపాదించడం మాత్రమే కాకుండా సమాజానికి హితం కూడా చేయాలని కోరుకుంటారు. అలాంటి హృదయం చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి వాళ్లలో అగ్రగణ్యులు టాటా ఫ్యామిలీ. కేవలం తమ కుటుంబ సభ్యులకే అని మాత్రమే కాకుండా, పుట్టిన దేశానికి ఏదైనా చేయాలని అనుకునే తత్వం వRATAN TATA{#}RATAN TATA;Bharateeyudu;Indians;Australia;Service;Indiaరతన్‌ టాటా గొప్పదనం గుర్తించిన విదేశాలు?రతన్‌ టాటా గొప్పదనం గుర్తించిన విదేశాలు?RATAN TATA{#}RATAN TATA;Bharateeyudu;Indians;Australia;Service;IndiaFri, 05 May 2023 23:00:00 GMTవాళ్ల కోసం, వాళ్ల కుటుంబం కోసం అందరూ కష్టపడతారు. కష్టపడటం అంటే ఒక్కొక్కరు ఉద్యోగాలు చేస్తారు, మరొకరు వ్యాపారాలు చేస్తారు. కొంతమంది తరతరాలుగా వస్తున్న తమ పద్ధతుల్ని, వాళ్ళ ముందు తరాల వాళ్ళు సమాజానికి చేసిన సేవలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తారు. తాము సంపాదించడం మాత్రమే కాకుండా సమాజానికి హితం కూడా చేయాలని కోరుకుంటారు. అలాంటి హృదయం చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి వాళ్లలో అగ్రగణ్యులు టాటా ఫ్యామిలీ.


కేవలం తమ కుటుంబ సభ్యులకే అని మాత్రమే కాకుండా, పుట్టిన దేశానికి ఏదైనా చేయాలని అనుకునే తత్వం వాళ్ళది. బాధ్యతాయుతంగా నీతిగా వ్యాపారం చేస్తూ, సేవ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ టాటా ల కుటుంబం నుంచి వచ్చిన రతన్ టాటా కు ఇప్పుడు ఆయన చేసిన సేవలకు విదేశాల నుండి కూడా అరుదైన గుర్తింపు వచ్చింది. అదే ఆస్ట్రేలియా కు సంబంధించిన  అత్యంత గౌరవమైన అవార్డ్. ఆస్ట్రేలియాకు సంబంధించిన "ద రియల్ జెమ్ ఆఫ్ ఇండియా" అవార్డు ఆయనకి దక్కడం విశేషం.


టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా భారతదేశానికి అసలు ఎందుకు గర్వకారణం అనే విషయం మరోసారి నిరూపించారు.  రతన్ టాటాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం లభించింది.  అదే ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఏఓ అవార్డు.  భారతదేశ ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసినందుకు ఆయనకు లభించిన అవార్డు ఇది. అతను స్వీకరించిన ఫోటోలు చూసి ఇంటర్నెట్‌లో నెటిజన్లు అతన్ని రియల్ జెమ్ అని, రియల్ సన్నాఫ్ ఇండియా  అని పిలుస్తున్నారు.


ఆ అవార్డును ఆస్ట్రేలియా వాళ్ళు ఇస్తున్న సందర్భంలో కూడా ఎటువంటి డాబు హంగామా చేయకుండా ఆస్ట్రేలియా దేశపు రాయబారి నుండి ఆయన తీసుకుంటున్న ఫోటోని చూసి నిజమైన భారతీయుడు రతన్ టాటా అని నెటిజెన్లు ప్రశంసపూర్వకమైన ట్రోల్ చేస్తున్నారు. ఆ విధంగా  ఆయన మీద ఉన్న ప్రేమను, గౌరవాన్ని భారతీయులు చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

బ్రా లేకుండా అందాల సోయగం చేస్తున్న సోనమ్ కపూర్..!!

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>