EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pakistan8a0d0126-6a8d-4194-a831-5b067c3c3410-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pakistan8a0d0126-6a8d-4194-a831-5b067c3c3410-415x250-IndiaHerald.jpgపాకిస్థాన్ ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు ముందు చూస్తే గొయ్యి.. వెనక చూస్తే నుయ్యి అన్న చందంలా తయారైంది. ఒక పక్క చైనా పాక్ కు చాలా పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చింది. ఇప్పుడు అది ఎలా చెబితే అలా వినాల్సిన పరిస్థితి. అమెరికా అయితే చాలా బెటర్ అని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఈ మధ్య అమెరికాలో కొన్ని పేపర్లు లీక్ అయ్యాయి. ఆ లీకైన పేపర్లకు సంబంధించి పాకిస్థాన్ లో ని షాబాద్ షరీప్ ప్రభుత్వం చైనా తోనే వెళ్లాలనే ఒత్తిడి ఎక్కువ వస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా నిఘా విభాగం చాలా రహస్యంగా చేసిన విచారణలో పPAKISTAN{#}American Samoa;Pakistan;Minister;Governmentఅమెరికా కంటే చైనాయే బెస్ట్ అనుకుంటున్న పాక్‌?అమెరికా కంటే చైనాయే బెస్ట్ అనుకుంటున్న పాక్‌?PAKISTAN{#}American Samoa;Pakistan;Minister;GovernmentFri, 05 May 2023 00:00:00 GMTపాకిస్థాన్ ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు ముందు చూస్తే గొయ్యి.. వెనక చూస్తే నుయ్యి అన్న చందంలా తయారైంది. ఒక పక్క చైనా పాక్ కు చాలా పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చింది. ఇప్పుడు అది ఎలా చెబితే అలా వినాల్సిన పరిస్థితి. అమెరికా అయితే చాలా బెటర్ అని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఈ మధ్య అమెరికాలో కొన్ని పేపర్లు లీక్ అయ్యాయి.


ఆ లీకైన పేపర్లకు సంబంధించి పాకిస్థాన్ లో ని షాబాద్ షరీప్ ప్రభుత్వం చైనా తోనే వెళ్లాలనే ఒత్తిడి ఎక్కువ వస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా నిఘా విభాగం చాలా రహస్యంగా చేసిన విచారణలో పాకిస్థాన్ ప్రభుత్వం అమెరికా ను కాదని చైనాతో ఎక్కువ సత్సంబంధాలు పెట్టుకోవాలని చూస్తున్నట్లు తేలింది.


పాక్ విదేశాంగ మంత్రి  హినా రబ్బానీ  ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ.. అమెరికా, చైనా అనే రెండు దేశాలతో ఒకేసారి కలిసి పని చేయలేమని పేర్కొంది. ఏదో ఒక దేశంతో వెళ్లాలనుకుంటే చైనాతోనే వెళితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అమెరికాతో ఎక్కువ స్నేహం పెంచుకుని కలిసి సాగితే చైనా కు కోపం తెప్పించిన వాళ్లం అవుతాం. దీంతో చైనా అప్పులు తిరిగి వెంటనే కట్టమని అడుగుతుంది.


ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అప్పులు తీర్చే పరిస్థితి లేదు. కాబట్టి చైనా తో కలిసి నిర్ణయాలు తీసుకోవడం లో తప్పు లేదని పాకిస్థాన్ భావిస్తోంది. కాబట్టి అమెరికా, చైనాల్లో దేనికి సపోర్టు ఇస్తారని అడిగితే చైనా అని చెప్పే స్థాయికి పాకిస్థాన్ వచ్చేసింది. కానీ గతంలో అమెరికా, పాక్ కు సైనిక పరంగా, ఆయుధాల పరంగా, ఆర్థికంగా ఎన్నో సేవలు అందించింది. దీనికి ప్రతిఫలంగా ఇప్పుడు అమెరికా కంటే మాకు ముఖ్యం చైనా యే పాక్ తన వక్రబుద్ధిని చాటుకుంటోంది. మరి ఇప్పటికైనా అమెరికా పాకిస్థాన్ ను నమ్మడం ఆపేస్తుందా లేదా చూడాలి.



RRR Telugu Movie Review Rating

వర్కౌట్ చేస్తూ అందాల విందు చేస్తున్న నోరా ఫతేహి..!!

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>