MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasfe731c59-e766-4044-b533-b099697705e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasfe731c59-e766-4044-b533-b099697705e2-415x250-IndiaHerald.jpg వరస ఫెయిల్యూర్ లతో సతమతమైపోతున్న ప్రభాస్ ఇమేజ్ గురించి అతడి కంటే అతడి అభిమానులు చాల ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు. వచ్చేనెలలో ‘ఆదిపురుష్’ విడుదల ఉన్నప్పటికీ ఆమూవీ పై ప్రభాస్ అభిమానులలో చెప్పుకోతగ్గ ఆశక్తిలేదు. దీనితో వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్న ‘సలార్’ మూవీతో ప్రభాస్ మ్యానియా మళ్ళీ ఏర్పడుతుందని అతడి అభిమానులు ఎన్నో అంచనాలతో ఉన్నారు.అయితే ఈసినిమా గురించి వస్తున్న లీకులు డార్లింగ్ అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఈమూవీ రెండు పార్టులుగా వస్తుందని కొన్ని మీడియా సంస్థలు సింగిల్ పార్ట్ గా వPRABHAS{#}Prabhas;prashanth neel;Kannada;Prasanth Neel;Darling;Yevaru;media;Father;News;Cinemaసలార్ మూవీ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన జగపతిబాబు !సలార్ మూవీ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన జగపతిబాబు !PRABHAS{#}Prabhas;prashanth neel;Kannada;Prasanth Neel;Darling;Yevaru;media;Father;News;CinemaFri, 05 May 2023 10:00:00 GMT
వరస ఫెయిల్యూర్ లతో సతమతమైపోతున్న ప్రభాస్ ఇమేజ్ గురించి అతడి కంటే అతడి అభిమానులు చాల ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు. వచ్చేనెలలో ‘ఆదిపురుష్’ విడుదల ఉన్నప్పటికీ ఆమూవీ పై ప్రభాస్ అభిమానులలో చెప్పుకోతగ్గ ఆశక్తిలేదు. దీనితో వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్న ‘సలార్’ మూవీతో ప్రభాస్ మ్యానియా మళ్ళీ ఏర్పడుతుందని అతడి అభిమానులు ఎన్నో అంచనాలతో ఉన్నారు.


అయితే ఈసినిమా గురించి వస్తున్న లీకులు డార్లింగ్ అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఈమూవీ రెండు పార్టులుగా వస్తుందని కొన్ని మీడియా సంస్థలు సింగిల్ పార్ట్ గా వస్తుందని మరికొన్ని మీడియా సంస్థలు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న జగపతిబాబు ఈవారం విడుదలకాబోతున్న ‘రామబాణం’ సినిమాలో కూడ కీలక పాత్రలో నటిస్తున్నాడు.


ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘సలార్’ మూవీ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఈసినిమాకు సంబంధించి తాను ఇప్పటివరకు కేవలం 5 రోజులు షూటింగ్ లో మాత్రమే పాల్గొన్నానని ఇంకా తన రోల్ కు సంబంధించిన షూటింగ్ చాల ఉంది అంటూ లీకులు ఇచ్చాడు. ప్రశాంత్ నీల్ లాంటి ప్యాషన్ ఉన్న దర్శకులను తాను ఏమీ అడిగనని నేరుగా సెట్స్ కి వెళ్ళిపోయి ఆయన ఏమిచేపితే అలా నటిస్తానని చెప్పడంతో ఈసినిమా షూటింగ్ ఇంకా చాలావరకు పూర్తికావలసి ఉంది అన్న లీకులు ఇచ్చాడు.


ఈమూవీలో మెయిన్ విలన్ జగపతిబాబు అయితే రెండవ ప్రతినాయకుడిగా పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ఈకథలో వీరిద్దరూ తండ్రి కొడుకులు అన్న లీకులు వస్తున్నాయి. అంతేకాదు కన్నడ మీడియా వ్రాస్తున్న వార్తల ప్రకారం జగపతిబాబు పాత్ర ‘సలార్ 2’ లోనే ఎక్కువ ఉంటుందట. ‘బాహుబలి’ తరహాలో ఫస్ట్ పార్ట్ లో మొత్తం కొడుకు ట్రాక్ ని చూపించి సీక్వెల్ లో ఫ్లాష్ బ్యాక్ ను సీక్వెల్ లో చూపెడుతూ ‘సలార్’ ఎవరు అన్నవిషయం పై క్లారిటీ ఇస్తాడట..  





RRR Telugu Movie Review Rating

గార్గి చిత్రనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>