MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alekhya-reddy70dff3eb-30e9-49a8-b815-1e702322e435-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alekhya-reddy70dff3eb-30e9-49a8-b815-1e702322e435-415x250-IndiaHerald.jpgనందమూరి హీరో తారకరత్న ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సరిగ్గా మహాశివరాత్రి రోజున గుండెపోటుతో తారకరత్న తుదిశ్వాస విడిచారు. అతను మరణించి సుమారు రెండు నెలలు అవుతున్నా ఆయన మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికి తారకరత్న రాజకీయాలతో ఎంతో బిజీగా ఉండేవారు. కానీ ఇటీవల నారా లోకేష్ పాదయాత్రలో ఉన్నట్టుండి కుప్పకూలడం.. ఆ తర్వాత హాస్పిటల్లో సుమారు 23 రోజులపాటు మృత్యుతో పోరాడి చివరికి మరణించడం అన్ని ఓ కలలా జరిగిపోయాAlekhya Reddy{#}alekhya;Nara Lokesh;Ishtam;Nuvvu Nenu;Reddy;February;Hero;marriage;Wife'ఈ జన్మకు నువ్వు మాత్రమే చాలు'.. మరోసారి తారకరత్న పై అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్..!!'ఈ జన్మకు నువ్వు మాత్రమే చాలు'.. మరోసారి తారకరత్న పై అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్..!!Alekhya Reddy{#}alekhya;Nara Lokesh;Ishtam;Nuvvu Nenu;Reddy;February;Hero;marriage;WifeFri, 05 May 2023 18:06:45 GMTనందమూరి హీరో తారకరత్న ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సరిగ్గా మహాశివరాత్రి రోజున గుండెపోటుతో తారకరత్న తుదిశ్వాస విడిచారు. అతను మరణించి సుమారు రెండు నెలలు అవుతున్నా ఆయన మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికి తారకరత్న రాజకీయాలతో ఎంతో బిజీగా ఉండేవారు. కానీ ఇటీవల నారా లోకేష్ పాదయాత్రలో ఉన్నట్టుండి కుప్పకూలడం.. ఆ తర్వాత హాస్పిటల్లో సుమారు 23 రోజులపాటు మృత్యుతో పోరాడి చివరికి మరణించడం అన్ని ఓ కలలా జరిగిపోయాయి. ఇక తారకరత్న మరణంతో ఆయన కుటుంబం తల్లడిల్లి పోతోంది. 

ఇక తారకరత్న మరణవార్తను భార్య అలేఖ్య రెడ్డి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తరచూ తన భర్తను తలుచుకుంటూ అతని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఎమోషనల్ పోస్టులు చేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అలేఖ్య రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో మరోసారి ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆ పోస్టులో అలేఖ్య రెడ్డి పేర్కొంటూ..' ఈ జీవితానికి నువ్వు నేను మాత్రమే. జీవితానికి సరిపడా జ్ఞాపకాలని ఇచ్చి వెళ్లావు. వాటితో నేను ముందుకు వెళ్తాను. నా చివరి శ్వాస వరకు నిన్నే ప్రేమిస్తూ ఉంటాను' అంటూ తారకరత్నన్ని తలుచుకుంటూ మరోసారి ఎమోషనల్ పోస్ట్ చేసింది అలేఖ్య రెడ్డి.

ఈ పోస్టులో తారకరత్న చిన్ననాటి ఫోటోని తన కుమారుడి ఫోటోని షేర్ చేస్తూ..' వీళ్లే నా స్టార్స్' అని కూడా రాసుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఈ పోస్ట్ ని చూసి అలేఖ్య రెడ్డికి ధైర్యం చెప్పడంతో పాటు మీ పిల్లలకోసమైనా బాధను దిగమించుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక తారకరత్న అలేఖ్యరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి ఇంట్లో పెద్దలకు ఇష్టం లేకపోయినా తారకరత్న ఇంట్లో వాళ్ళను ఎదిరించి మరి అలేఖ్యరెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కోసం ఏకంగా కుటుంబాన్ని కూడా దూరం పెట్టాడు తారకరత్న. కానీ చివరికి తానే అటు భార్యా పిల్లలకు ఇటు కుటుంబానికి అందరికీ దూరమైపోయాడు...!!



RRR Telugu Movie Review Rating

ది కేరళ స్టోరీ: అసలేంటి ఈ స్టోరీ? వివాదాలకి కారణమేంటి?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>