EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ycp58c05fa8-02fb-41c3-9063-debc0a9762e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ycp58c05fa8-02fb-41c3-9063-debc0a9762e7-415x250-IndiaHerald.jpgతమిళనాడులో రజినీకాంత్ కు ఉన్న పాలోయింగ్ అంతా ఇంతా కాదు. రజినీకాంత్ అసోసియేషన్ లకు ఉండే అధ్యక్షులు అంటే తమిళనాడు లో ఉన్న గ్రామాల్లో సర్పంచులతో సమానం. రజినీకి ప్రతి గ్రామంలో కటౌట్ లు కూడా ఉంటాయి. ఇలాంటి తలైవా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హైదరాబాద్ వచ్చిన సందర్భంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. చంద్రబాబు లేకుంటే హైదరాబాద్ విశ్వ నగరంలా మారేది కాదన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని అన్నారు. 20 ఏళ్ల కిందటే చంద్రబాబు బిల్ గేట్స్ ను ఇండియాకు తీసుకువచ్చారంటే ఆయన గొప్పతనమే అని అన్నారు. ఇది ఎవరి వలYCP{#}Kodali Nani;Rajani kanth;Tamilnadu;Jayanthi;YCP;TDP;CBN;NTR;media;Hyderabad;Teluguరజినీకాంత్‌ వర్సెస్‌ వైసీపీ.. టీడీపీ వాడుకుంటుందా?రజినీకాంత్‌ వర్సెస్‌ వైసీపీ.. టీడీపీ వాడుకుంటుందా?YCP{#}Kodali Nani;Rajani kanth;Tamilnadu;Jayanthi;YCP;TDP;CBN;NTR;media;Hyderabad;TeluguFri, 05 May 2023 06:00:00 GMTతమిళనాడులో రజినీకాంత్ కు ఉన్న పాలోయింగ్ అంతా ఇంతా కాదు. రజినీకాంత్ అసోసియేషన్ లకు ఉండే  అధ్యక్షులు అంటే తమిళనాడు లో ఉన్న గ్రామాల్లో సర్పంచులతో సమానం. రజినీకి ప్రతి గ్రామంలో కటౌట్ లు కూడా ఉంటాయి. ఇలాంటి తలైవా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హైదరాబాద్ వచ్చిన సందర్భంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు.


చంద్రబాబు లేకుంటే హైదరాబాద్ విశ్వ నగరంలా మారేది కాదన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని అన్నారు. 20 ఏళ్ల కిందటే చంద్రబాబు బిల్ గేట్స్ ను ఇండియాకు తీసుకువచ్చారంటే ఆయన గొప్పతనమే అని అన్నారు. ఇది ఎవరి వల్ల సాధ్యం కాదన్నారు. దీంతో వైసీపీ నాయకులకు చిర్రెత్తు కొచ్చింది. వైసీపీ నాయకులు రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు లాంటి వారు బహిరంగంగానే రజినీ వ్యాఖ్యలను ఖండించారు.


కొడాలి నాని కాస్త ఘాటైన విమర్శలు చేశారు. దీనితో పాటు వైసీపీ సోషల్ మీడియా రజినీ కాంత్ ను తీవ్రంగా విమర్శించింది. చంద్రబాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచే సమయంలో రజినీ పక్కనే ఉన్నారని విమర్శించారు. ఎన్టీఆర్ ను ఆనాడు గద్దె దించడంలో రజినీ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి వచ్చి హైదరాబాద్ గురించి మాట్లాడటం హస్యాస్పదమన్నారు. కాబట్టి రజినీ కాంత్ అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలని విమర్శలు చేశారు.


మొన్నటి వరకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే ఈ వివాదం పరిమితమైంది.  ఇప్పడు వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా సూపర్ స్టార్ రజినీ అభిమానులు రెచ్చిపోతున్నారు. రజినీ కాంత్ పై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు. వైసీపీ నాయకులపై తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో రజినీ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. టీడీపీ మాత్రం దీన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటోంది.



RRR Telugu Movie Review Rating

అమరావతి : వివేకా హత్యకు ఉపయోగించిన గొడ్డలి ఎక్కడ ?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>