MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagachaitanyaebc856e6-bd46-4f81-a28e-cae522c3fa7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagachaitanyaebc856e6-bd46-4f81-a28e-cae522c3fa7c-415x250-IndiaHerald.jpgఅక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కస్టడీ'. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కి అలాగే సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో చైతు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక తన గత చిత్రం థాంక్యూ పరాజయం పొందడంతో ఈ సినిమాపై చైతు బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. కేవలం చైతూకే కాదు అక్కినేని హీరోలకి ఈ మధ్యకాలంలో సరైన హిట్టు దక్కడం లేదు. నాగార్జున నుంచి మొదలు పెట్టుకుని చైతు, అఖిల్ నటింNagachaitanya{#}Chaitanya;Press;Traffic police;venkat prabhu;prema;Love;Chitram;akhil akkineni;Box office;Tamil;Akkineni Nagarjuna;Hero;Cinema'ఏజెంట్' ప్లాప్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగ చైతన్య..?'ఏజెంట్' ప్లాప్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగ చైతన్య..?Nagachaitanya{#}Chaitanya;Press;Traffic police;venkat prabhu;prema;Love;Chitram;akhil akkineni;Box office;Tamil;Akkineni Nagarjuna;Hero;CinemaThu, 04 May 2023 14:05:19 GMTఅక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కస్టడీ'. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కి అలాగే సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో చైతు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక తన గత చిత్రం థాంక్యూ  పరాజయం పొందడంతో ఈ సినిమాపై చైతు బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. కేవలం చైతూకే కాదు అక్కినేని హీరోలకి ఈ మధ్యకాలంలో సరైన హిట్టు దక్కడం లేదు. నాగార్జున నుంచి మొదలు పెట్టుకుని చైతు, అఖిల్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచిపోతున్నాయి. 

గత ఏడాది నాగార్జున, చైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా మంచి విజయాన్ని అందుకోగా.. ఆ తర్వాత అక్కినేని హీరోల నుంచి వచ్చిన ది ఘోస్ట్, థాంక్యూ అలాగే రీసెంట్ గా వచ్చిన 'ఏజెంట్' బాక్స్ ఆఫీస్ వద్ద కనీసం 10 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయాయి. ఒక విధంగా అక్కినేని హీరోలకు ఇది ఘోర అవమానమని చెప్పక తప్పదు. అయితే ఇటీవల విడుదలైన అఖిల్ ఏజెంట్ మూవీ పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. భారీ బడ్జెట్ తో పాటు స్పై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం అఖిల్ రెండేళ్లు ఎంతో కష్టపడ్డాడు. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ అవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.ప్రెజెంట్ అక్కినేని ఫ్యాన్స్ అంతా ఓ సాలిడ్ కం బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ కం బ్యాక్ చైతు నటించిన 'కష్టడి' మూవీతో సాధ్యపడుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఇక కస్టడీ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్ లో ఓ రిపోర్టర్ చైతుకి ఓ ప్రశ్న అని అడిగాడు.. 'గత కొంతకాలంగా మీ ఫ్యామిలీ నుంచి వస్తున్న సినిమాలన్నీ ప్లాప్స్ అవుతున్నాయి. ఫాన్స్ అంతా మంచి కం బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు? అని అడగగా.. చైతు బదులిస్తూ.. 'అభిమానులు మాపై చూపిస్తున్న ప్రేమ వెలకట్టలేనిది. ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వాలని తీస్తాము. కానీ కొన్ని కొన్ని సార్లు అవి అంచనాలను అందుకోలేకపోవచ్చు. రీసెంట్ టైంలో ఏజెంట్ విషయంలో కూడా అదే జరిగింది. కానీ కస్టడీ మూవీ చాలా బాగా వచ్చింది. ఫ్యాన్స్ కోరుకునే భారీ కమర్షియల్ హిట్ ఈ మూవీతో లభిస్తుందని నమ్మకంతో ఉన్నాను' అంటూ చైతు చెప్పుకొచ్చాడు...!!



RRR Telugu Movie Review Rating

రజినీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>