MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr30e8b32cfb-aef5-4979-b2ee-ef408f3a5cc5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr30e8b32cfb-aef5-4979-b2ee-ef408f3a5cc5-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వికపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ అగ్రనటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే తాజాగా ఓ బుల్లితెర నటి ఈ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆ బుల్లితెర నటి మరెవరో కాదు 'చైత్ర రాయ్'. నిజానికి ఈమె కన్నడ నటి అయినప్పటికీ ప్రస్తుతం తెలుగు సీరియల్స్NTR30{#}Mohanlal;mikkilineni;Sea;Yuva;Chitram;Shiva;lord siva;koratala siva;Saif Ali Khan;NTR;Kannada;Santosham;kalyan;Telugu;Heroine;India;bollywood;Hero;Cinema'NTR30' లో నటించే ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర నటి..?'NTR30' లో నటించే ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర నటి..?NTR30{#}Mohanlal;mikkilineni;Sea;Yuva;Chitram;Shiva;lord siva;koratala siva;Saif Ali Khan;NTR;Kannada;Santosham;kalyan;Telugu;Heroine;India;bollywood;Hero;CinemaThu, 04 May 2023 17:10:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వికపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ అగ్రనటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే తాజాగా ఓ బుల్లితెర నటి ఈ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆ బుల్లితెర నటి మరెవరో కాదు 'చైత్ర రాయ్'. నిజానికి ఈమె కన్నడ నటి అయినప్పటికీ ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో నటిస్తూ తెలుగు అమ్మాయిగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. 

ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఒకరికి ఒకరు, మనసున మనసై, దట్ ఇజ్ మహాలక్ష్మి వంటి సీరియల్స్ లో చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇక ఇటీవల అత్తారింట్లో అక్క చెల్లెలు అనే సీరియల్ లో ఏకంగా డ్యూయల్ రోల్ తో కూడా ఆకట్టుకుంది. అలా తెలుగు బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైత్ర రాయ్ కి పలు సినిమా అవకాశాలు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా నటిస్తున్నటువంటి సైఫ్ అలీ ఖాన్ భార్యగా నటించే అవకాశాన్ని చైత్ర రాయ్ అందుకున్నట్టు సమాచారం. బుల్లితెరపై సీరియల్స్ నటించే చైత్ర రాయ్ కి ఇలా వెండితెరపై అగ్ర హీరో సినిమాలో అవకాశం రావడంతో ఆమె అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన గత చిత్రం జనతా గ్యారేజ్ లో కూడా ఒకప్పటి హీరోయిన్ అయిన దేవయానిని మోహన్ లాల్ భార్య పాత్రలో ఎంపిక చేసుకున్నాడు దర్శకుడు. సినిమాలో ఆమె కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు సీరియల్ నటి అయిన చైత్ర రాయ్ ని సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్రలో ఏ విధంగా చూపిస్తాడో చూడాలి. ఇక ఆచార్య వంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చేడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కానుంది...!!



RRR Telugu Movie Review Rating

'NTR30' లో నటించే ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర నటి..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>