Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni1f5fd292-b47d-4007-830c-6c9b123fd4b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni1f5fd292-b47d-4007-830c-6c9b123fd4b3-415x250-IndiaHerald.jpgఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచి మహేంద్ర సింగ్ ధోని అభిమానులందరూ కూడా ఆందోళనలోనే మునిగిపోయారు అన్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనకు పెద్ద కారణం కూడా ఉంది. ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ మహేంద్రసింగ్ ధోనీకి చివరి ఐపీఎల్ అంటూ ప్రచారం మొదలైంది. ఈ ఐపీఎల్ ముగిసిన వెంటనే ధోనీ తన ఐపీఎల్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అంటూ ఎంతో మంది చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందించారు అని చెప్పాలి. దీంతో నిజమేనా ఇదే దోనికి చివరి ఐపిఎల్ అవుతుందా? ఇక ధోని ఆటను చూడలేమా అని అభిమానులు ఆందోDhoni{#}Mahi;MS Dhoni;Lucknow;Chennaiఐపీఎల్ రిటైర్మెంట్ పై.. మొదటిసారి స్పందించిన ధోని?ఐపీఎల్ రిటైర్మెంట్ పై.. మొదటిసారి స్పందించిన ధోని?Dhoni{#}Mahi;MS Dhoni;Lucknow;ChennaiThu, 04 May 2023 09:00:00 GMTఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచి మహేంద్ర సింగ్ ధోని అభిమానులందరూ కూడా ఆందోళనలోనే మునిగిపోయారు అన్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనకు పెద్ద కారణం కూడా ఉంది. ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ మహేంద్రసింగ్ ధోనీకి చివరి ఐపీఎల్ అంటూ ప్రచారం మొదలైంది. ఈ ఐపీఎల్ ముగిసిన వెంటనే ధోనీ తన ఐపీఎల్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అంటూ ఎంతో మంది చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందించారు అని చెప్పాలి. దీంతో నిజమేనా ఇదే దోనికి చివరి ఐపిఎల్ అవుతుందా? ఇక ధోని ఆటను చూడలేమా అని అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు.


 ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏ మైదానంలో మ్యాచ్ ఆడిన కూడా ఇక చెన్నై అభిమానులు అందరూ భారీగా తరలివస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటివరకు వాళ్లు వీళ్లు స్పందించడమే తప్ప ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి మహేంద్రసింగ్ ధోని మాత్రం స్పందించలేదు అని చెప్పాలి. కానీ ఇటీవలే మొట్టమొదటిసారి తన ఐపిఎల్ రిటైర్మెంట్ పై నోరు విప్పాడు మహేంద్రసింగ్ ధోని. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్ కి ముందు టాస్ వేసే సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డానీ మోరిసన్ మాట్లాడుతూ.. ఇది మీకు చివరి ఐపీఎల్ కదా.. ఈ ఫేవరెల్ ను మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అంటూ అడగగా.. ఆసక్తికర సమాధానం చెప్పాడు.



 ఇదే నా చివరి ఐపీఎల్ అని మీరే డిసైడ్ అయ్యారా? నేను చెప్పలేదు కదా అంటూ మహేంద్ర సింగ్ ధోని నవ్వుతూ సమాధానం చెప్పాడు. దీంతో ధోని అభిమానులు అందరిలో కూడా ఒక భరోసా వచ్చింది. ధోని అలా అన్నాడు అంటే ఇక రిటైర్మెంట్ ఆలోచన లేదు అని అర్థం. నిజంగా మహి అభిమానులందరికీ పండగ లాంటి న్యూస్ చెప్పాడు అంటూ సంతోషంలో మునిగిపోయారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు. ధోని ఎప్పుడు రిటైర్మెంట్ పై స్పందించలేదు కానీ ఎందుకు అతను చెప్పక ముందే రిటైర్ అవుతాడని  ప్రచారం మొదలుపెడతారు అని మరి కొంతమంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

HBD: త్రిష కెరియర్ మలుపు తిరగడానికి కారణం.. అదే..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>