MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jagapathi-babue8e97790-0656-4a2f-8205-8552c1524c3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jagapathi-babue8e97790-0656-4a2f-8205-8552c1524c3e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా గోపీచంద్ నటించిన 'రామబాణం' సినిమాలో జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషించాడు. మే 5వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రమోషన్స్ లో పాల్గొన్నారు జగపతిబాబు. ఈ సందర్భంగా ఓ మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'రామబాణం'. ఈ సినిమాలో జగపJagapathi Babu{#}Kodali Nani;Hyderabad;YCP;Rajani kanth;srivas;CBN;TDP;NTR;Chitram;Heroine;Cinemaరజినీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు..?రజినీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు..?Jagapathi Babu{#}Kodali Nani;Hyderabad;YCP;Rajani kanth;srivas;CBN;TDP;NTR;Chitram;Heroine;CinemaThu, 04 May 2023 14:15:00 GMTటాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా వరుస  సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా గోపీచంద్ నటించిన 'రామబాణం' సినిమాలో జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషించాడు. మే 5వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రమోషన్స్ లో పాల్గొన్నారు జగపతిబాబు. ఈ సందర్భంగా ఓ మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'రామబాణం'. ఈ సినిమాలో జగపతిబాబు గోపీచంద్ కి అన్నయ్యగా కనిపించబోతున్నాడు. 

సీనియర్ హీరోయిన్ కుష్బూ కూడా ఈ మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేసింది. అయితే తాజాగా మీడియాతో ముచ్చటించిన జగపతిబాబు సూపర్ స్టార్ రజనీకాంత్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. రజనీకాంత్ తో కలిసి జగపతిబాబు 'కథానాయకుడు' అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల విజయవాడలో జరిగిన నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రజనీకాంత్ సీనియర్ ఎన్టీఆర్ గారితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. సినిమా రంగంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్ఫూర్తిని పొందాడో ఈ కార్యక్రమంలో రజినీకాంత్ వివరించారు. ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని కొనియాడారు.

ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత అభివృద్ధి చెందిందంటే అందుకు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ప్రధాన కారణమని చెప్పుకొచ్చాడు రజినీకాంత్. అయితే ఈయన వ్యాఖ్యలను జీర్ణించుకోలేని వైసిపి మంత్రులు ఆర్కే రోజా, కొడాలి నాని రజనీకాంత్ పై తీవ్రమైన విమర్శలు చేశారు.తాజాగా ఈ ఘటనపై జగపతిబాబు రియాక్ట్ అయ్యారు. క్రమంలోనే ఆయన మాట్లాడుతూ..' రజనీకాంత్ చాలా పర్ఫెక్ట్. ఆయన ఎప్పుడు బాగా మాట్లాడుతారు అని పేర్కొన్నాడు. ఇక ఇటీవల రజనీకాంత్ పై వైసీపీ నేతలు చేసిన విమర్శలపై స్పందించాలని విలేకర్లు జగపతిబాబుని కోరగా.. అక్కడ ఏం జరిగిందో తనకు తెలియదని, కానీ రజనీకాంత్ నిజాలే మాట్లాడతారని చెప్పుకొచ్చాడు





RRR Telugu Movie Review Rating

రజినీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు..?

అమెరికా చేసిన తప్పే.. ఆ యుద్ధానికి కారణమా?

ముసుగులో రష్యాతో యూరప్‌ దేశాల వ్యాపారం?

భారత్‌తో యుద్ధం ఎప్పుడో చెప్పేసిన పాక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>