MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi117c2e81-b5fa-46b4-bead-6d74124f5a75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi117c2e81-b5fa-46b4-bead-6d74124f5a75-415x250-IndiaHerald.jpg ‘వాల్తేర్ వీరయ్య’ సూపర్ సక్సస్ కావడంతో మంచి జోష్ లో ఉన్న చిరంజీవి తన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’ ను కూడ బ్లాక్ బష్టర్ హిట్ చేయాలని గట్టిపట్టుదల పై ఉన్నాడు. ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్న మెహర్ రమేష్ ఫ్లాప్ ల పర్వంలో ఉన్నప్పటికీ చిరంజీవి ధైర్యంగా అతడి చేతిలో ఈమూవీ ప్రాజెక్ట్ పెట్టడమే కాకుండా ఈసినిమా మేకింగ్ విషయంలో అనేక సలహాలు కూడ ఇస్తూ ఈమూవీ సక్సస్ కు మార్గాలు సుగమం చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈమూవీ ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ సక్సస్ పై నిర్మాతలు ధైర్యంగా ఉన్నారు. ఆగష్టు chirangeevi{#}keerthi suresh;Dussehra;August;Industry;Vijayadashami;Balakrishna;kirti;meher ramesh;Josh;Tamil;Chiranjeevi;News;Cinemaభోళా శంకర్ కు కీర్తి సురేష్ సమస్యలు ?భోళా శంకర్ కు కీర్తి సురేష్ సమస్యలు ?chirangeevi{#}keerthi suresh;Dussehra;August;Industry;Vijayadashami;Balakrishna;kirti;meher ramesh;Josh;Tamil;Chiranjeevi;News;CinemaWed, 03 May 2023 10:00:00 GMT
‘వాల్తేర్ వీరయ్య’ సూపర్ సక్సస్ కావడంతో మంచి జోష్ లో ఉన్న చిరంజీవి తన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’ ను కూడ బ్లాక్ బష్టర్ హిట్ చేయాలని గట్టిపట్టుదల పై ఉన్నాడు. ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్న మెహర్ రమేష్ ఫ్లాప్ ల పర్వంలో ఉన్నప్పటికీ చిరంజీవి ధైర్యంగా అతడి చేతిలో ఈమూవీ ప్రాజెక్ట్ పెట్టడమే కాకుండా ఈసినిమా మేకింగ్ విషయంలో అనేక సలహాలు కూడ ఇస్తూ ఈమూవీ సక్సస్ కు మార్గాలు సుగమం చేస్తున్నాడు.


ఇప్పటికే విడుదలైన ఈమూవీ ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ సక్సస్ పై నిర్మాతలు ధైర్యంగా ఉన్నారు. ఆగష్టు 11న ఈసినిమా విడుదల అంటూ చాలముందుగానే ప్రకటించారు. ఆగష్టు 11నుండి వరసపెట్టి సెలవులు రావడంతో ఈమూవీ భారీ కలక్షన్స్ కు సహకరిస్తుందని ఈమూవీ నిర్మాతల నమ్మకం.


అయితే ఈమూవీ షూటింగ్ ఇంకా 40 శాతం పూర్తి కావలసి ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. దీనికికారణం కీర్తి సురేష్ అంటున్నారు. కీర్తి చిరంజీవి లపై తీయవలసిన కీలక సన్నివేశాలు ఇంకా చాల పెండింగ్ లో ఉన్నాయి అని టాక్. కీర్తి సురేష్ ఈమధ్య ఒక తమిళ సినిమా ఒప్పుకుని ఆసినిమాకు తన బల్క్ డేట్స్ ఇవ్వడంతో ఆమె డేట్స్ ‘భోళా శంకర్’ కు సమస్యగా మారింది అని అంటున్నారు. దీనితో ఈసినిమా అనుకున్న విధంగా ఆగష్టు 11న విడుదల కాదేమో అంటూ పుకార్లు వస్తున్నాయి.


వాస్తవానికి ఇలాంటి లాంగ్ వీకెండ్ డేట్ మిస్ అయితే మళ్ళీ దసరా వరకు ‘భోళా శంకర్’ కు సరైన రిలీజ్ డేట్ దొరకదు. దసరా కు విడుదలచేయాలి అంటే అక్కడ మళ్ళీ బాలకృష్ణ అనీల్ రావిపూడి లతో పోటీ తప్పదు. దీనితో ఏదోవిధంగా ఈసినిమాను అనుకున్న తేదీకి విడుదల చేసి తీరాలి అన్న పట్టుదలతో నిర్మాతలు ఉన్నారు. అయితే కీర్తి సహకారం బట్టి ఈమూవీ రిలీజ్ ఆధారపడి ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి..







RRR Telugu Movie Review Rating

పుష్ప 2: విడుదలకు ముందే బన్నీ రూల్.. అన్ స్టాపబుల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>