Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/fraud29c4a412-bf77-4e7c-832c-677b264dab77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/fraud29c4a412-bf77-4e7c-832c-677b264dab77-415x250-IndiaHerald.jpgకొన్ని కొన్ని సార్లు కొంతమంది చేసే నిర్లక్ష్యం ఇతరుల పాలిట శాపంగా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. చిన్నపాటి నిర్లక్ష్యం అయినప్పటికీ పక్కవారికి తీవ్ర నష్టాన్ని కష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా డాక్టర్లు ఇలా నిర్లక్ష్యం చేస్తే మాత్రం చివరికి పేషెంట్ల ప్రాణాల మీదికి వస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక మహిళకి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఊహించని చేదు అనుభవం ఎదురయింది. ఓ మహిళ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం ఆమె గర్భం దాల్చడం సంచలనంగా మారిపోయింది.Fraud{#}court;Degree;Husband;Governmentఆపరేషన్ చేయించుకున్నాక.. గర్భం దాల్చింది.. చివరికి?ఆపరేషన్ చేయించుకున్నాక.. గర్భం దాల్చింది.. చివరికి?Fraud{#}court;Degree;Husband;GovernmentWed, 03 May 2023 09:00:00 GMTకొన్ని కొన్ని సార్లు కొంతమంది చేసే నిర్లక్ష్యం ఇతరుల పాలిట శాపంగా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. చిన్నపాటి నిర్లక్ష్యం అయినప్పటికీ పక్కవారికి తీవ్ర నష్టాన్ని కష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా డాక్టర్లు ఇలా నిర్లక్ష్యం చేస్తే మాత్రం చివరికి పేషెంట్ల ప్రాణాల మీదికి వస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక మహిళకి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఊహించని చేదు అనుభవం ఎదురయింది. ఓ మహిళ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది.


 కానీ ఆ తర్వాత మాత్రం ఆమె గర్భం దాల్చడం సంచలనంగా మారిపోయింది. ఈ ఘటన మధురైలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. తూత్తుకుడి ప్రాంతానికి చెందిన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబ పోషణ చూసుకుంటున్నాడు. ఇక వీరి ఆదాయం అంతంత మాత్రం కావడం వారికి పుట్టిన ఇద్దరు కూడా ఆడపిల్లలే కావడంతో పోషణ భారంగా మారింది. దీంతో ఇక పిల్లలు చాలు అని నిర్ణయానికి వచ్చారు ఆ భార్యాభర్తలు. ఇక 2013లో కూడా ప్రభుత్వ వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది ఆ మహిళ.


 కానీ ఊహించని విధంగా 2014లో మళ్లీ గర్భం దాల్చింది. ఇక 2017లో మూడో బిడ్డకు జన్మనిచ్చింది సదర మహిళ. ఆపరేషన్ చేయించుకున్నాక ఎలా గర్భం వచ్చిందో అర్థం కాక ఆమె షాక్ అయింది. ఇక వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది అన్న విషయాన్ని అర్థం చేసుకుంది. దీంతో బాధితురాలు 2016లో కోర్టును ఆశ్రయించింది. అయితే ఇక ఈ కేసులో మధురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాధితురాలు మూడో బిడ్డ చదువు, పుస్తకాలు, ఖర్చులు అన్నిటినీ ప్రభుత్వం భరించాలి అంటూ ఆదేశించింది. పిల్లల పోషణ నిమిత్తం కుటుంబానికి ఏడాదికి 1.20  లక్షలు లేదా మరోబిడ్డకు డిగ్రీ వయసు వచ్చేంతవరకు నెలకు పదివేలు అందించాలంటు తీర్పునిచ్చింది.



RRR Telugu Movie Review Rating

అమరావతి : తమ్ముళ్ళలో పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>