Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-a80292a4-a2ae-4103-9051-bdd1a6b31bda-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-a80292a4-a2ae-4103-9051-bdd1a6b31bda-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఐపీఎల్ పోరును భారత క్రికెట్ ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నువ్వా నేనా అన్నట్లుగా మ్యాచ్ జరగడమే కాదు ఆటగాళ్ల మధ్య కూడా నువ్వా నేనా అన్నట్లుగా గొడవ జరుగుతూ ఉండడంతో ప్రతి ఒక్క మ్యాచ్ మరింత ఉత్కంఠ భరితంగా మారుతుంది అని చెప్పాలి. అయితే ఇలా ఐపీఎల్ మ్యాచ్లతో వేడి మీద ఉన్న భారత క్రికెట్ లవర్స్.. అందరికీ కూడా ఒక చల్లటి వార్తలు చెప్పింది ఐసీసీ. మొన్నటి వరకు టెస్ట్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో కొనసాగిన టీమిండియా ఇక ఇప్పుడు అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది అన్న విషయాన్ని ఇటీవల ఐసీసీCricket {#}Cricket;Bangladesh;England;Australia;India;BCCI;Newsసింహాసనం రోహిత్ సేనదే.. అదరగొట్టిన టీమిండియా?సింహాసనం రోహిత్ సేనదే.. అదరగొట్టిన టీమిండియా?Cricket {#}Cricket;Bangladesh;England;Australia;India;BCCI;NewsWed, 03 May 2023 09:15:00 GMTప్రస్తుతం ఐపీఎల్ పోరును భారత క్రికెట్ ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నువ్వా నేనా అన్నట్లుగా మ్యాచ్ జరగడమే కాదు ఆటగాళ్ల మధ్య కూడా నువ్వా నేనా అన్నట్లుగా గొడవ జరుగుతూ ఉండడంతో ప్రతి ఒక్క మ్యాచ్ మరింత ఉత్కంఠ భరితంగా మారుతుంది అని చెప్పాలి. అయితే  ఇలా ఐపీఎల్ మ్యాచ్లతో వేడి మీద ఉన్న భారత క్రికెట్ లవర్స్.. అందరికీ కూడా ఒక చల్లటి వార్తలు చెప్పింది ఐసీసీ. మొన్నటి వరకు టెస్ట్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో కొనసాగిన టీమిండియా ఇక ఇప్పుడు అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది అన్న విషయాన్ని ఇటీవల ఐసీసీ ప్రకటించింది.



 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన వార్షిక రాంకింగ్స్ లో 121 రైటింగ్ పాయింట్ల తో భారత్ టాప్ ర్యాంకు చేరుకుంది అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన ఆస్ట్రేలియా.. 116 రేటింగ్ పాయింట్స్ తో రెండో స్థానానికి పడిపోయింది. దీంతో 15 నెలల నుంచి సాంప్రదాయమైన క్రికెట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కూర్చున్న ఆస్ట్రేలియా ఆదిపత్యానికి గండి పడినట్లు అయిపోయింది అని చెప్పాలి. భారత్, ఆస్ట్రేలియా తర్వాత ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జింబాబ్వేలు వరుసగా మొదటి పది స్థానాల్లో నిలిచాయి.



 ఇకపోతే అటు ఐపిఎల్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా భారత్ మధ్య ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఛాంపియన్షిప్ లో వరుసగా భారత్ రెండోసారి ఫైనల్ చేరుకోవడం గమనార్హం. 2021 లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో  కివిస్ చేతిలో ఓడిపోయిన భారత్.. ఈసారి మాత్రం ఆస్ట్రేలియాపై ఫైనల్లో విజయం సాధించి విశ్వవిజేతగా నిలవాలని ఆశపడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి. ఈ క్రమంలోనే బీసీసీఐ డబ్ల్యూటీసి ఫైనల్ కోసం సన్నతమవుతుంది. ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన వివరాలను ప్రకటించింది బీసీసీఐ.



RRR Telugu Movie Review Rating

ఇమిటేట్ చేసి.. ఇంద్రజ పరువు తీసేసిన హైపర్ ఆది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>