MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh36668408-6a4a-48e2-9b30-e55126b7e18b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh36668408-6a4a-48e2-9b30-e55126b7e18b-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు నుండి సినిమా వచ్చి ఒక సంవత్సరం అయిపోయింది. ‘సర్కారు వారి పాట’ మహేష్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోవడంతో ఒక భారీ బ్లాక్ బష్టర్ హిట్ కోసం మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ కాంబినేషన్ లో మహేష్ నటిస్తున్న మూవీ రకరకాల కారణాలతో ఆలస్యం అవుతున్న నేపధ్యంలో వచ్చే సంక్రాంతికి ఈమూవీ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనితో ఈసంవత్సరం అంతా మహేష్ నుండి సినిమా రాకుండానే గడిచిపోతోంది. త్రివిక్రమ్ మూవీని పూర్తి చేసిన తరువాత మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తరువాత అతడుmahesh{#}mahesh babu;Rajamouli;Athadu;Darsakudu;trivikram srinivas;Director;Cinema;Newsషాకింగ్ నిర్ణయం తీసుకున్న మహేష్ బాబు !షాకింగ్ నిర్ణయం తీసుకున్న మహేష్ బాబు !mahesh{#}mahesh babu;Rajamouli;Athadu;Darsakudu;trivikram srinivas;Director;Cinema;NewsWed, 03 May 2023 13:08:42 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు నుండి సినిమా వచ్చి ఒక సంవత్సరం అయిపోయింది. ‘సర్కారు వారి పాట’ మహేష్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోవడంతో ఒక భారీ బ్లాక్ బష్టర్ హిట్ కోసం మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ కాంబినేషన్ లో మహేష్ నటిస్తున్న మూవీ రకరకాల కారణాలతో ఆలస్యం అవుతున్న నేపధ్యంలో వచ్చే సంక్రాంతికి ఈమూవీ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే.


దీనితో ఈసంవత్సరం అంతా మహేష్ నుండి సినిమా రాకుండానే గడిచిపోతోంది. త్రివిక్రమ్ మూవీని పూర్తి చేసిన తరువాత మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తరువాత అతడు ఆ ప్రాజెక్ట్ నుండి ఎప్పుడు బయటకు వస్తాడో అతడికి కూడ తెలియని పరిస్థితి. ఈమూవీని రెండు బాగాలుగా తీస్తారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో మరో మూడు లేదంటే నాలుగు సంవత్సరాల వరకు మహేష్ మరొక దర్శకుడు దర్శకత్వంలో నటించే పరిస్థితి కనిపించడం లేదు అని అంటారు.


ఈ పరిస్థితుల మధ్య దర్శకుడు వంశీ పైడిపల్లి ఒక కథ చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ రాజమౌళి సినిమా పూర్తి అయ్యేవరకు తాను మరే కథలు విననని మరెవ్వరికీ సినిమాల విషయంలో మాట ఇవ్వను అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మహేష్ కు అడ్వాన్స్ లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మహేష్ ఆవిషయంలో సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు టాక్.


వాస్తవానికి రాజమౌళి మహేష్ తో తీయబోతున్న మూవీ కథ ఇంకా ఫైనల్ కాలేదు. ఇంకా కథకు సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలై 2025 సమ్మర్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే రాజమౌళి ఆలోచనలు అతడి సినిమాలలో నటించే హీరోలకు కూడ అంతుపట్టవు. అందువల్లనే తన విషయం తేలేవరకు తన భవిష్యత్ సినిమాల కథల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని మహేష్ ఒక స్థిర నిర్ణయంలో ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి..  





RRR Telugu Movie Review Rating

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మనోబాల మృతి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>