PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/why-tdp-leader-pattabhi-doing-over-actionc90cbae1-e7b1-4f4c-9d6a-f7b730bed7e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/why-tdp-leader-pattabhi-doing-over-actionc90cbae1-e7b1-4f4c-9d6a-f7b730bed7e2-415x250-IndiaHerald.jpgఇక్కడే టీడీపీ నేత పట్టాభి సీన్లోకి ఎంటరయ్యారు. థాయ్ ల్యాండ్ కేంద్రంగా చికోటిప్రవీణ్, కొడాలి నాని, వల్లభనేని వంశీల అక్రమాలు బయటపడ్డాయంటు గోలమొదలుపెట్టారు. పటాయాలో పట్టుబడింది చికోటి, కొడాలి, వంశీల ముఠాలే అంటు బురదచల్లేశారు. వీళ్ళ కమీషన్ల కక్కుర్తికి పదులసంఖ్యలో తెలుగు వాళ్ళు బలైపోయినట్లు పట్టాభి ఆరోపించారు. క్యాసినో నిర్వహించిన వారితో పాటు పట్టుబడ్డవారందరికీ ఆరేళ్ళు శిక్షపడుతుందన్నారు. అయితే పట్టాభి గమనించనిది ఏమింటే ఆరుగురిని మినహా మిగిలిన వాళ్ళందరినీ పోలీసులు వదిలిపెట్టేశారు. tdp pattabhi jagan chikota praveen{#}praveen;Medak;police;TDP;Vijayawada;Jagan;Reddy;Teluguఅమరావతి : పట్టాభికి జరిగింది సరిపోలేదా ?అమరావతి : పట్టాభికి జరిగింది సరిపోలేదా ?tdp pattabhi jagan chikota praveen{#}praveen;Medak;police;TDP;Vijayawada;Jagan;Reddy;TeluguWed, 03 May 2023 05:00:00 GMT



ప్రపంచంలో ఎక్కడ నెగిటివ్ గా ఏమి జరిగినా వెంటనే దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ముడిపెట్టేయటంలో తమ్ముళ్ళు ముందుంటారు. తమ్ముళ్ళు చల్లే బురదకు ఎల్లోమీడియా యథాశక్తి సహకారం అందిస్తుంటుంది. ఇపుడు ఇదంతా ఎందుకంటే థాయ్ ల్యాండ్ లోని పటాయాలో క్యాసినో ఆడుతు తెలుగువాళ్ళు పట్టుబడ్డారు. వీళ్ళిందరికీ అక్కడ ఏర్పాట్లుచేసింది, ఇక్కడి నుండి థాయ్ ల్యాండ్ కు రానుపోను ఏర్పాట్లుచేసిందంతా  చికోటి ప్రవీణే.





అక్కడ గ్యాంబ్లింగ్ ఆడుతుండగా పోలీసులు దాడులుజరిపి 93 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చికోటి ప్రవీణ్ తో పాటు మెదక్ జిల్లా సహకర బ్యాంకు ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డితో పాటు అనేకమంది రాజకీయనేతలు, వ్యాపారస్తులున్నారు. పట్టుబడ్డ వారిలో 83 మంది తెలుగువాళ్ళే. చికోటితో పాటు మరో ఐదుగురిని అరెస్టుచేసిన పోలీసులు మిగిలిన 78 మందికి కౌన్సిలింగ్ చేసి ఫైనేసి, వార్నింగ్ ఇచ్చి  పంపేశారు.





ఇక్కడే టీడీపీ నేత పట్టాభి సీన్లోకి ఎంటరయ్యారు. థాయ్ ల్యాండ్ కేంద్రంగా చికోటిప్రవీణ్, కొడాలి నాని, వల్లభనేని వంశీల అక్రమాలు బయటపడ్డాయంటు గోలమొదలుపెట్టారు. పటాయాలో పట్టుబడింది చికోటి, కొడాలి, వంశీల ముఠాలే అంటు బురదచల్లేశారు. వీళ్ళ కమీషన్ల కక్కుర్తికి పదులసంఖ్యలో తెలుగు వాళ్ళు బలైపోయినట్లు పట్టాభి ఆరోపించారు. క్యాసినో నిర్వహించిన వారితో పాటు పట్టుబడ్డవారందరికీ ఆరేళ్ళు శిక్షపడుతుందన్నారు. అయితే పట్టాభి గమనించనిది ఏమింటే ఆరుగురిని మినహా మిగిలిన వాళ్ళందరినీ పోలీసులు వదిలిపెట్టేశారు.





24 గంటలూ, 365 రోజులు పట్టాభికి జగన్ మీద విషం చిమ్మటమే టార్గెట్. ఎలాగైనా జగన్ను జనాల్లో గబ్టుపట్టించటమే టార్గెట్ గా పనిచేస్తున్నారు. అందుకనే నోటికొచ్చింది మాట్లాడుతుంటారు. ఇలా మాట్లాడే గతంలో దాడులకు గురయ్యారు. జగన్ను తిట్టినందుకే కేసు నమోదై రిమాండులో కూడా ఉండొచ్చారు. అయినా తన పద్దతి మారలేదు. ఇపుడు చికోటి పట్టుబడగానే మళ్ళీ బురదచల్లటం మొదలుపెట్టేశాడు.





టీడీపీ హయాంలో కూడా ఎంతోమంది తమ్ముళ్ళ భార్యలు విజయవాడ హోటళ్ళల్లో పేకాట ఆడుతు పట్టుబడ్డ విషయం అందరికీ తెలిసిందే.  గ్యాంబ్లింగ్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మొదలైనట్లు పట్టాభి గోలచేస్తున్నాడు. టీడీపీ ట్విట్టర్లో కూడా ఇదేవిధమైన ప్రచారం చేసేస్తున్నారు. ఇలాంటి అడ్డదిడ్డమైన ఆరోపణలు, బురదచల్లుడు రాజకీయం చేసినందుకే ఒకసారి పోలీసులు అరెస్టుచేశారు. అది సరిపోయినట్లు లేదు.  








RRR Telugu Movie Review Rating

ఔటర్ రింగ్ రోడ్డు లీజులో అన్ని కోట్ల అవినీతా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>