PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawankalyan-tdp-chandrababu-jagana23a0aaa-e4d7-4e16-b788-abe6cc433f4a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawankalyan-tdp-chandrababu-jagana23a0aaa-e4d7-4e16-b788-abe6cc433f4a-415x250-IndiaHerald.jpgఇపుడిదంతా ఎందుకంటే ఆమధ్య సినీరంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రభాస్, మహేష్ బాబు, పోసాని, ఆలీ మరికొందరితో వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి భేటీ అయ్యారు. ఆ సందర్భంగా జగన్ ఏదో చెబుతుంటే చిరంజీవి చేతులు కట్టుకుని విన్నారు. దాన్ని పవన్ ఎంత రాద్ధాంతంచేశారో గుర్తుండే ఉంటుంది. అప్పటికి చిరంజీవిని జగన్ చేతులు కట్టుకుని కూర్చోమని ఆదేశించినట్లుగా, వేరేదారిలేక చిరంజీవి చేతులు కట్టుకుని కూర్చున్నట్లుగా పవన్ నానా యాగీచేశారు.janasena pawankalyan tdp chandrababu jagan{#}ali reza;Telangana Chief Minister;Jagan;CBN;Industry;Chiranjeeviఅమరావతి : పవన్ ఎందుకు చేతులు కట్టుకున్నాడు ?అమరావతి : పవన్ ఎందుకు చేతులు కట్టుకున్నాడు ?janasena pawankalyan tdp chandrababu jagan{#}ali reza;Telangana Chief Minister;Jagan;CBN;Industry;ChiranjeeviWed, 03 May 2023 03:00:00 GMT



పై ఫొటోను జాగ్రత్తగా చూడండి. మూడురోజుల క్రితమే చంద్రబాబునాయుడు-పవన్ కల్యాణ్ భేటీకి సంబంధించిన ఫొటో. చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్ళారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఏదో చెబుతుంటే పవన్ శ్రద్ధగా, బుద్ధిగా వింటున్నారు. ఫోటోను బట్టి జనాలకు అర్ధమయ్యేదేమంటే చంద్రబాబు ముందు పవన్ చేతులు కట్టుకుని కూర్చుని వింటున్నారని. అంటే దానర్ధం చంద్రబాబు ముందు పవన్ చేతులు కట్టుకుని కూర్చోవాలనా ? అలా కూర్చుంటే చంద్రబాబుకు అహంకారమని అర్ధమా ?





ఇపుడిదంతా ఎందుకంటే ఆమధ్య సినీరంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రభాస్, మహేష్ బాబు, పోసాని, ఆలీ మరికొందరితో వెళ్ళి  జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి భేటీ అయ్యారు. ఆ సందర్భంగా జగన్ ఏదో చెబుతుంటే చిరంజీవి చేతులు కట్టుకుని విన్నారు. దాన్ని పవన్ ఎంత రాద్ధాంతంచేశారో గుర్తుండే ఉంటుంది. అప్పటికి చిరంజీవిని జగన్ చేతులు కట్టుకుని కూర్చోమని ఆదేశించినట్లుగా, వేరేదారిలేక చిరంజీవి చేతులు కట్టుకుని కూర్చున్నట్లుగా పవన్ నానా యాగీచేశారు.





ముఖ్యమంత్రి అవ్వాల్సిన వ్యక్తైన తన సోదరుడు చిరంజీవిని చేతులు కట్టుకుని జగన్ కూర్చోమంటాడా అంటు పదేపదే బహిరంగసభల్లో కూడా గోలచేశారు. తన సోదరుడిని జగన్ అవమానించాడంటు ఎంత సీన్ చేశారో అందరికీ గుర్తుండే ఉంటుంది.  జగన్ ముందు చిరంజీవి చేతులుకట్టుకోవటమే అవమానమైతే మరిపుడు చంద్రబాబు ముందు పవన్ చేసిందేమిటి ?





జగన్ అన్నా ముఖ్యమంత్రి కాబట్టి చిరంజీవి చేతులు కట్టుకుని కూర్చున్నారని అనుకుందాం. మరి చంద్రబాబు కేవలం ప్రధాన ప్రతిపక్ష నేత మాత్రమే కదా. చంద్రబాబు ముందు పవన్ ఎందుకని చేతులుకట్టుకుని కూర్చున్నారు ? ముఖ్యమంత్రితో సినీరంగం సమస్యలను చర్చించేందుకు చిరంజీవి వెళ్ళారు. మరి పవన్ ఏమి చర్చించేందుకు చంద్రబాబు దగ్గరకు వెళ్ళారు. వెళ్ళిన పవన్ చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన అవసరం ఏమిటి ? చిరంజీవి చేతులు కట్టుకుని కూర్చోవటాన్నే అవమానంగా భావించిన పవన్ ఇపుడు తాను చేసింది కూడా అదేకదా ? అంటే జగన్ ముందు చేతులుకట్టుకుని కూర్చుంటే అవమానం. అదే చంద్రబాబు ముందు కూర్చుంటే మాత్రం రాజసమా ?





RRR Telugu Movie Review Rating

పిల్లలు పుట్టని దంపతులకు హరీశ్‌రావు గుడ్‌న్యూస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>