EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pakistan87e9eb3f-32dd-4ee1-98b9-f9210e2023f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pakistan87e9eb3f-32dd-4ee1-98b9-f9210e2023f0-415x250-IndiaHerald.jpgపాకిస్థాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అమెరికా ఆదుకుంటే తప్ప పాకిస్థాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కోలుకునేలా లేదు. ఎఫ్ ఏ టీఎఫ్ నిబంధనలు తీసేయించండని అగ్రరాజ్యాన్ని పాక్ కోరుతుంది. అమెరికా పెద్ద మనసు చేసుకుని దాన్ని తొలగించేలా చేేసింది. కానీ ఐఎంఎప్ లోన్లు ఇంకా రాడం లేదు. ఇలా ప్రతి అంశంలో అమెరికాను చేయి చాచి అడుక్కుంటోంది. తిండికి లేక తిప్పలు పడుతూ.. పూర్తి ఆర్థిక పరమైన అప్పుల్లో కూరుకుపోయింది. ఇలాంటి సమయంలో అమెరికాలోని పాక్ దౌత్య కార్యాలయంలో ఉండే అధికారి మసూద్ ఖాన్ వాషింగ్టన్ డీసీలోని అమెరికా పPAKISTAN{#}Army;masood azhar;Pakistan;American Samoaఅప్పుల్లో కూరుకుపోయిన పాక్‌.. అమెరికాయే దిక్కు?అప్పుల్లో కూరుకుపోయిన పాక్‌.. అమెరికాయే దిక్కు?PAKISTAN{#}Army;masood azhar;Pakistan;American SamoaWed, 03 May 2023 10:00:00 GMTపాకిస్థాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అమెరికా ఆదుకుంటే తప్ప పాకిస్థాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కోలుకునేలా లేదు. ఎఫ్ ఏ టీఎఫ్ నిబంధనలు తీసేయించండని అగ్రరాజ్యాన్ని పాక్ కోరుతుంది. అమెరికా పెద్ద మనసు చేసుకుని దాన్ని తొలగించేలా చేేసింది. కానీ ఐఎంఎప్ లోన్లు ఇంకా రాడం లేదు. ఇలా ప్రతి అంశంలో అమెరికాను చేయి చాచి అడుక్కుంటోంది. తిండికి లేక తిప్పలు పడుతూ.. పూర్తి ఆర్థిక పరమైన అప్పుల్లో కూరుకుపోయింది.


ఇలాంటి సమయంలో అమెరికాలోని పాక్ దౌత్య కార్యాలయంలో ఉండే అధికారి మసూద్ ఖాన్ వాషింగ్టన్ డీసీలోని అమెరికా ప్రభుత్వాన్ని పాక్ సైన్యానికి నిధులు అందించి ఆదుకోవాలని కోరారు. గతంలో పాక్ సైన్యానికి ఎలాగైతే డబ్బులిచ్చి ఆదుకున్నారో అలాగే ప్రస్తుతం ఇవ్వాలని అభ్యర్థించారు. ఇలా ఎన్నో సంవత్సరాలు పాక్ సైన్యానికి అమెరికా నిధులు సమకూర్చి బలంగా ఉంచింది.


కానీ పాకిస్థాన్ సైనికాధికారులు విశ్వాసం చూపించకుండా ఆ నిధులను అప్గాన్ లో ఉన్న తాలిబాన్ల కోసం ఖర్చు చేసినట్లు అమెరికా దర్యాప్తులో తేలింది. పాక్ లోని సైనికాధికారులు అమెరికా ఇచ్చిన నిధులను సైనిక సంక్షేమం కోసం కాకుండా సొంతంగా డబ్బుులు సంపాదించుకున్నారు. సొంతంగా బంగ్లాలు కొనుక్కున్నారు. ఆస్తులు కూడబెట్టుకున్నారు. కానీ సైన్యం బాగోగులు మాత్రం చూసుకోలేదు. దీనికి తోడు తాలిబాన్లకు ఈ నిధుల నుంచి సాయం అందించినట్లు అమెరికా గుర్తించింది.  దీంతో అమెరికా పాక్ సైన్యానికి నిధులు ఇవ్వడం ఆపేసింది.


ఇలా నిధులు రాకపోవడంతో పాక్ ఇప్పుడు తీవ్ర ఇక్కట్లు పడుతోంది. ఇప్పుడు అమెరికా నిధులు ఇస్తేనే పాక్ సైన్యం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతుంది. మరి పాకిస్థాన్ కు ఇప్పటికే అమెరికా అన్ని విషయాల్లో సాయం చేస్తూనే ఉంది. కానీ పాక్ దాన్ని నిలబెట్టుకోలేదు. ఇలాంటి విపత్కర సమయంలో అమెరికా ఏ విధంగా స్పందిస్తుంది. మళ్లీ పాకిస్థాన్ సైన్యాన్ని బలంగా చేయడానికి తోడ్పడుతుందా లేదా చూడాలి.





RRR Telugu Movie Review Rating

అల్లు అర్జున్ తెలిసి తెలిసి తప్పు చేస్తున్నారా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>