Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-2c41b1b5-3648-4b21-a2d6-d448c6efb2b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-2c41b1b5-3648-4b21-a2d6-d448c6efb2b2-415x250-IndiaHerald.jpgఈ ఏడాది రెండు ప్రతిష్టాత్మకమైన మెగా టోర్నీలు జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ లభించబోతుంది అని చెప్పాలి. అయితే ఈ మెగా టోర్నీ విషయంలో ఎప్పుడు ఏం జరగబోతుంది అన్నది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే ఇతర దేశాల్లో ఈ మెగా టోర్నీలు జరిగి ఉంటే ప్రాబ్లం ఉండేది కాదేమో.. కానీ క్రికెట్ నిషేధం కొనసాగుతున్న పాకిస్తాన్ లో ఆసియా కప్, భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. దీంతో ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని బీసCricket {#}BCCI;World Cup;Pakistan;India;Cricketఏంటి.. ఆసియా కప్ రద్దుకానుందా?ఏంటి.. ఆసియా కప్ రద్దుకానుందా?Cricket {#}BCCI;World Cup;Pakistan;India;CricketTue, 02 May 2023 12:00:00 GMTఈ ఏడాది  రెండు ప్రతిష్టాత్మకమైన మెగా టోర్నీలు జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ లభించబోతుంది అని చెప్పాలి.  అయితే ఈ మెగా టోర్నీ విషయంలో ఎప్పుడు ఏం జరగబోతుంది అన్నది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే ఇతర దేశాల్లో ఈ మెగా టోర్నీలు జరిగి ఉంటే ప్రాబ్లం ఉండేది కాదేమో.. కానీ క్రికెట్ నిషేధం కొనసాగుతున్న పాకిస్తాన్ లో ఆసియా కప్, భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది.


 దీంతో ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని బీసీసీఐ.. అలా చేస్తే  తాము కూడా వన్డే వరల్డ్ కప్ లో ఆడబోము అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెబుతుంది. దీంతో ఇక ఈ రెండు టోర్నిలలో ఈ రెండు జట్లను ఆడించేందుకు అటు ఐసీసీకి పెద్ద తలనొప్పిగా మారింది అని చెప్పాలి. అయితే భారత్ ఆడే మ్యాచ్లను పాకిస్తాన్లో కాకుండా యూఏఈ వేదికగా నిర్వహించాలని ఇప్పటికే చర్చలు జరిపింది ఐసిసి. కానీ ఈ చర్చలు ఫలించలేదు అన్నది మాత్రం తెలుస్తుంది.


 ఎందుకంటే పాకిస్తాన్ వేదికగా జరిగే ఆసియా కప్ లో ఆడేందుకు భారత ప్లేయర్లను పంపించేందుకు బీసీసీఐ ఒప్పుకోవట్లేదు. అయితే టీమిండియా ఆడే మ్యాచ్ లను  ఇతర వేదికలలో నిర్వహించేందుకు హైబ్రిడ్ మోడల్ ను తీసుకురాగా.. దీనిని కూడా అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి వ్యతిరేకించింది అన్నది తెలుస్తుంది. దీంతో ఆసియా కప్ జరుగుతుందా లేదా అనేదానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆసియా కప్ ను రద్దుచేసి ఇక ఐదు దేశాలతో ఒక ప్రత్యేకమైన టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది. అయితే ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా ఉన్న బీసీసీఐ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ను శాసిస్తుంది. దీంతో బీసీసీఐ ఏమనుకుంటే అది జరుగుతుంది అనడంలో సందేహం లేదు.



RRR Telugu Movie Review Rating

స్కర్ట్ వేసుకుని వచ్చి.. మెట్రోలో యువతి పిచ్చి చేష్టలు?

యుద్ధం: రష్యా ముందు నాటో పప్పులు ఉడకట్లేదా?

ఇలా జరిగితే.. తెలంగాణలో బీజేపీ సర్కారు సాధ్యమే?

ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆ దేశాల రహస్య ఆపరేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>