EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/china9ecb7105-858b-4395-b5b1-c8e60c62f095-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/china9ecb7105-858b-4395-b5b1-c8e60c62f095-415x250-IndiaHerald.jpgచైనా రోజు రోజుకు సరికొత్త సమస్యలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చైనా ప్రస్తుతం శాటిలైట్లను హైజక్ చేసే సరికొత్త టెక్నాలజీని కనిపెట్టినట్లు తెలుస్తోంది. శాటిలైట్ల ద్వారా విదేశాలు చేస్తున్న ప్రతి పనిని గమనిస్తుంది. ఎవరైతే తమ దేశంపై దాడి చేయాలని ప్రయత్నిస్తారో.. లేక తమ దేశం గురించి ఎలా ఆలోచిస్తున్నారో అనే విషయాలను పసి గడుతోంది. దీని కోసం ప్రత్యేకమైన శాటిలైట్ విధానాన్ని కనుక్కొన్నట్లు అమెరికాలోకి సీఐఏ సంస్థ తెలిపింది. ఒక వేళ తైవాన్ తో చైనా గనక యుద్దం చేయాల్సి వస్తే శాటిలైట్ విధానంతో ఇతరCHINA{#}American Samoaచైనా చేతిలో కొత్త టెక్నాలజీ.. అమెరికాకు వణుకు?చైనా చేతిలో కొత్త టెక్నాలజీ.. అమెరికాకు వణుకు?CHINA{#}American SamoaTue, 02 May 2023 11:00:00 GMTచైనా రోజు రోజుకు సరికొత్త సమస్యలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చైనా ప్రస్తుతం శాటిలైట్లను హైజక్ చేసే సరికొత్త టెక్నాలజీని కనిపెట్టినట్లు తెలుస్తోంది. శాటిలైట్ల ద్వారా విదేశాలు చేస్తున్న ప్రతి పనిని గమనిస్తుంది. ఎవరైతే తమ దేశంపై దాడి చేయాలని ప్రయత్నిస్తారో.. లేక తమ దేశం గురించి ఎలా ఆలోచిస్తున్నారో అనే విషయాలను పసి గడుతోంది. దీని కోసం ప్రత్యేకమైన శాటిలైట్ విధానాన్ని కనుక్కొన్నట్లు అమెరికాలోకి సీఐఏ సంస్థ తెలిపింది.


ఒక వేళ తైవాన్ తో చైనా గనక యుద్దం చేయాల్సి వస్తే శాటిలైట్ విధానంతో ఇతర దేశాల ఆయుధ సామగ్రిని ధ్వంసం చేయడం పనిగా పెట్టుకుంది. ప్రస్తుతం అమెరికా, పిలిఫ్పీన్స్ దేశం కలిసి సంయుక్తంగా సైనిక విన్యాసాలను ఫిలిప్పిన్స్ దేశ సరిహద్దులో చేస్తున్నాయి. అయితే ఇది చైనా దేశపు ఐ ల్యాండ్ కు సమీపంలో ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని చైనా నిశితంగా గమనిస్తూనే ఉంది.


ఇదే సమయంలో షా డాంగ్ అనే యుద్ధ నౌకను ఆ తీరానికి పంపినట్లు తెలుస్తోంది. అంటే ఇక్కడ చేస్తున్న విన్యాసాల గురించి శాటిలైట్ రాడార్ల ద్వారా తెలుసుకుని ఇక్కడకు వచ్చినట్లు అమెరికా ఆరోపిస్తుంది. రాబోయే కాలంలో ప్రతి దేశం శాటిలైట్ ను దెబ్బతీసే విధానం చైనా తన దగ్గర ఉంచుకుని అంతరిక్షం నుంచి ఆయా దేశాలకు వచ్చే సందేశాలను నిలిపివేయగల శక్తిని సంపాదించుకుందని అమెరికా ఆరోపిస్తుంది.


ఇప్పటికే ఆర్టిపిషీయల్ ఇంటిలిజెన్స్, ఇతర రోబో సామర్థ్యం కలిగిన నైపుణ్యాలను విరివిరిగా ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి బలం చేకూర్చే విధంగా శాటిలైట్ వ్యవస్థను దెబ్బతీసే నైపుణ్యం చైనా దగ్గర ఉన్నట్లు అమెరికా గ్రహించింది. మొన్నటికి మొన్న చైనా  సముద్ర జలాల్లో నుంచి వెళుతున్నాయని ఇతర దేశాల విమానాలకు మధ్యలోనే సిగ్నల్స్ ను కట్ చేసినట్లు చైనా పై ఆరోపణలు వచ్చాయి. ఇలా ప్రతి విషయంలో చైనా కొరకరాని కొయ్యగా మారుతోంది.



RRR Telugu Movie Review Rating

అలాంటి సినిమాలకు పునాది వేసిన తెలుగు స్టార్ హీరో.....!!

యుద్ధం: రష్యా ముందు నాటో పప్పులు ఉడకట్లేదా?

ఇలా జరిగితే.. తెలంగాణలో బీజేపీ సర్కారు సాధ్యమే?

ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆ దేశాల రహస్య ఆపరేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>