Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/liveee6516d4-a5e9-4227-8d72-e865885ac0fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/liveee6516d4-a5e9-4227-8d72-e865885ac0fe-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రతి మనిషి కూడా ఆధునిక జీవన శైలికి తగ్గట్లుగానే తమ అలవాట్లు సాంప్రదాయాలను మార్చుకుంటున్నాడు. దీంతో మూఢనమ్మకాలను నమ్ముతున్న వారు ఎక్కువగా కనిపించడం లేదు. అయితే మూఢనమ్మకాలు అన్నిటినీ వదిలేసిన మనిషి అటు దయ్యం, భూతం ఉంది అన్న నమ్మకాన్ని మాత్రం అస్సలు వదిలేయడం లేదు. ఇప్పటికి కూడా దయ్యం పేరెత్తితే చాలు ఎంతోమంది జనాలు భయపడిపోతూ ఉంటారు. అయితే ఇక ఊర్లో ఉండే స్మశాన వాటికను పగటిపూట చూస్తేనే భయపడతారు. అలాంటిది రాత్రిపూట స్మశాన వాటికవైపు వెళ్లడానికి ఎవరూ సాహసం చేయరు. అయితే ఒకవేళ స్మశాన వాటిక Live{#}Police Station;cemetery;Hyderabad;Girl;Newsఅర్ధరాత్రి స్మశానంలో అమ్మాయి ఏడుపు.. ఏంటా అని వెళ్లి చూస్తే షాక్?అర్ధరాత్రి స్మశానంలో అమ్మాయి ఏడుపు.. ఏంటా అని వెళ్లి చూస్తే షాక్?Live{#}Police Station;cemetery;Hyderabad;Girl;NewsTue, 02 May 2023 11:15:00 GMTప్రస్తుతం ప్రతి మనిషి కూడా ఆధునిక జీవన శైలికి తగ్గట్లు గానే తమ అలవాట్లు సాంప్రదాయాలను మార్చుకుంటున్నాడు. దీంతో మూఢ నమ్మకాలను నమ్ముతున్న వారు ఎక్కువగా కనిపించడం లేదు. అయితే మూఢ నమ్మకాలు అన్నిటినీ వదిలేసిన మనిషి అటు దయ్యం, భూతం ఉంది అన్న నమ్మకాన్ని మాత్రం అస్సలు వదిలేయడం లేదు. ఇప్పటికి కూడా దయ్యం  పేరెత్తితే చాలు  ఎంతో మంది జనాలు భయపడి పోతూ ఉంటారు. అయితే ఇక ఊర్లో ఉండే స్మశాన వాటికను పగటిపూట చూస్తేనే భయ పడతారు. అలాంటిది రాత్రిపూట స్మశాన వాటికవైపు వెళ్లడానికి ఎవరూ సాహసం చేయరు.


 అయితే ఒకవేళ స్మశాన వాటిక నుంచి ఎవరో ఏడుస్తున్నట్లుగా శబ్దాలు వినిపిస్తే ఇంకేముంది ప్రాణాలు గాల్లో కలిసి పోయినంత పని అవుతూ ఉంటుంది. ఇక్కడ కొంత మందికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఊరికి దగ్గరలో ఉన్న స్మశాన వాటిక లో ఎవరో అమ్మాయి గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. దీంతో దయ్యం అనుకుని  ఒక్కసారిగా జడుసుకున్నారు స్థానికులు. కానీ కాస్త ధైర్యం చేసి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అని తెలుసుకోవడానికి స్మశానం లోకి వెళ్లారు.


 కానీ అక్కడ జరుగుతున్న సీన్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏకంగా స్మశానం లో ఒక అమ్మాయి ఒకచోట కూర్చొని గట్టిగా ఏడుస్తుంది. ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట స్మశాన వాటికలో జరిగింది. తాను ప్రేమించిన అబ్బాయి వదిలేసాడని అతను లేని జీవితాన్ని ఊహించుకోలేను అంటూ అర్ధరాత్రి సమయంలో స్మశానంలో వీరంగం సృష్టించింది యువతి. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఏడుస్తూ హల్చల్ చేస్తుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక వారు ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి  ఇక యువతిని వారికి అప్పగించినట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

అలాంటి సినిమాలకు పునాది వేసిన తెలుగు స్టార్ హీరో.....!!

యుద్ధం: రష్యా ముందు నాటో పప్పులు ఉడకట్లేదా?

ఇలా జరిగితే.. తెలంగాణలో బీజేపీ సర్కారు సాధ్యమే?

ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆ దేశాల రహస్య ఆపరేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>