Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya4dc054d9-52f6-4a6c-ad86-36d9a915fb00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya4dc054d9-52f6-4a6c-ad86-36d9a915fb00-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ యాంకర్ అనసూయ ఆ షోకి గుడ్ బై చెప్పి పూర్తిగా సిల్వర్ స్క్రీన్ మీదనే దృష్టి పెట్టింది. అయితే అమ్మడు ఊహించినట్టుగానే వరుస అవకాశాలు వస్తున్నాయి. రెగ్యులర్ పాత్రలతో కాకుండా రంగమ్మత్త, దాక్షాయణి ఇలా స్పెషల్ రోల్స్ తో ఆడియన్స్ ని మెప్పిస్తుంది అనసూయ. అనసూయ సినిమాలో ఉంది అంటే ఆమెని కొత్తగా చూడొచ్చు అన్న విధంగా క్రేజ్ తెచ్చుకుంది.Anasuya{#}anasuya bharadwaj;Kshanam;Santhossh Jagarlapudi;Anasuya;silver screen;kiran;Jabardasth;Audience;Cinemaఅనసూయ మరో ఐకానిక్ రోల్..!అనసూయ మరో ఐకానిక్ రోల్..!Anasuya{#}anasuya bharadwaj;Kshanam;Santhossh Jagarlapudi;Anasuya;silver screen;kiran;Jabardasth;Audience;CinemaTue, 02 May 2023 07:32:00 GMTజబర్దస్త్ యాంకర్ అనసూయ ఆ షోకి గుడ్ బై చెప్పి పూర్తిగా సిల్వర్ స్క్రీన్ మీదనే దృష్టి పెట్టింది. అయితే అమ్మడు ఊహించినట్టుగానే వరుస అవకాశాలు వస్తున్నాయి. రెగ్యులర్ పాత్రలతో కాకుండా రంగమ్మత్త, దాక్షాయణి ఇలా స్పెషల్ రోల్స్ తో ఆడియన్స్ ని మెప్పిస్తుంది అనసూయ. అనసూయ సినిమాలో ఉంది అంటే ఆమెని కొత్తగా చూడొచ్చు అన్న విధంగా క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇచ్చిన పాత్రకు అమ్మడు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుంది. పుష్ప 2లో కూడా అనసూయ రోల్ చాలా టిపికల్ గా ఉంటుందని తెలుస్తుంది.

ఇక లేటెస్ట్ గా అనసూయ సముద్రఖని నటిస్తున్న విమానం సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. సినిమా నుంచి అనసూయ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఒక గోడ మీద క్యాజువల్ గా కూర్చున్నట్టుగా అనసూయ పోస్టర్ వదిలారు. అయితే ఈ పాత్ర గురించి చెబుతూ తన కెరీర్ లో మరో పవర్ ఫుల్ రోల్ అని చెప్పుకొచ్చింది. అనసూయ అంతగా చెబుతుంది అంటే విమానంలో ఆమె పాత్ర హైలెట్ గా ఉంటుందని చెప్పొచ్చు. అనసూయ ఈ తరహా పాత్రలకు పెట్టింది పేరు. జస్ట్ ఏదో సినిమాలో కనిపించామా అన్నట్టు కాకుండా తన పాత్ర ఐడెంటిటీ ఉండేలా చేసుకుంటుంది.

అందుకే క్షణం సినిమా నుంచి విమానం వరకు ఐకానిక్ రోల్స్ ని ఆమె సెలెక్ట్ చేసుకుంటుంది. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక దాదాపు బుల్లితెరకు దూరమైన అనసూయ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. మళ్లీ ఆమెని స్మాల్ స్క్రీన్ పై చూడాలని అక్కడ ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే సినిమాల గ్యాప్ లో షోలు చేసుకోవాలని ఉన్నా తగిన ఛాన్స్ రావాలి కదా అంటుంది అనసూయ. ఏది ఏమైనా అనసూయ విమానం సినిమాలో నటించడం ఆ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. విమానం సినిమాను సంతోష్ డైరెక్ట్ చేస్తుండగా కిరణ్ కొర్రపాటి జీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నారు.





RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబు, పవన్ అనుకుంటే వైసీపీ ఓడిపోతుందా ?

యుద్ధం: రష్యా ముందు నాటో పప్పులు ఉడకట్లేదా?

ఇలా జరిగితే.. తెలంగాణలో బీజేపీ సర్కారు సాధ్యమే?

ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆ దేశాల రహస్య ఆపరేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>