Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-5c83abee-fa63-4e0b-846f-64eb56922811-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-5c83abee-fa63-4e0b-846f-64eb56922811-415x250-IndiaHerald.jpgప్రముఖ నటులలో ఒకరైన జాయెద్ ఖాన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫరా ఖాన్ అందరి ముందే తిట్టి నన్ను అవమానించిందని నాపై చెప్పులు కూడా విసిరిందని ఆయన అన్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జాయెద్ ఖాన్ ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం. మై హూనా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఇప్పటి స్థాయిలో టెక్నాలజీ లేదని మూవీ షూట్ సమయంలో ఎక్కువ టేకులు తీసుకోవడం కూడా తప్పేనని ఆయన కామెంటSocialstars lifestyle {#}Farah Khan;Zayed khan;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Apple;News;Cinemaఫరా ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ జావెద్ ఖాన్....!!ఫరా ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ జావెద్ ఖాన్....!!Socialstars lifestyle {#}Farah Khan;Zayed khan;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Apple;News;CinemaTue, 02 May 2023 12:03:02 GMTప్రముఖ నటులలో ఒకరైన జాయెద్ ఖాన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఫరా ఖాన్ అందరి ముందే తిట్టి నన్ను అవమానించిందని నాపై చెప్పులు కూడా విసిరిందని ఆయన అన్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జాయెద్ ఖాన్ ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం. మై హూనా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో ఇప్పటి స్థాయిలో టెక్నాలజీ లేదని మూవీ షూట్ సమయంలో ఎక్కువ టేకులు తీసుకోవడం కూడా తప్పేనని ఆయన కామెంట్లు చేశారు. సెట్ లో అందరూ క్రమశిక్షణలో మెలగాలని ఆయన వెల్లడించారు. ఒక సన్నివేశంలో భాగంగా కెమెరా నా వైపుకు వచ్చిన సమయంలో వెనుక ఉన్న కొరియోగ్రాఫర్ ఒకరు ఫిట్స్ తో పడిపోయారని జాయేద్ ఖాన్ అన్నారు. అతను పడిపోతే డ్యాన్స్ చేయడం నచ్చక కట్ అన్నానని ఆయన తెలిపారు.

ఆ సమయంలో ఫరాకు పట్టరాని స్థాయి లో కోపం వచ్చి నానా మాటలు అనడంతో పాటు నాపై చెప్పులు విసిరిందని జాయేద్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే డ్యాన్స్ చేయమని ఎలా అడుగుతారని ప్రశ్నించానని జాయేద్ ఖాన్ వెల్లడించారు. నా సెట్ లో కట్ చెప్పడానికి నువ్వెవరు అని ఆమె నాపై అరిచిందని జాయేద్ ఖాన్ కామెంట్లు చేశారు.

ఆ సమయంలో అక్కడున్న వాళ్లకు పరిస్థితి అర్థమై పడిపోయిన వ్యక్తిని కాపాడారని జాయేద్ ఖాన్ వెల్లడించారు. చౌరా లియా హై తుమ్నే సినిమాతో సినిమాతో జాయేద్ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. గత కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్న ఈ నటుడు దట్ నెవర్ వాస్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడానికి ఈ నటుడు సిద్ధమవుతున్నారని సమాచారం అందుతోంది.



RRR Telugu Movie Review Rating

స్కర్ట్ వేసుకుని వచ్చి.. మెట్రోలో యువతి పిచ్చి చేష్టలు?

యుద్ధం: రష్యా ముందు నాటో పప్పులు ఉడకట్లేదా?

ఇలా జరిగితే.. తెలంగాణలో బీజేపీ సర్కారు సాధ్యమే?

ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆ దేశాల రహస్య ఆపరేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>