PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rajanikanth-chandrababu-pawan-modi288401ce-91a7-4ea2-9df4-0e4a82618b0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rajanikanth-chandrababu-pawan-modi288401ce-91a7-4ea2-9df4-0e4a82618b0a-415x250-IndiaHerald.jpgఎలాగైనా సరే బీజేపీతో మళ్ళీ పొత్తు పెట్టుకోవాన్నది చంద్రబాబు ప్రయత్నం. అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నిజస్వరూపం తెలిసిన నరేంద్రమోడీ ఏమాత్రం అవకాశం ఇవ్వటంలేదు. రేపటి ఎన్నికలకు ముందు ఏమి నిర్ణయం తీసుకుంటారో తెలీదుకానీ ఇప్పటికైతే చంద్రబాబు గురించి ఆలోచించటానికి కూడా మోడీ ఇష్టపడటంలేదన్నది వాస్తవం. మోడీ లేదా కనీసం అమిత్ షా అపాయిట్మెంట్ కోసం చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేసి భంగపడ్డారు. అందుకనే పవన్ను రంగంలోకి దింపారు. rajanikanth chandrababu pawan modi{#}CBN;Amit Shah;Andhra Pradesh;Narendra Modi;Amith Shah;Janasena;Curry leaves;Pawan Kalyan;Industry;NTRఅమరావతి : పవన్ కు చంద్రబాబు షాకిచ్చారా ?అమరావతి : పవన్ కు చంద్రబాబు షాకిచ్చారా ?rajanikanth chandrababu pawan modi{#}CBN;Amit Shah;Andhra Pradesh;Narendra Modi;Amith Shah;Janasena;Curry leaves;Pawan Kalyan;Industry;NTRTue, 02 May 2023 03:00:00 GMT


చంద్రబాబునాయుడు వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎవరితో పనవుతుందని అనుకుంటే వాళ్ళతో రాసుకుపూసుకు తిరగటం, పనయ్యేంతవరకు వాళ్ళతో చాలా ఆత్మీయంగా మెలగటం చంద్రబాబుకు బాగా అలవాటు. అఫ్ కోర్స్ పనైపోగానే ఎంతటి వాళ్ళనయినా కరివేపాకు లాగ తీసేయటం కూడా చంద్రబాబు లక్షణమే అనుకోండి. ఇపుడు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్  వ్యవహారం అలాగే తయారైనట్లుంది.





ఎలాగైనా సరే బీజేపీతో మళ్ళీ పొత్తు పెట్టుకోవాన్నది చంద్రబాబు ప్రయత్నం. అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నిజస్వరూపం తెలిసిన నరేంద్రమోడీ ఏమాత్రం అవకాశం ఇవ్వటంలేదు. రేపటి ఎన్నికలకు ముందు ఏమి నిర్ణయం తీసుకుంటారో తెలీదుకానీ ఇప్పటికైతే చంద్రబాబు గురించి ఆలోచించటానికి కూడా మోడీ ఇష్టపడటంలేదన్నది వాస్తవం. మోడీ లేదా కనీసం అమిత్ షా అపాయిట్మెంట్ కోసం చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేసి భంగపడ్డారు. అందుకనే పవన్ను రంగంలోకి దింపారు.





అయితే ఈ విషయంలో పవన్ కూడా ఫెయిలయ్యారు. మోడీ కాదు కదా అమిత్ షానే పవన్ కు అపాయిట్మెంట్ ఇవ్వటంలేదు. దాంతో వాళ్ళదగ్గర పవన్ వెయిట్ సరిపోదని చంద్రబాబుకు అర్ధమైపోయింది. అందుకనే వ్యూహాత్మకంగా రజనీకాంత్ ను ప్రయోగించాలని డిసైడ్ అయినట్లున్నారు. ఇందులో భాగంగానే ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాలకు రజనీని ముఖ్యఅతిధిగా పిలిపించారు. సరే ఇపుడు విషయం ఏమిటంటే మోడీ, అమిత్ తో రజనీకి మంచి సంబంధాలే ఉన్నాయి.





అందుకనే తన ఆలోచనను రజనీ ద్వారా చెప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారనే ప్రచారం పెరిగిపోతోంది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే రజనీ ప్రభావం తమిళనాడులోనే జీరో. అలాంటిది ఏపీ విషయాల్లో రజనీ చెప్పిన మాటలను మోడీ, అమిత్ ఎందుకు వింటారు ? పైగా ఏపీలో రజనీ ప్రభావం దాదాపు నిల్లనే చెప్పాలి. అలాంటిది రజనీ చెప్పారని చంద్రబాబుతో పొత్తుకు రెడీ అయితే జరగబోయేదేమిటో మోడీకి తెలీదా ? గతానుభవాలను మోడీ అంత తేలిగ్గా మరచిపోయేరకం కాదని అందరికీ తెలిసిందే. ఏదేమైనా ఎదుటివాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు తన ప్రయత్నాలను తాను చేసుకోవటమే చంద్రబాబుకు ముఖ్యం. కాబట్టి పవన్ను పక్కనపెట్టారనే అనుకుంటున్నారు.






RRR Telugu Movie Review Rating

అమరావతి : పవన్ కు చంద్రబాబు షాకిచ్చారా ?

యుద్ధం: రష్యా ముందు నాటో పప్పులు ఉడకట్లేదా?

ఇలా జరిగితే.. తెలంగాణలో బీజేపీ సర్కారు సాధ్యమే?

ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆ దేశాల రహస్య ఆపరేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>