EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tdp6803f621-5312-4a5f-af17-0c42ab2815b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tdp6803f621-5312-4a5f-af17-0c42ab2815b2-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్, బైపోల్స్ ఇలా ప్రతి ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. దీంతో రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని అనుకున్నారు. టీడీపీ కార్యకర్తల్లో కూడా నైరాశ్యం అలుముకుంది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ గ్యాడ్యుయేట్ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించింది. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచి సంచలనం సృష్టించింది. దీని వల్ల టీడీపీ శ్రేణులకు కొత్త ఉత్సహం వచ్చింది. దీంతో టీడీపీTDP{#}Nara Lokesh;Survey;Dookudu;Party;local language;Telugu Desam Party;Elections;TDP;MP;YCP;CBN;media;Nijam;Yuvaఏపీ: ఆ సర్వేతో నీరసపడిపోయిన టీడీపీ?ఏపీ: ఆ సర్వేతో నీరసపడిపోయిన టీడీపీ?TDP{#}Nara Lokesh;Survey;Dookudu;Party;local language;Telugu Desam Party;Elections;TDP;MP;YCP;CBN;media;Nijam;YuvaSun, 30 Apr 2023 09:00:00 GMTతెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్, బైపోల్స్ ఇలా ప్రతి ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. దీంతో రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని అనుకున్నారు. టీడీపీ కార్యకర్తల్లో కూడా నైరాశ్యం అలుముకుంది.


మొన్న జరిగిన ఎమ్మెల్సీ గ్యాడ్యుయేట్ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించింది. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచి సంచలనం సృష్టించింది. దీని వల్ల టీడీపీ శ్రేణులకు కొత్త ఉత్సహం వచ్చింది. దీంతో టీడీపీ లో యువ నాయకుడు లోకేశ్ చేస్తున్న పాదయాత్రకు ఊపు వచ్చింది. చంద్రబాబు పెడుతున్న సభలకు కూడా ఎక్కువ సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


ఒక్కసారిగా టీడీపీకి ఊపు వచ్చిన సమయంలో జాతీయ మీడియా టైమ్స్ నౌ ఒక సర్వే విడుదల చేసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలకు 24 వరకు వైసీపీ గెలుస్తుందని కేంద్రంలో మంచి పాత్ర పోషిస్తుందని చెప్పింది. ఇది తెలుగుదేశం పార్టీకి షాక్ లాంటిదే. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న సమయంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని అనుకుంటుంటే ఈ సర్వే మింగుడు పడని విషయంలా మారింది.


ఇలాంటి సర్వే లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో లోకల్ లో ఉండే పార్టీ నాయకులకు తెలుస్తాయి. కానీ ఎక్కడో జాతీయ మీడియా సర్వే చేస్తే అది నిజం అయిపోతుందా అని టీడీపీ కార్యకర్తలకు ధైర్యం చెబుతోంది. గెలిచింది గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి టీడీపీ కూడా కాస్త ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పునశ్చరణ చేసుకుని మహిళలు, వృద్ధులు, అన్ని వర్గాల ఓట్లు సాధించాలంటే ఏం చేయాలి. ఎలా ముందుకు సాగాలనే ప్రణాళికతో వెళితేనే టీడీపీ గెలుపు సాధ్యం.



RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబు ముందు రజనీకాంత్ పనికొస్తారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>