MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/agentb18de8df-20ad-4581-93d2-471bd50c17f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/agentb18de8df-20ad-4581-93d2-471bd50c17f0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఏజెంట్' భారీ అంచనాల నడుమ నిన్న (అనగా ఏప్రిల్ 28న) థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. ముఖ్యంగా మొదటి షో నుంచే ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. సుమారు 80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ టాక్ మాత్రం నెగిటివ్ గా వచ్చింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు,అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం అఖిల్ పడ్Agent{#}Chitram;Chiranjeevi;Sony;Reddy;akhil akkineni;Director;Cinema'ఏజెంట్' ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?'ఏజెంట్' ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?Agent{#}Chitram;Chiranjeevi;Sony;Reddy;akhil akkineni;Director;CinemaSat, 29 Apr 2023 14:04:09 GMTటాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఏజెంట్' భారీ అంచనాల నడుమ నిన్న (అనగా ఏప్రిల్ 28న) థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. ముఖ్యంగా మొదటి షో నుంచే ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. సుమారు 80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ టాక్ మాత్రం నెగిటివ్ గా వచ్చింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు,అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం అఖిల్ పడ్డ కష్టమంతా వృధా అయ్యిందని చెబుతున్నారు. 

చాలాకాలంగా హిట్ లేని అఖిల్ ఈసారి ఎలాగైనా సాలిడ్ హెడ్ కొట్టాలనే కసితో ఏజెంట్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని చేసాడు. ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించడం కోసం చాలా కష్టపడ్డాడు. కానీ సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో కనిపించాడు. ప్రస్తుతం థియేటర్లో మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై ఆసక్తికర అప్డేట్ ఫిలిం సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతోంది.ఏజెంట్ మూవీ విడుదలైన నెలలోపే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే మే చివరి వారంలో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్ ఏజెంట్ ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. మే నెల ఆఖరిలో సోనీ లీవ్ లో ఏజెంట్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. వీలైతే అంతకంటే ముందే మే మూడో వారంలోని ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఈమధ్య చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా థియేటర్లో ఆడకపోతే వెంటనే ఓటీటీ రిలీజ్ చేసేస్తున్నారు. ఇప్పటికే అలా చాలా సినిమాలు రిలీజ్ అయి నెలరోజులు కూడా కాకుండానే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏజెంట్ కూడా నెలరోజుల లోపే సోనీ లీవ్ ఓటీటీ ప్లాట్ ఫాం లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం...!!



RRR Telugu Movie Review Rating

ఆడిషన్ ఇవ్వడానికి వచ్చి పారిపోయిన రాశిఖన్నా.. ఏ సినిమాకంటే..?

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>