EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababufcadaf67-4147-4031-aa2e-773af2a3586a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababufcadaf67-4147-4031-aa2e-773af2a3586a-415x250-IndiaHerald.jpgదివంగత కోడెల శివప్రసాద్ రెడ్డి ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి. ఆయన ఎన్నడూ పార్టీని వదిలి ఉండలేదు ఆయన కెరీర్లో. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ నుండి బయటకు రాగానే చంద్రబాబు నాయుడు లాయల్టీ ఇచ్చినటువంటి వ్యక్తి. సుదీర్ఘ కాలం పాటు గెలవడం మంత్రిగా కూడా చేయడం, కానీ అక్కడ వరుసగా ఓటమి పాలు అవడంతో ఆయనను తీసుకెళ్లి సత్తెనపల్లి సీటు ఇచ్చారు చంద్రబాబు. అక్కడ గెలిచాక స్పీకర్ ఇచ్చారు. ఆయన మంత్రి కావాలని చివరి వరకు అభిలషించారు. ఆయనకు అవకాశం రాక ముందే స్పీకర్ పదవి మాత్రమే కాదు, తెలుగుదేశCHANDRABABU{#}CBN;Telugu Desam Party;Kodela Siva Prasada Rao;Kanna Lakshminarayana;Minister;Sattenapalle;Yevaru;Father;NTRమరణం తర్వాత: కోడెలకు బాబు వెన్నుపోటు?మరణం తర్వాత: కోడెలకు బాబు వెన్నుపోటు?CHANDRABABU{#}CBN;Telugu Desam Party;Kodela Siva Prasada Rao;Kanna Lakshminarayana;Minister;Sattenapalle;Yevaru;Father;NTRSat, 29 Apr 2023 23:00:00 GMTదివంగత కోడెల శివప్రసాద్ రెడ్డి ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి. ఆయన ఎన్నడూ పార్టీని వదిలి ఉండలేదు ఆయన కెరీర్లో. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ నుండి బయటకు రాగానే చంద్రబాబు నాయుడు  లాయల్టీ ఇచ్చినటువంటి వ్యక్తి. సుదీర్ఘ కాలం పాటు గెలవడం మంత్రిగా కూడా చేయడం, కానీ అక్కడ వరుసగా ఓటమి పాలు అవడంతో ఆయనను తీసుకెళ్లి సత్తెనపల్లి సీటు ఇచ్చారు చంద్రబాబు. అక్కడ గెలిచాక స్పీకర్ ఇచ్చారు. ఆయన మంత్రి కావాలని చివరి వరకు అభిలషించారు. ఆయనకు అవకాశం రాక ముందే స్పీకర్ పదవి మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ కూడా దిగిపోయింది.


ఆయనపై అప్పుడు విమర్శలు వచ్చాయి ఆ తర్వాత ఆయన ఆత్మహత్య  చేసుకోవడం జరిగింది. దానికి కుటుంబ కలహాలే కారణం అనే మాట ఎక్కువగా వినిపించింది. ఏమైందో తెలియదు. ఆ తర్వాత ఆయన కొడుకు కోడెల శివరాంని దగ్గర తీసుకుని సంఘీభావాన్ని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పుడు ఆ సత్తెనపల్లి ని కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరాంకు ఇవ్వడం లేదని కన్నా లక్ష్మీనారాయణకి ఇవ్వబోతున్నారని వార్త ప్రచారంలోకి వచ్చింది.


దానికి ఊతమిస్తూ మొన్న కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి వెళ్లడం, అక్కడ జరిగిన సమావేశంలో కోడెల శివప్రసాద్ ఫోటో కూడా పెట్టకుండానే సమావేశం  ముగియడం జరిగింది. ఈ సంఘటనపై ఆయన కొడుకు కోడెల శివరాం ఆగ్రహాన్ని, ఆవేదనని వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. కోడెల శివప్రసాద్ కుటుంబాన్ని విస్మరిస్తున్నారని, గతంలో సత్తెనపల్లి కోడెల శివప్రసాద్ కి అడ్డాగా ఉందని, ఇప్పుడు అక్కడ అంబటి రాంబాబు రూలింగ్ గా మార్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


సత్తెనపల్లిలో నాన్న మాట వినపడకుండా చేస్తున్నది ఎవరు అనేది తనకు ఇప్పుడే తెలియాలని ఆయన అన్నారు. సత్తెనపల్లి లో ఇప్పుడు కోడెల శివరాం కి వైవి ఆంజనేయులుకి పొసగని నేపథ్యంలో దాన్ని కన్నా లక్ష్మీనారాయణ ఇంకా రాజేస్తున్నారంటూ కొంతమంది మాట్లాడడం గమనార్హం.



RRR Telugu Movie Review Rating

అప్పుడు తల్లితో ఇప్పుడు కూతురితో చేస్తున్న మెగాస్టార్....!!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>