MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money97c016f9-06fc-45b7-8e93-dbb72c2e2b97-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money97c016f9-06fc-45b7-8e93-dbb72c2e2b97-415x250-IndiaHerald.jpgఉద్యోగం కోసం వెతికి వెతికి అలసిపోయారా? లేదా ఉన్న ఉద్యోగం బోర్ కొడుతుందా? అయితే వ్యవసాయం వైపు అడుగులు వేయండి.. అత్యాధునిక పద్ధతులను అవలంబిస్తూ చేసే వ్యవసాయం మీకు ఖచ్చితంగా ఆదాయాన్ని అందిస్తుంది. అంతేకాదు నలుగురికి ఉపాధిని కల్పించడానికి కూడా మీరు ముందడుగు వేయవచ్చు. వ్యవసాయం మీకు మంచి ఆహ్లాదకరమైన జీవితాన్ని కూడా అందిస్తుంది. శారీరక శ్రమ పెంచుతుంది. పైగా ఎటువంటి రోగాలు దరి చేరవు. ఇకపోతే ఇప్పుడు మీకోసం ఒక వ్యాపార సాగును తీసుకురావడం జరిగింది. దీని వల్ల మీరు మంచి లాభాలను పొందవచ్చు. పుష్ప జాతుల్లో మల్లMONEY{#}Aqua;Rajahmundry;Yevaru;jobMoney: ఈ వ్యవసాయంతో రైతులకు లాభాల వర్షం..!Money: ఈ వ్యవసాయంతో రైతులకు లాభాల వర్షం..!MONEY{#}Aqua;Rajahmundry;Yevaru;jobSat, 29 Apr 2023 11:00:00 GMTఉద్యోగం కోసం వెతికి వెతికి అలసిపోయారా? లేదా ఉన్న ఉద్యోగం బోర్ కొడుతుందా? అయితే వ్యవసాయం వైపు అడుగులు వేయండి.. అత్యాధునిక పద్ధతులను అవలంబిస్తూ చేసే వ్యవసాయం మీకు ఖచ్చితంగా ఆదాయాన్ని అందిస్తుంది. అంతేకాదు నలుగురికి ఉపాధిని కల్పించడానికి కూడా మీరు ముందడుగు వేయవచ్చు. వ్యవసాయం మీకు మంచి ఆహ్లాదకరమైన జీవితాన్ని కూడా అందిస్తుంది. శారీరక శ్రమ పెంచుతుంది. పైగా ఎటువంటి రోగాలు దరి చేరవు. ఇకపోతే ఇప్పుడు మీకోసం ఒక వ్యాపార సాగును తీసుకురావడం జరిగింది. దీని వల్ల మీరు మంచి లాభాలను పొందవచ్చు.

పుష్ప జాతుల్లో మల్లెపూవులకు ప్రత్యేకమైన స్థానం ఉంది.  అటు శుభకార్యాలలో.. దేవాలయాల్లో అన్ని సందర్భాలలో కూడా ఎక్కువగా అలంకరణకు ఉపయోగించే మల్లెపూలు మగువలు మెచ్చిన మల్లెపూలు అని చెప్పవచ్చు. ఇకపోతే వేసవికాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మల్లెపూలను ఇష్టపడని వారంటూ బహుశా ఎవరు ఉండరేమో.. అందుకే మల్లెపూలకు నిత్యం డిమాండ్ ఉంటుంది.. కాబట్టి దీనినే మీరు చక్కటి వ్యాపార అవకాశంగా మార్చుకుంటే మంచి ఆదాయాలను పొందవచ్చు.

అసలే ఎండాకాలం ఇప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది.. కాబట్టి మీరు మల్లెతోట వేయడానికి ఒక ఎకరం పొలంను ఏర్పాటు చేస్తే సరిపోతుంది.. దీనికి నీరు పెద్దగా అవసరం ఉండదు. నీటి ఎద్దడి ఉండే ప్రాంతాలలో కూడా మల్లెతోట చిగురిస్తుంది. కేవలం వారానికి ఒకసారి తడి పెడితే చాలు మల్లెతోట చిగురిస్తుంది. ఇకపోతే మీరు మల్లె తోటను వేయాలనుకుంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మొక్కలు తెచ్చుకోవచ్చు.. లేదా మేలు రకం జాతులు కావాలనుకుంటే రాజమండ్రి సమీపంలోని కడియం నర్సరీల నుంచి మొక్కలను తెచ్చుకోవచ్చు.

మొక్కకు మొక్కకు 90 సెంటీమీటర్ల దూరం ఉండేలా గుంతలు ఏర్పాటు చేసి.. ముందుగానే శిలీంద్ర నాసిని ఎరువులను గుంతలో వేసి ఆ తర్వాత మొక్కలు నాటుకోవాలి. ఇలా ఒక్కో మల్లె మొక్క 12 సంవత్సరాల వరకు దిగుబడి అందిస్తుంది. కాబట్టి ఈ వ్యాపారం మీకు మంచి ఆదాయాన్ని అందిస్తుందని చెప్పవచ్చు.



RRR Telugu Movie Review Rating

కిరణ్ అబ్బవరం "మీటర్" మూవీ అఫీషియల్ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>