EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain-war32d8596d-48f3-4abb-9a52-e77defe2d67b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain-war32d8596d-48f3-4abb-9a52-e77defe2d67b-415x250-IndiaHerald.jpgఉక్రెయిన్ దేశంలో ప్రస్తుతం యుద్దం జరగడానికి కారణం నాటోలో చేరతామని ప్రకటించినా విషయంలో రష్యాతో విబేధాలు రావడం ప్రధానమైన అంశం. అయితే 15 నెలలు అయిపోతుంది యుద్దం ప్రారంభమై ఎంతో మంది ప్రాణాలు పోయాయి. దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. అయినా ఇప్పటికీ ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇవ్వడం లేదు. ఏవేవో కారణాలు చెబుతూ దాటవేస్తున్నారు. దీనిపై ఉక్రెయిన్ రాయబారి బ్రిటన్ లో పర్యటించారు. ఈ సమయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో మేమే రష్యాపై గెలుస్తాం. ఆ తర్వాత మీరు పిలిచి మమ్మల్ని నాటోలో చేరమని అడుగుతారUKRAIN WAR{#}Russia;Ukraine;American Samoa;Europe countriesఉక్రెయిన్‌.. రష్యా చేతిలో సర్వనాశనం తప్పదా?ఉక్రెయిన్‌.. రష్యా చేతిలో సర్వనాశనం తప్పదా?UKRAIN WAR{#}Russia;Ukraine;American Samoa;Europe countriesSat, 29 Apr 2023 08:00:00 GMTఉక్రెయిన్ దేశంలో ప్రస్తుతం యుద్దం జరగడానికి కారణం నాటోలో చేరతామని ప్రకటించినా విషయంలో రష్యాతో విబేధాలు రావడం ప్రధానమైన అంశం. అయితే 15 నెలలు అయిపోతుంది యుద్దం ప్రారంభమై ఎంతో మంది ప్రాణాలు పోయాయి. దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. అయినా ఇప్పటికీ ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇవ్వడం లేదు.  ఏవేవో కారణాలు చెబుతూ దాటవేస్తున్నారు. దీనిపై ఉక్రెయిన్ రాయబారి బ్రిటన్ లో పర్యటించారు. ఈ సమయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో మేమే రష్యాపై గెలుస్తాం. ఆ తర్వాత మీరు పిలిచి మమ్మల్ని నాటోలో చేరమని అడుగుతారు. అని బీరాలు పలికాడు.



రష్యాపై త్వరలో గెలవబోతున్నాం అని ప్రకటించాడు. అయితే యుద్ధంలో రోజురోజుకు ఎంతో మంది సైనికులు చనిపోతున్నారు. ఉక్రెయిన్ రష్యాపై ఇంకా పోరాడుతుందంటే దానికి కారణం కేవలం యూరప్ దేశాలు, అమెరికా ఇస్తున్న ఆయుధాల వల్లనే. ఈ దేశాలు గనక ఆయుధాలు ఇవ్వక పోయి ఉంటే ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ ను స్వాధీనం చేసేసుకునేది. ఉక్రెయిన్ లో ఇప్పటికే మరియపోల్, కేర్సన్, డోనెట్క్సీ లాంటి నగరాల ను కైవసం చేసుకుంది. రష్యా ను ఓడించి తర్వాత నాటో లో చేరేట్లు చేస్తామని చెప్పడం ఒక రకంగా హస్యాస్పదం లానే అనిపిస్తోంది. ఎందుకంటే రష్యా అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశం.


అది తలుచుకుంటే ఉక్రెయిన్ ను నామారూపాలు లేకుండా చేయగలదు. కానీ కేవలం యుద్ధంతో నే సరిపెడుతుంది. ఎందుకంటే అణ్వస్త్ర యుద్దం గనక జరిగితే ఉక్రెయినే కాదు. ప్రపంచ దేశాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇవన్నీ ఆలోచించి ఎన్ని దేశాలు అడ్డు వస్తున్నా కూడా రష్యా మాత్రం ఇంకా అణు దాడిని చేయడం లేదు. దీన్ని అలుసుగా తీసుకున్న ఉక్రెయిన్ రష్యాపై గెలుస్తాం, తర్వాత నాటో లో చేరతాం కబుర్లు చెబుతుంది. అదే జరిగితే రష్యా అణ్వస్త్రాలను వాడకుండా ఉంటుందా?



RRR Telugu Movie Review Rating

అమరావతి : టీడీపీకి జేసీ సమస్యగా మారారా ?

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>