Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-29c672d5-d771-463f-b75d-545a9f58ad11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-29c672d5-d771-463f-b75d-545a9f58ad11-415x250-IndiaHerald.jpgప్రెజెంట్ సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ''SSMB28'' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. గత కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చారు.. ఇక ఈ సినిమాలో ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిన కాంబో ఒకటి ఉన్న విషయం తెలిసిందే.. మహేష్ బాబు - జగపతి బాబు.. ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు సూపర్ హిట్ అనే చెప్పాలి. శ్రీమంతుడSocialstars lifestyle {#}maharshi;Makar Sakranti;Maharshi;Srimanthudu;S Radhakrishna;Aravinda Sametha Veera Raghava;thaman s;trivikram srinivas;mahesh babu;Pooja Hegde;koratala siva;Father;NTR;January;Cinemaఆ స్టార్ కోసం పవర్ ఫుల్ క్యారెక్టర్ రెడీ చేసిన త్రివిక్రమ్....!!ఆ స్టార్ కోసం పవర్ ఫుల్ క్యారెక్టర్ రెడీ చేసిన త్రివిక్రమ్....!!Socialstars lifestyle {#}maharshi;Makar Sakranti;Maharshi;Srimanthudu;S Radhakrishna;Aravinda Sametha Veera Raghava;thaman s;trivikram srinivas;mahesh babu;Pooja Hegde;koratala siva;Father;NTR;January;CinemaSat, 29 Apr 2023 23:05:20 GMTప్రెజెంట్ సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ''SSMB28'' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. గత కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చారు.. ఇక ఈ సినిమాలో ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిన కాంబో ఒకటి ఉన్న విషయం తెలిసిందే.. మహేష్ బాబు - జగపతి బాబు.. ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు సూపర్ హిట్ అనే చెప్పాలి. శ్రీమంతుడు సినిమా లో కొరటాల శివ వీరి కాంబోను తొలిసారి ప్రేక్షకులకు పరిచయం చేసాడు. ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరించాయి..

ఈ సినిమాలో తండ్రి రోల్ లో జగపతిబాబు అదరగొట్టాడు.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా ఆ తర్వాత మహర్షి సినిమాలో కూడా ఈ కాంబో రిపీట్ అయ్యింది.. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి ఈ కాంబో రిపీట్ కాబోతుంది.. ఈసారి త్రివిక్రమ్ ఈ కాంబోను సెట్ చేస్తున్నాడు. కానీ ముందు చేసిన రెండు సినిమాల్లా కాకుండా ఇది డిఫరెంట్ అనే చెప్పాలి.. ఎందుకంటే ఈసారి మహేష్ సినిమాలో జగపతిబాబు నెగిటివ్ రోల్ లో చేస్తున్నాడు.. ఈయన ఇప్పటికే పలు సినిమాల్లో విలన్ రోల్ ప్లే చేసి ఆకట్టుకున్నాడు. త్రివిక్రమ్ గత సినిమా అరవింద సమేత లో కూడా విలన్ రోల్ లో నటించాడు. దీంతో త్రివిక్రమ్ ఈసారి కూడా ఈయనను రిపీట్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతిబాబు మహేష్ సినిమాలో తన రోల్ గురించి తెలిపాడు. ఈయన మాట్లాడుతూ.. గతంలో త్రివిక్రమ్ తో కలిసి ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత లో తాను పోషించిన బసిరెడ్డి పాత్ర కంటే కూడా అంతకు మించి మరింత క్రూరంగా పవర్ఫుల్ గా మహేష్ బాబు సినిమాలో తన పాత్రను త్రివిక్రమ్ డిజైన్ చేసారని తెలిపారు.. ఈ సినిమా తర్వాత తన పాత్ర గురించి ఆడియెన్స్ మరింత మాట్లాడు కుంటారని తెలిపారు.. ఈయన చేసిన ఈ కామెంట్స్ తో ఈ సినిమాలో జగపతిబాబు రోల్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తుంటే థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అవ్వనుంది.



RRR Telugu Movie Review Rating

హాట్ వర్క్ ఔట్ తో రెచ్చగొడుతున్న దివి...!!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>