Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonib621e067-ff30-4321-a119-8a5518be0e88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonib621e067-ff30-4321-a119-8a5518be0e88-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్ చరిత్రలో ఉన్న బెస్ట్ కెప్టెన్లలో అటు భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పేరు కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తన అద్భుతమైన ఆట తీరుతో మాత్రమే కాదు కెప్టెన్ గా కూడా అటు భారత జట్టుకు అద్వితీయమైన విజయాలు అందించాడు మహేంద్రసింగ్ ధోని. ఇక భారత క్రికెట్ చరిత్రలో ఎవరికి సాధ్యం కాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్ గా కూడా ధోని కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఒత్తిడి సమయంలో కూడా ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ తన యాటిట్యూడ్ తో కూడా అభిమానులను ఆకర్షిస్తూ ఉంటాడు ధోని. క్రిDhoni{#}Ishtam;Chennai;MS Dhoni;Cricketధోనికి.. అలా బ్యాటింగ్ చేయడమే ఇష్టం : బ్రావోధోనికి.. అలా బ్యాటింగ్ చేయడమే ఇష్టం : బ్రావోDhoni{#}Ishtam;Chennai;MS Dhoni;CricketFri, 28 Apr 2023 15:30:00 GMTప్రపంచ క్రికెట్ చరిత్రలో ఉన్న బెస్ట్ కెప్టెన్లలో అటు భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పేరు కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తన అద్భుతమైన ఆట తీరుతో మాత్రమే కాదు కెప్టెన్ గా కూడా అటు భారత జట్టుకు అద్వితీయమైన విజయాలు  అందించాడు మహేంద్రసింగ్ ధోని. ఇక భారత క్రికెట్ చరిత్రలో ఎవరికి సాధ్యం కాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్ గా కూడా ధోని కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఒత్తిడి సమయంలో కూడా ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ తన యాటిట్యూడ్ తో కూడా అభిమానులను ఆకర్షిస్తూ ఉంటాడు ధోని.



 క్రికెట్ రూల్స్ విషయంలో ఎంతో కచ్చితంగా ఉంటూ ప్రత్యర్ధులను బోల్తా కొట్టించడంలో మహేంద్రసింగ్ ధోని ఎప్పుడూ ముందుంటాడు అని చెప్పాలి. అయితే ధోని కేవలం బెస్ట్ కెప్టెన్ మాత్రమే కాదు బెస్ట్ ఫినిషిర్ కూడా అన్న విషయం తెలిసిందే. కీలకమైన బ్యాట్స్మెన్లందరూ అవుట్ అయిన సమయంలో  బ్యాటింగ్ కి వచ్చే ధోని తన మెరుపు ఇన్నింగ్స్ తో జట్టుకు ఫినిషింగ్ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే అతన్ని బెస్ట్ ఫినిషర్ అనే అభివర్ణిస్తూ ఉంటారు ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై అటు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు, ప్రస్తుతం సీఎస్కే బౌలింగ్ కోచ్ అయిన ద్వేన్ బ్రావో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 ఇలా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఆ జట్టు బౌలింగ్ కోచ్ బ్రావో చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి. ధోనీకి ఫినిషింగ్ రోల్ లో ఆడడమే ఎంతో ఇష్టం అంటూ బ్రావో చెప్పుకొచ్చాడు. ధోని ఇలా చేయడం ద్వారా ఇతర ఆటగాళ్లకు ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం వస్తుందని.. ఇక ధోని కూడా ఇదే ఆలోచనతో ఉంటాడని చెప్పుకొచ్చాడు.  అయితే బ్రావో చెప్పినట్లుగానే ఈ సీజన్లో కూడా ధోని ఎక్కువగా ఏడు ఎనిమిది స్థానాల్లో బ్యాటింగ్కు వస్తున్నాడు. ఇక అతనికంటే ముందు రహనే, ధూబె, జడేజాలు అదరగొడుతూ ఉండడంతో ధోనికి ఎక్కువగా మ్యాచ్లలో బ్యాటింగ్ చేసేందుకు అవకాశం రావడం లేదు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

ఈ నెల 29న రాజమండ్రిలో ఆ ప్రదేశాలను పర్యటించనున్న "ఉగ్రం" మూవీ యూనిట్..!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>