Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/driving-1af81786-96ed-4e70-ac45-68ab9eb0200d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/driving-1af81786-96ed-4e70-ac45-68ab9eb0200d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఎవరైనా వాహనదారుడు వాహనాన్ని బయటకు తీసి రహదారి మీదికి రావాలి అంటే తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అన్న విషయం తెలిసిందే. డ్రైవింగ్ లైసెన్స్ లేదు అంటే చాలు ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు షాక్ ఇస్తూ భారీగా జరిమాణాలు విధిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ జరిమానాలకు భయపడిపోతున్న వాహనదారులు ఇష్టం లేకపోయినా ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి మొగ్గు చూపుతూ ఉన్నారు. అయితే కారు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సార్లు వాహనదారుDriving {#}School;Car;Good news;Traffic police;Good Newwz;Ishtam;central governmentగుడ్ న్యూస్ : డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్?గుడ్ న్యూస్ : డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్?Driving {#}School;Car;Good news;Traffic police;Good Newwz;Ishtam;central governmentFri, 28 Apr 2023 12:00:00 GMTప్రస్తుతం ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఎవరైనా వాహనదారుడు వాహనాన్ని బయటకు తీసి రహదారి మీదికి రావాలి అంటే తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అన్న విషయం తెలిసిందే. డ్రైవింగ్ లైసెన్స్ లేదు అంటే చాలు ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు షాక్ ఇస్తూ భారీగా జరిమాణాలు విధిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ జరిమానాలకు భయపడిపోతున్న వాహనదారులు ఇష్టం లేకపోయినా ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి మొగ్గు చూపుతూ ఉన్నారు. అయితే కారు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సార్లు వాహనదారులు ఇబ్బంది పడటం చూస్తూ ఉంటాం.



 ఎందుకంటే లైసెన్స్ తీసుకోవడానికి వెళ్లిన ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా డ్రైవింగ్ టెస్ట్ లో పాస్ కావలసి ఉంటుంది. ఇక రూల్స్ ప్రకారం ఉన్న ఒక సర్కిల్లో వాహనాన్ని సమర్ధవంతంగా నడిపినప్పుడు మాత్రమే ఇక సదురు వ్యక్తి సక్సెస్ఫుల్గా ఇలా డ్రైవింగ్ టెస్ట్ కంప్లీట్ చేసినట్లు అవుతుంది. అలా చేస్తేనే ఇక డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు అవుతుంది అని చెప్పాలి. ఇలాంటి రూల్ కారణంగా ఎంతో మంది ఇప్పటివరకు చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ అలాంటి వారికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డ్రైవింగ్ టెస్ట్ చేయకుండానే లైసెన్స్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.



 అదేంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్ ఇవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా.. ఇక్కడే ఒక మెలిక పెట్టింది కేంద్ర ప్రభుత్వం. లైసెన్స్ జారీ చేసే అధికారాన్ని మొత్తం డ్రైవింగ్ స్కూల్స్ కు కట్టబెడుతూ నిబంధనలను సడలించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే డ్రైవింగ్ స్కూల్ ఇచ్చే సర్టిఫికెట్ ఆధారంగానే ఇకనుంచి వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వనున్నారు. అదే సమయంలో డ్రైవింగ్ స్కూల్ పెట్టుకునే వారికి కూడా ఒక మెలిక పెట్టింది. ఇలా డ్రైవింగ్ స్కూల్ పెట్టుకోవాలంటే.. కనీసం ఐదేళ్ల అనుభవం.. కారు ట్రైనింగ్ కోసం ఎకరం స్థలం.. కనీసం ఇంటర్ చదువు పూర్తి చేసి ఉండాలి అంటూ నిబంధన పెట్టింది కేంద్రం.



RRR Telugu Movie Review Rating

సీక్రెట్ ప్లేస్ లో టాటూ వేయించుకున్న సంయుక్త.. దాని అర్ధమేంటో తెలుసా..!?

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>