MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bicchagadu20500aa3e-7c40-48a8-a0ce-ec5c101b8126-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bicchagadu20500aa3e-7c40-48a8-a0ce-ec5c101b8126-415x250-IndiaHerald.jpgప్రముఖ తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన 'బిచ్చగాడు' సినిమా ఎంత పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళం తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని అందుకుంది. 2016 లో విడుదలైన ఈ సినిమా అటు తమిళ ఇటు తెలుగు ఆడియోస్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. 'బిచ్చగాడు 2' అనే టైటిల్ తో వస్తున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాలవBicchagadu2{#}Priya;vijay antony;Telugu;Tamil;Smart phone;Hero;Cinema'బిచ్చగాడు 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?'బిచ్చగాడు 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?Bicchagadu2{#}Priya;vijay antony;Telugu;Tamil;Smart phone;Hero;CinemaFri, 28 Apr 2023 16:10:50 GMTప్రముఖ తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన 'బిచ్చగాడు' సినిమా ఎంత పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళం తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని అందుకుంది. 2016 లో విడుదలైన ఈ సినిమా అటు తమిళ ఇటు తెలుగు ఆడియోస్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. 'బిచ్చగాడు 2' అనే టైటిల్ తో వస్తున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాలవల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. 

తాజాగా ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి చిత్ర యూనిట్ ఆసక్తికర అప్డేట్ ను రిలీజ్ చేసింది. బిచ్చగాడు 2 మూవీ ట్రైలర్ తో పాటు విడుదల తేదీని అఫీషియల్ గా ప్రకటించింది మూవీ యూనిట్. బిచ్చగాడు 2 ట్రైలర్ను ఏప్రిల్ 29 ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నారు. అలాగే సినిమాని వేసవి కానుకగా మే 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఇదే తేదీన తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇక బిచ్చగాడు సీక్వెల్ ని మొదట మెట్రో, భారం లాంటి సూపర్ హిట్స్ అందించిన ప్రియా కృష్ణ స్వామి డైరెక్ట్ చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.

దీంతో విజయ్ ఆంటోనీ మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు.అంతేకాదు విజయ్ ఆంటోనీ ఫిలిమ్స్ కార్పొరేషన్ బ్యానర్ పై అతనే స్వయంగా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక బిచ్చగాడు మొదటి భాగంలో కన్నతల్లి ఆరోగ్యం కోసం ఓ స్వామీజీ సలహాతో వ్యాపారవేత్తగా ఉన్న హీరో బిచ్చగాడుగా మారుతాడు. 40 రోజులపాటు బిక్షం ఎత్తుకొని దీక్ష చేసి తన తల్లి ప్రాణాలను కాపాడుకుంటాడు. అయితే ఈసారి బిచ్చగాడు 2 లో విజయ్ ఆంటోని గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నాడు. ఒక గ్యాంగ్ స్టార్ బిచ్చగాడుగా ఎందుకు మారాడు అన్నదే ఈ సినిమా కథాంశంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇందులో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుందట...!!




RRR Telugu Movie Review Rating

"సైన్ధవ్" మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్లు ఇవే..!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>