Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-8f0b41b8-d301-4dcd-9d85-164b97f03529-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-8f0b41b8-d301-4dcd-9d85-164b97f03529-415x250-IndiaHerald.jpg2016 వ సంవత్సరం లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఘన విజయం సాధించిన సినిమా బిచ్చగాడు. ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ హీరోగా నటించాడు. ఆయనకు జోడీగా సట్నా టైటస్ హీరోయిన్ గా చేసింది. మొదట ఈ సినిమాను తమిళంలో విడుదల చేయగా అక్కడ మంచి విజయం సాధించింది. దాంతో కొద్ది రోజుల గ్యాప్ లోనే ఈ మూవీని తెలుగులో విడుదల చేశారు. అయితే ఈ సినిమా తమిళంలో కంటే ఎక్కువ కలెక్షన్స్ ను తెలుగులో రాబట్టడం విశేషం. అంతలా తెలుగు ప్రేSocialstars lifestyle {#}Parents;Chitram;Kollywood;marriage;vijay antony;Karthik;Blockbuster hit;Tollywood;Heroine;Tamil;Telugu;Cinemaఆ కారణం తోనే కేరిర్ నాశనం చేసుకున్న హీరోయిన్....!!ఆ కారణం తోనే కేరిర్ నాశనం చేసుకున్న హీరోయిన్....!!Socialstars lifestyle {#}Parents;Chitram;Kollywood;marriage;vijay antony;Karthik;Blockbuster hit;Tollywood;Heroine;Tamil;Telugu;CinemaFri, 28 Apr 2023 21:33:45 GMT2016 వ సంవత్సరం లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఘన విజయం సాధించిన సినిమా బిచ్చగాడు. ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.

శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ హీరోగా నటించాడు. ఆయనకు జోడీగా సట్నా టైటస్ హీరోయిన్ గా చేసింది. మొదట ఈ సినిమాను తమిళంలో విడుదల చేయగా అక్కడ మంచి విజయం సాధించింది.

దాంతో కొద్ది రోజుల గ్యాప్ లోనే ఈ మూవీని తెలుగులో విడుదల చేశారు. అయితే ఈ సినిమా తమిళంలో కంటే ఎక్కువ కలెక్షన్స్ ను తెలుగులో రాబట్టడం విశేషం. అంతలా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆధరించారు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా బిచ్చగాడు 2 తెరకెక్కుతోంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సట్నా టైటస్ గుర్తుండే ఉంటుంది. గురు సుక్రాన్` అనే తమిళ మూవీతో కెరీర్ ప్రారంభించిన సట్నా.. బిచ్చగాడు మూవీతో అటు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ఒక్కసారిగా పాపులర్ అయింది. ఇందులో ఆమెది డీ గ్లామర్ రోల్ అయ్యినప్పటికీ కూడా చాలా అందంగా మరియు హోమ్లీ గా కనిపిస్తూ ఆకట్టుకుంది. బిచ్చగాడు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సట్నాకు తెలుగు, తమిళ భాషల్లో ఆఫర్లు వెల్లువెత్తాయి.కానీ, ఆమె ఒప్పుకోలేదు, అప్పటి వరకు కమిట్ అయిన కొన్ని సినిమాలను పూర్తి చేసి సినిమాలకు శాశ్వతంగా దూరం అయింది. అందుకు కారణం బిచ్చగాడు మూవీ డిస్ట్రిబ్యూటర్ కార్తీక్ తో ప్రేమలో పడటమే. ఇంట్లో వీరి ప్రేమను నిరాకరించడంతో కార్తీక్-సట్నా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నారు. దాంతో సట్నా తల్లిదండ్రులు కార్తీక్పై కేసు కూడా పెట్టారు. ఆ తర్వాత వాళ్ళే కేసు వెనక్కి తీసుకొని వీళ్లిద్దరికీ 2017 వ సంవత్సరం లో అధికారికంగా మరోసారి ఘనంగా పెళ్లి చేసారు. ఈ దంపతులకు ఓ కొడుకు జన్మించాడు. మొత్తానికి సట్నా ప్రేమ, పెళ్లి అంటూ చేతులారా కెరీర్ ను నాశనం చేసుకుంది.లేకపోతే ఇప్పటికే తను టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకునేది అని చాలా మంది ఆమె గురించి మాట్లాడుతూ ఉంటారు.



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో ఆ హీరోయిన్ సారీ చెప్పిన ఎన్టీఆర్...!!

యుద్ధం: అమెరికా తెలివిగా యూరప్‌ దేశాలను వాడేస్తోందా?

ఉక్రెయిన్‌ కోసం.. రష్యాతో భారత్‌ యుద్ధం?

బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

పాక్‌లో మత పిచ్చి పీక్స్.. ఆ వ్యాక్సీన్‌ వద్దట?

ఇండియాతో ఫైట్‌.. దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌?

జగన్‌ సొంత జిల్లాలో యురేనియం అరాచకం?

సర్వే రిపోర్ట్‌: సీమలో ఈసారి జగన్‌కు కష్టమేనా?

మోదీ, పుతిన్‌ మధ్య ఆ ఒప్పందం కుదురుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>